STOCKS

News


ఈ ఆరు షేర్లూ కొనొచ్చు-కొటక్‌

Friday 8th March 2019
Markets_main1552041439.png-24496

లోక్‌సభ ఎన్నికలు, అమెరికా–చైనా వాణిజ్య భయాలు, బ్రెగ్జిట్‌ తదితర అంశాల కారణంగా ఈ ఏడాది అంతా ఒడుదుడుకులమయంగా మార్కెట్‌ వుంటుందని, ఈ తరుణంలో... గత ఏడాదికాలంగా పతనమైన షేర్ల నుంచి ఆయా రంగాల్లో నాణ్యతగలిగిన వాటిలో ఇన్వెస్ట్‌ చేయవచ్చని కొటక్‌ సెక్యూరిటీస్‌ సూచించింది. లార్జ్‌క్యాప్స్‌ నుంచి మంచి వృద్ధి కనపరుస్తున్నవాటిని, మిడ్‌క్యాప్స్‌ నుంచి మంచి యాజమాన్యం కలిగి, సబబైన విలువలతో ట్రేడవుతున్నవాటిని కొనవచ్చని కొటక్‌ విడుదల చేసిన నోట్‌లో పేర్కొంది. లార్జ్‌క్యాప్స్‌లో రంగాలకు సంబంధించి బ్యాంకులు, ఫార్మా, ఆయిల్‌ అండ్‌ గ్యాస్, మెటల్స్, ఐటీ సర్వీసుల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలపై దృష్టిసారించాలని ఇన్వెస్టర్లకు కొటక్‌ సూచించింది. మిడ్‌క్యాప్స్‌ను క్యాపిటల్‌ గూడ్స్, కన్‌స్ట్రక్షన్, ఆటోయాన్సిలరీస్‌ రంగాల నుంచి షేర్లను ఎంపికచేసుకుంటే మెరుగైన రాబడులు పొందవచ్చని పేర్కొంది. టాప్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఐడియాలుగా ఆరు షేర్లను కొటక్‌ సెక్యూరిటీస్‌ సిఫార్సుచేసింది. అవి...

1. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌...టార్గెట్‌ ధర రూ.435
2. ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌....టార్గెట్‌ ధర రూ. 590
3. బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌...టార్గెట్‌ ధర రూ. 100
4. ఏజీస్‌ లాజిస్టిక్స్‌...టార్గెట్‌ ధర రూ. 250
5. సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌...టార్గెట్‌ ధర రూ. 425
6. సూర్య రోషిణి....టార్గెట్‌ ధర రూ. 330

 



You may be interested

నాలుగురోజుల లాభాలకు బ్రేక్‌

Friday 8th March 2019

11050 మార్కును కోల్పోయి నిఫ్టీ ప్రపంచమార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ శుక్రవారం నష్టంతో ముగిసింది. సెన్సెక్స్‌ 54 పాయింట్లను కోల్పోయి 36,671 వద్ద, నిఫ్టీ 10500 మార్కును చేజార్చుకుని 23 పాయింట్లు నష్టపోయి 11,035 వద్ద ముగిసింది. దీంతో  నాలుగు రోజుల ర్యాలీకి బ్రేక్‌పడినట్లైంది.  అటో, బ్యాంక్‌, మెటల్‌, ఫార్మా, ఐటీ షేర్ల అమ్మకాలు జరగ్గా, ఎఫ్‌ఎంజీసీ, ఇన్ఫ్రా రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. కీలకమైన

10డాలర్లు పెరిగిన పసిడి

Friday 8th March 2019

అంతర్జాతీయ ఆర్థికవృద్ధి మందగమన ఆందోళనలు పసిడి ధరకు కలిసొస్తున్నాయి. ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర శుక్రవారం 10డాలర్లు లాభపడింది. డాలర్‌ ఇండెక్స్‌ ఈ ఏడాది గరిష్టం నుంచి వెనకడుగు వేయడంతో పాటు అమెరికా పిబ్రవరి ఉద్యోగ గణాంకాల విడుదల కోసం ఇన్వెస్టర్ల ఎదురుచూపులు, ఈల్డ్‌ పతనం తదితర ప్రతికూలాంశాలు పసిడి ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపాయి. నేడు ఆసియాలో ఔన్స్‌ పసిడి ధర 10డాలర్లు పెరిగి 1,296.05 డాలర్ల ఇంట్రాడే

Most from this category