STOCKS

News


‘ఎల్‌ అండ్‌ టీ’ టార్గెట్‌ ధర రూ.1,880

Thursday 1st November 2018
Markets_main1541069709.png-21642

దేశీ ఇంజనీరింగ్‌, నిర్మాణ రంగ దిగ్గజం లార్సన్‌ అండ్‌ టూబ్రో (ఎల్‌ అండ్‌ టీ) షేరుకు పలు బ్రోకింగ్‌ సంస్థలు అవుట్‌పెర్ఫార్మర్‌ రేటింగ్‌ను ఇచ్చాయి. ప్రస్తుత ఏడాది జూలై–సెప్టెంబర్‌ (క్యూ2) ఆర్థిక ఫలితాల వెల్లడి అనంతరం ఈ కంపెనీ షేరు రేటింగ్స్‌ను అత్యధిక శాతం బ్రోకరేజ్‌లు సవరించాయి. కంపెనీ నికర లాభం కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన 28 శాతం వృద్ధి చెందండం ఆధారంగా సీఎల్‌ఎస్‌ఏ ఈ షేరుకు బై రేటింగ్‌ ఇచ్చింది. గత క్యూ2లో రూ.2,020 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.2,593 కోట్లకు పెరిగడం వంటి ఆశాజనక అంశాలను బేరీజు వేసుకుని రూ.1,730 టార్గెట్‌ ధరను ఇచ్చినట్లు ప్రకటించింది. అంతకుముందు ఇచ్చిన రూ.1,298.35 టార్గెట్‌ను సవరించి.. 33 శాతం టార్గెట్‌ ధరను పెంచింది. ఈ షేరు గురువారం (నవంబర్‌ 1న) రెండున్నర శాతం లాభపడి రూ.1,331 వద్ద ముగిసింది. సెప్టెంబర్‌ త్రైమాసికంలో గ్రూప్‌ కంపెనీలన్నింటి ఆర్డర్లు 46 శాతం పెరిగి రూ.41,921 కోట్లకు పెరగడం, ఆదాయం 21 శాతం వృద్ధిచెంది రూ.32,081 కోట్లుగా నమోదుకావడం వంటి అంశాల ఆధారంగా ఇన్వెస్టెక్‌ బ్రోకింగ్‌ సంస్థ ఈ కంపెనీ షేరు టార్గెట్‌ ధరను రూ.1,725 వద్ద ప్రకటించింది. మాక్వైరీ రూ.1,880 టార్గెట్‌ ధర ఇచ్చింది. మౌలిక రంగ ఆర్డర్లు 69 శాతం వృద్ధితో రూ.23,406 కోట్లకు పెరిగడం వంటి అంశాలను బేరీజు వేసుకుని ఈ మేరకు రేటింగ్‌ ఇచ్చినట్లు వెల్లడించింది. ఇక జేపీ మోర్గాన్‌ ఓవర్‌వెయిట్‌ను ఇచ్చింది. రూ.1,570 వద్ద టార్గెట్‌ను ప్రకటించింది.



You may be interested

భారీ రాబడిని ఇవ్వనున్న ఎన్‌బీఎఫ్‌సీలు..!

Thursday 1st November 2018

- వచ్చే 3-6 నెలల్లోనే 2013-14 తరహా రాబడి - కార్నెలియన్ క్యాపిటల్ అడ్వైజర్స్ ఫౌండర్‌ వికాస్ ఖేమానీ వ్యాఖ్య ముంబై: నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) వ్యవస్థలో ఉన్నటువంటి ఖాళీని పూరించడానికి వచ్చినవి కాదని వ్యాఖ్యానించిన కార్నెలియన్ క్యాపిటల్ అడ్వైజర్స్ ఫౌండర్‌ వికాస్ ఖేమానీ.. ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి అవసరం కోసం ఏర్పడిన సంస్థలుగా ఇవి ఉన్నాయని విశ్లేషించారు. బ్యాంకులు చేయడానికి వీలులేనటువంటి వ్యాపారాన్ని ఈ సంస్థలు కొనసాగిస్తున్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో

పునరుద్ధణకు సిద్ధమైన ఎస్‌బీఐ..!

Thursday 1st November 2018

- టార్గెట్‌ ధర రూ.365 ముంబై: దేశీ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) పునరుద్ధణకు సిద్దమైందని డాయిష్ బ్యాంక్ విశ్లేషించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ద్రవ్యలభ్యత కట్టడిలో అత్యధిక ప్రయోజనం పొందనున్నది ఈ బ్యాంకేనని అంచనాను వెల్లడించింది. అనుబంధ సంస్థల విలీనాల అనంతరం సవాళ్లను ఎదుర్కొంటున్న బ్యాంకులో 2019-20 నుంచి ఎర్నింగ్స్‌ వృద్ధిరేటు నమోదుకానుందని పేర్కొంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఎస్‌బీఐ షేరు ధర 8 శాతం

Most from this category