STOCKS

News


రెండు నెలల గరిష్టానికి ఎల్‌అండ్‌టీ

Friday 31st August 2018
Markets_main1535710785.png-19840

లార్సెన్‌ అండ్‌ టుబ్రో (ఎల్‌అండ్‌టీ) షేరు ధర ఎన్‌ఎస్‌ఈలో రూ.1,374ని తాకింది. ఇది రెండు నెలల గరిష్ట స్థాయి కావడం గమనార్హం. శుక్రవారం ఒకానొక దశలో షేరు ధర రెండు శాతంమేర పెరిగింది. ఇక ఈ స్టాక్‌ గత రెండు వారాల్లో అంటే షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించిన దగ్గరి నుంచి ఏకంగా 11 శాతంమేర ఎగసింది. ఎల్‌అండ్‌టీ షేర్ల బైబ్యాక్‌ కంపెనీకి చాలా పాజిటివ్‌ అని బ్రోకరేజ్‌ సంస్థ మోతీలాల్‌ ఓస్వాల్‌ సెక్యూరిటీస్‌ పేర్కొంది. రూ.1,570 టార్గెట్‌ ప్రైస్‌తో ఎల్‌అండ్‌టీ స్టాక్‌కు బై రేటింగ్‌ ఇచ్చింది. 
బైబ్యాక్‌ వివరాలు..
దిగ్గజ కన్‌స్ట్రక‌్షన్‌ రంగ కంపెనీ ఎల్‌అండ్‌టీ బోర్డు ఆగస్ట్‌ 24న షేర్ల బైబ్యాక్‌కు ఆమోదం తెలిపింది. ఒక్కొక్క షేరును ఎంత ధరకు కొనుగోలు చేయనుందో ప్రకటించింది. ఎల్‌అండ్‌టీ షేర్లను బైబ్యాక్‌ చేయడం ఇదే తొలిసారి. కంపెనీ బోర్డు రూ.9,000 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్‌కు ఆమోదం తెలిపింది. ఇది ఎల్‌అండ్‌టీ ఈక్విటీలో 4.29 శాతానికి సమానం. బైబ్యాక్‌ విషయానికి వస్తే ఒక్కొక్క షేరుకు రూ.1,500 చెల్లించి బైబ్యాక్‌ చేస్తామని కంపెనీ ప్రకటించింది.   


L&T

You may be interested

మిశ్రమంగా ముగిసిన మార్కెట్‌

Friday 31st August 2018

రూపాయి పతనంతో రాణించిన ఫార్మా, ఐటీ షేర్లు మార్కెట్‌ ఈ వారంతపు రోజైన శుక్రవారం మిశ్రమంగా ముగిసింది. రూపాయి జీవితకాల కనిష్టానికి చేరుకోవడం, జూన్‌ త్రైమాసిక జీడీపీ గణాంకాల వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్యయుద్ధ భయాలు మరోసారి తెరపైకి రావడం తదితర కారణాలు సూచీల మిశ్రమ ముగింపునకు కారణమయ్యాయి. అత్యధికంగా బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగ షేర్లు నష్టపోగా, రూపాయి పతనంతో

బ్యాంకింగ్‌ షేర్లు వదిలించుకుంటున్న ఎల్‌ఐసీ?!

Friday 31st August 2018

ఐడీబీఐ డీల్‌ కారణం దేశీయ అతిపెద్ద సంస్ధాగత ఇన్వెస్టర్‌ ఎల్‌ఐసీ  బ్యాంకింగ్‌రంగ షేర్లను తెగనమ్మడం ఆరంభించింది. ఐడీబీఐలో వాటాల కొనుగోలుకు ఎల్‌ఐసీ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ  డీల్‌ పూర్తికావాలంటే భాగంగా ఎల్‌ఐసీ ఇతర బ్యాంకింగ్‌ సంస్థల్లో వాటాలు తగ్గించుకోవాల్సిఉంటుంది. అందుకోసం గత ఏడాదిగా ఎల్‌ఐసీ తన వద్ద ఉన్న బ్యాంకింగ్‌ షేర్లను అమ్ముకుంటోంది. 2017 జూన్‌తో పోలిస్తే 2018 జూలై నాటికి తన వద్ద ఉన్న 30 బ్యాంకుల్లో 27

Most from this category