STOCKS

News


10000- 13000 పాయింట్ల రేంజ్‌లో నిఫ్టీ!

Saturday 8th December 2018
Markets_main1544258661.png-22769

వచ్చే ఏడాదిపై కోటక్‌ సెక్యూరిటీస్‌ అంచనా
వచ్చే ఏడాది చివరి వరకు నిఫ్టీ పదివేలు- పదమూడు వేల పాయింట్ల శ్రేణిలోనే కదలాడవచ్చని కోటక్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. ఎన్నికల ఫలితాలను బట్టి ఈ కదలికలుంటాయని తెలిపింది. అప్‌సైడ్‌ టార్గెట్‌ అందుకోవాలంటే, ఎర్నింగ్స్‌ జోరు ఇలాగే కొనసాగాలని, ఎన్నికల్లో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలని తెలిపింది. వచ్చే రెండేళ్లకు కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌లో 16 శాతం సరాసరి చక్రీయ వార్షిక వృద్ధి ఉంటుందన్న అంచనా వేసుకుంటే నిఫ్టీ ఈపీఎస్‌ 2019 డిసెంబర్‌ నాటికి 680- 700 రూపాయలకు చేరుతుందని కోటక్‌ సెక్యూరిటీస్‌ సీఈఓ కమలేశ్‌ రావ్‌ చెప్పారు. ఒకవేళ ఎర్నింగ్స్‌ పేలవంగా మారి, ఎన్నికల ఫలితాలు నీరసంగా ఉంటే నిఫ్టీ వచ్చే ఏడాది చివరకు పదివేల పాయింట్లకు దిగజారుతుందని అభిప్రాయపడ్డారు.
ఎర్నింగ్స్‌ వృద్ధి ఇలా


ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంపెనీల ఎర్నింగ్స్‌ రెండంకెల స్థాయిని కొనసాగించవచ్చని, 14-15 శాతం వృద్ది ఉంటుందని కమలేశ్‌ అంచనా వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నిఫ్టీ ఎర్నింగ్స్‌ 29 శాతానికి ఎగబాకవచ్చన్నారు. ఎర్నింగ్స్‌ వృద్దిలో బ్యాంకింగ్‌ రంగం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఎన్‌సీఎల్‌టీలో 12 కేసులకు ఏడు కేసుల్లో తీర్పు వచ్చిందని, ఇదే రీతిలో కొనసాగితే బ్యాంకులకు నిధుల వరద ఉంటుందని వివరించారు. 
అంతర్జాతీయం అలా
ప్రపంచ మార్కెట్లను ఇకమీదట ట్రేడ్‌వార్‌, ఫెడ్‌ రేట్ల పెంపు, బ్రెగ్జిట్‌ అంశాలు ప్రభావితం చేస్తాయని రావు చెప్పారు. ట్రేడ్‌వార్‌ అంశం తిరిగి తెరపైకి వచ్చినా, ఫెడ్‌ అనూహ్య చర్యలు చేపట్టినా మార్కెట్లు మరోమారు భయానికి లోనవుతాయన్నారు. దేశీయంగా వచ్చే ఆరునెలల్లో ఎన్నికల కారణంగా సూచీలు తీవ్ర కదలికలు నమోదు చేస్తాయని చెప్పారు. ఇలాంటి సమయంలోనే దీర్ఘకాలిక మదుపుకు అవకాశాలు వస్తాయని, వాటిని అందిపుచ్చుకోవాలని సూచించారు. ఎర్నింగ్స్‌ బాగుండి, మంచి మేనేజ్‌మెంట్‌ ఉన్న కంపెనీల షేర్లను ఎంచుకోవాలని సలహా ఇచ్చారు. 

 



You may be interested

రికార్డు స్థాయికి చైనా నవంబర్‌ వాణిజ్య మిగులు

Saturday 8th December 2018

చైనా వాణిజ్య మిగులు గతేడాదితో పోలిస్తే ఈ నవంబర్‌లో రికార్డు స్థాయిలో వాణిజ్య మిగులును సాధించింది. నవంబర్‌లో ఆ దేశ వాణిజ్య మిగులు 44.7 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. గతేడాది ఇదే నవంబర్‌లో సాధించిన 35 బిలియన్‌ డాలర్ల వాణిజ్య మిగులుతో పోలిస్తే ఇది 21శాతం అధికం. ట్రేడ్‌ వార్‌లో భాగంగా అమెరికా దిగుమతులపై నిషేదాన్ని విధించడంతో వాణిజ్య మిగులు రికార్డు స్థాయిని చేరినట్లు మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎగుమతులు,

ఎగ్జిట్‌ పోల్స్‌ ఏం చేస్తాయో!

Saturday 8th December 2018

సోమవారం మార్కెట్లో కరెక‌్షన్‌ తప్పదా? ఫలితాలు పాజిటివ్‌గా ఉంటే ర్యాలీకి అవకాశం క్రూడాయిల్‌ ధర పెరిగిందా? తగ్గిందా? డాలర్‌తో రూపాయి విలువ బలపడిందా? పతనమైందా? క్యాడ్‌ ఎంత ఉంది? ట్రేడ్‌వార్‌ ముగిసినట్లేనా?.. ఇవన్నీ మార్కెట్లు ప్రతిరోజూ పట్టించుకునే అంశాలు. వీటి ఆధారంగానే మార్కెట్‌ కదలికలుంటుంటాయి. కానీ ఇవన్నీ ప్రస్తుతం అప్రస్తుతంగా మారాయి. ఈ వారానికి ఒకే ఒక్క విషయం మార్కెట్‌ కదలికలను శాసించబోతోంది. అదే.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితం.  సార్వత్రిక ఎన్నికలకు సెమి ఫైనల్స్‌గా భావించే ఈ ఎన్నికల

Most from this category