STOCKS

News


గ్రాఫేన్‌ సెమీకండక్టర్‌ను కొంటున్న ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ

Friday 7th September 2018
Markets_main1536261044.png-20026

ఎల్‌అండ్‌టీ గ్రూపులో భాగమైన ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ సర్వీసెస్‌... బెంగళూరు కేంద్రంగా నడిచే గ్రాఫేన్‌ సెమీకండక్టర్‌ సర్వీసెస్‌ కంపెనీని కొనుగోలు చేయనుంది. గ్రాఫేన్‌లో 100 శాతం వాటా కొనుగోలుకు సంబంధించి ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ లావాదేవీ ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి పూర్తవుతుందని ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ సర్వీసెస్‌ వెల్లడించింది. కానీ, ఈ కొనుగోలుకు ఎంత వెచ్చించినదీ కంపెనీ వెల్లడించలేదు. గ్రాఫేన్‌ సెమీకండక్టర్‌ సెమీకండక్టర్‌ సేవల్లో వేగంగా వృద్ధి చెందుతున్న కంపెనీ. దేశంతోపాటు సింగపూర్‌, తైవాన్‌, మలేసియాలో కార్యకలాపాలను కలిగి ఉంది. ఈ కంపెనీ చిప్‌ డిజైన్‌, ఎండెడెడ్‌ సాఫ్ట్‌వేర్‌, ఇతర సొల్యూషన్ల సేవల్లో ఉంది. 2017-18లో ఈ కంపెనీ టర్నోవర్‌ రూ.66.3 కోట్లు.



You may be interested

లాభాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Friday 7th September 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం లాభాలతో ట్రేడవుతోంది. ఉదయం 8:49 సమయంలో సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 15 పాయింట్ల లాభంతో 11,559 పాయింట్ల వద్ద ఉంది. అయితే మరోవైపు నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌లో గురువారం నాటి ముగింపు 11,567 పాయింట్లతో పోలిస్తే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 8 పాయింట్ల నష్టంతో ట్రేడవుతుందని గమనించాలి. దీంతో నిప్టీ గురువారం నెగటివ్‌గా లేదా ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా

పోర్ట్‌ఫోలియో వృద్ధికి ‘దమానీ’ సక్సెస్‌ టిప్స్‌

Friday 7th September 2018

వ్యాల్యూ ఇన్వెస్టర్‌గా పేరు తెచ్చుకున్న రమేష్‌ దమానీ, డీమార్ట్‌ పేరుతో రిటైల్‌ దుకాణాల చైన్‌ను ప్రారంభించి, ప్రముఖ రిటైల్‌ కంపెనీల్లో ఒకటిగా, అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రిటైల్‌ కంపెనీగా దాన్ని తీర్చిదిద్ది... టాప్‌ వ్యాపార వ్యూహకర్తల్లో ఒకరిగా నిలిచారు. మరి సాధారణ ఇన్వెస్టర్‌, ఓ ప్రముఖ ఇన్వెస్టర్‌గా అవతరించేందుకు, తమ సంపద సృష్టికి అనుసరించాల్సిన చిట్కాలను ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు.   బేర్‌ మార్కెట్లో కొనుగోళ్ల పట్ల

Most from this category