News


మైండ్‌ట్రీలో మెజారిటీ వాటాకు ఎల్‌అండ్‌టీ ఓపెన్‌ ఆఫర్‌

Saturday 8th June 2019
Markets_main1559977137.png-26169

  • రూ.5,030 కోట్లు వెచ్చించే అవకాశం
  • ఒక్కో షేర్‌ రూ.980 ధరకు కొనుగోలు
  •  ఈ నెల 17న మొదలై 28న ముగింపు

న్యూఢిల్లీ: మైండ్‌ ట్రీ కంపెనీ టేకోవర్‌లో భాగంగా ఎల్‌ అండ్‌ టీ కంపెనీ రూ.5,029.8 కోట్ల ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా మైండ్‌ ట్రీ కంపెనీలో 31 శాతం వాటాకు సమానమైన 5.13 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేస్తామని ఎల్‌ అండ్‌ టీ తెలిపింది. ఒక్కో షేర్‌కు రూ.980 ధరను (మైండ్‌ ట్రీ షేర్‌ శుక్రవారం రూ.969 ధర వద్ద ముగిసింది) ఆఫర్‌ చేస్తోంది. ఈ ఓపెన్‌ ఆఫర్‌ ఈ నెల 17 న మొదలై 28న ముగుస్తుంది. షెడ్యూల్‌ ప్రకారమైతే ఈ ఓపెన్‌ ఆఫర్‌ మే 14 నుంచే మొదలు కావలసి ఉంది. అయితే మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ నుంచి అనుమతి రావడం ఆలస్యం కావడంతో ఓపెన్‌ ఆఫర్‌లో జాప్యం చోటు చేసుకుంది. అసెట్‌- లైట్‌ సర్వీసెస్‌ బిజినెస్‌ పోర్ట్‌ఫోలియోలో ఆదాయం, లాభాలు పెంచుకునే వ్యూహంలో భాగంగా మైండ్‌ ట్రీ కంపెనీని ఎల్‌ అండ్‌  టీ కొనుగోలు చేస్తోంది. 
మొత్తం రూ.10,700 కోట్లు...
ఎల్‌ అండ్‌టీ కంపెనీ ఇప్పటికే మైండ్‌ ట్రీలో 35.15  శాతం వాటా షేర్లను కొనుగోలు చేసింది. తాజా ఓపెన్‌ ఆఫర్‌ పూర్తిగా సబ్‌స్క్రైబయితే మైండ్‌ట్రీలో ఎల్‌ అండ్‌ టీ వాటా 66 శాతానికి చేరుతుంది. మొత్తం మీద మైండ్‌ ట్రీలో 66 శాతం వాటా కోసం ఎల్‌  అండ్‌ టీ కంపెనీ రూ.10,700 కోట్లు వెచ్చిస్తోంది. వి.జి. సిద్ధార్థ, కాఫీ డే ట్రేడింగ్‌ లిమిటెడ్‌, కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ల నుంచి 20.15 శాతం వాటాకు సమానమైన 3.33 కోట్ల షేర్లను ఎల్‌ అండ్‌ టీ కొనుగోలు చేసింది. ఒక్కో షేర్‌కు రూ.980 చెల్లించింది. ఈ వాటా షేర్ల కోసం మొత్తం రూ.3,269 కోట్లను వెచ్చించింది. ఇక మార్చి 18న యాక్సిస్‌ క్యాపిటల్‌ లిమిటెడ్‌ ద్వారా 15 శాతం వాటాకు సమానమైన 2.48 కోట్ల షేర్లను రూ.2,434 కోట్లకు కొనుగోలు చేసింది. 



You may be interested

నిప్పన్‌ లైఫ్‌ ఓపెన్‌ ఆఫర్‌

Saturday 8th June 2019

ఆర్‌నామ్‌లో 22.49 శాతం వాటా కోసం ఒక్కో షేర్‌ కొనుగోలు ధర రూ.230 మొత్తం రూ.3,179 కోట్లు కేటాయింపు న్యూఢిల్లీ: నిప్పన్‌ లైఫ్‌ కంపెనీ ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించింది. రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌లో (ఆర్‌నామ్‌) 22.49 శాతం వాటా కోసం నిప్పన్‌ లైఫ్‌ కంపెనీ ఈ ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఓపెన్‌ ఆఫర్‌ కోసం నిప్పన్‌ కంపెనీ రూ.3,179 కోట్లు వెచ్చిస్తోంది. ఈ ఓపెన్‌ ఆఫర్‌లో భాగంగా 22.49 శాతం

‘టెక్‌’ రూట్లో సహకార బ్యాంకులు!

Saturday 8th June 2019

పెరుగుతున్న క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సేవల వాడకం టెక్నాలజీ లేకుంటే మెరుగైన సేవలు చాలా కష్టం దీనికితోడు తగ్గుతున్న ఐటీ ఇన్‌ఫ్రా వ్యయాలు సొంత ఐటీ విభాగం లేకున్నా... ఔట్‌సోర్సింగ్‌తో వీలు ఎస్‌వీసీ, కాస్మోస్‌ తదితర బ్యాంకుల ముందంజ కాకపోతే సవాళ్లూ ఉన్నాయంటున్న నిపుణులు న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ రంగంలో టెక్నాలజీ వినియోగం విస్తృతంగా పెరుగుతుండటంతో పట్టణ ప్రాంత సహకార బ్యాంకులు (యూసీబీ) కూడా డిజిటల్‌ బాట పడుతున్నాయి. స్మార్ట్‌ఫోన్లు, హైస్పీడ్‌ కనెక్టివిటీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్‌ లెర్నింగ్‌ వంటివి

Most from this category