STOCKS

News


ఫలితాలతో ఎల్‌ అండ్‌ టీ దూకుడు..!

Thursday 1st November 2018
Markets_main1541050587.png-21625

ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ లార్సెన్ అండ్ టుబ్రో (ఎల్‌అండ్‌టీ) షేరు గురువారం ట్రేడింగ్‌లో 6.50శాతం లాభపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కంపెనీ సాధించిన అద్భుతమైన ఫలితాలు షేరు ర్యాలీకి కారణమయ్యాయి. కంపెనీ నికరలాభం ఈ క్యూ2లో 28శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.2020 కోట్లుగా ఉన్న నికరలాభం ఈ క్యూ2లో రూ.2593 కోట్లకు పెరిగింది. మొత్తం ఆదాయం రూ.26, 846 కోట్ల నుంచి రూ.32,506 కోట్లకు పెరిగింది. దివాలా చట్టం కారణంగా మొండిబకాయిలు భారీ స్థాయిలో రీకవరీ అవుతున్నాయని, ఇది బిజినెస్‌ సెంటిమెంట్‌ను పెంచినట్లు కంపెనీ తెలిపింది. క్యూ2 ఫలితాల జోష్‌తో నేడు బీఎస్‌ఈలో ఎల్‌ అండ్‌ టీ షేరు 3శాతం లాభంతో రూ.1336.15 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో ఇన్వెస్టర్లు కొనుగోళ్ల మద్దతు తెలపడంతో షేరు 6.50శాతం లాభంతో రూ.1382.00ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని చేరింది. ఉదయం గం.10:30ని.లకు షేరు గత ముగింపు ధర రూ.1298.35తో పోలిస్తే 5శాతం లాభంతో రూ.1362.60ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇక షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 1176.00 రూ.1469.60లుగా నమోదయ్యాయి.


L&T

You may be interested

‘‘రాజీ’’నామా

Thursday 1st November 2018

 ప్రస్తుతానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలనే యోచనలో కేంద్రం - ఆ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన ఆర్థిక శాఖ - ఆర్‌బీఐ స్వయం ప్రతిపత్తిని గౌరవిస్తామని వెల్లడి - సెక్షన్‌ 7 కింద పంపిన లేఖల ప్రస్తావన మాత్రం లేదు - తాను అంతకు మించి చెప్పేదేమీ లేదన్న జైట్లీ - ఉదయమంతా ఉరి‍్జత్‌ పటేల్‌ రాజీనామా వదంతులు - సాయంత్రం ఆర్థిక శాఖ ప్రకటనతో సర్దుకున్న పరిస్థితి - కానీ విమర్శలు కొనసాగిస్తున్న ఆర్థిక అధికారులు కేంద్ర ప్రభుత్వానికి -

3వారాల కనిష్టం నుంచి పుత్తడి రికవరీ

Thursday 1st November 2018

డాలర్‌ ఇండెక్స్‌ బలహీనత కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో గురువారం పసిడి ధర 3వారాల కనిష్టస్థాయి నుంచి రీవకరీ అవుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో భారత వర్తమానకాలం ప్రకారం ఉదయం గం.10.00లకు ఔన్స్‌ పసిడి ధర 4డాలర్ల లాభపడి 1,219.00 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ప్రపంచమార్కెట్లల్లో లాభాల ర్యాలీతో పాటు బ్రెగ్జిట్‌ అంశంలో సానుకూలతల కారణంగా నేటి ట్రేడింగ్‌లో డాలర్‌ ఇండెక్స్‌ అమ్మకాల ఒత్తిడికి లోనవుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో ఆరు ప్రధాన

Most from this category