News


ఈ దశలో ఇన్వెస్టర్ల ముందున్న మార్గాలు?

Sunday 11th November 2018
Markets_main1541959969.png-21874

రెండు వరుస నెలల పతనం తర్వాత దేశీయ స్టాక్‌ మార్కెట్లు ప్రస్తుతం విరామం తీసుకుని తదుపరి డైరెక్షన్‌ కోసం ఎదురు చూస్తున్నాయి. మరి మార్కెట్ల పతనం ముగిసిందా? లేక మరికొంత కాలం ఆగిపోవాలా..? ఈ విషయాలు కొత్త ఇన్వెస్టర్లకు తెలియడం కొంచెం కష్టమైన పనే. ఈ విషయంలో ఇన్వెస్టర్లు అనుసరించతగిన వ్యూహాలను కోటక్‌ సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీకాంత్‌ చౌహాన్‌ తెలియజేశారు. 

 

తాజా మార్కెట్‌ ర్యాలీలో బలహీనమైన దీర్ఘకాలిక పొజిషన్లు ఉండే వాటి నుంచి వైదొలగాలని చౌహాన్‌ సూచించారు. ఒకవేళ మార్కెట్లు గత కనిష్ట స్థాయిలను బ్రేక్‌ చేస్తే షార్ట్‌కు వెళ్లొచ్చన్నారు. కన్జ్యూమర్‌ డ్యురబుల్స్‌, ఆటోమొబైల్‌ కంపెనీల పనితీరును చూడాలన్నారు. పరిస్థితులు కుదుటపడినదీ, లేనిదీ ఈ కంపెనీల పనితీరుతో సంకేతాలు అందుతాయని తెలియజేశారు. ఇక ఫార్మాస్యూటికల్స్‌, టెక్నాలజీ లేదా ఎఫ్‌ఎంసీజీ వంటి సురక్షిత రంగాల షేర్లు గత గరిష్ట స్థాయిల దిశగా కదులుతున్నాయా అన్నది పరిశీలించాలన్నారు. ఫండ్‌ మేనేజర్లకు ఇవి ఇష్టమైన రంగాలని, అనిశ్చిత పరిస్థితుల్లో వీటిపై ప్రభావం తక్కువే ఉంటుందని చౌహాన్‌ అభిప్రాయపడ్డారు. మార్కెట్లు పడిపోతే కీలకమైన మద్దతు స్థాయిల వద్ద బలమైన కంపెనీల షేర్లను కొనుగోలు చేయవచ్చని సూచించారు. పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఎవరి అంచనాలకు అందకుండా మంచి పనితీరు చూపించిందన్నారు. గత నెలలోనూ ఇదే తరహా తీరు కనిపించిందన్న ఆయన, తర్వాత పెరిగిన స్థాయిల్లో నిలదొక్కుకోని విషయాన్ని గుర్తు చేశారు. చార్ట్‌ల ప్రకారం, ఇతర అంశాల ప్రకారం ద్వితీయ ప్రాధాన్య రంగంగా కన్‌స్ట్రక్షన్‌ సంబంధిత స్టాక్స్‌ను పేర్కొన్నారు. సాధారణ ఎన్నికల తర్వాత తదుపరి ర్యాలీ తీసే అవకాశాలు ఇన్‌ఫ్రా, క్యాపిటల్‌ గూడ్స్‌, సిమెంట్‌ రంగాల్లో ఉంటుందని అంచనా వేశారు. అప్పటి వరకు ఫార్మా రంగం మంచి పనితీరు చూపించొచ్చన్నారు. 



You may be interested

ఇకపై మిడ్‌, స్మాల్‌క్యాప్‌ల ర్యాలీ: ఐసీఐసీఐ డైరెక్ట్‌

Sunday 11th November 2018

నిఫ్టీ 10,760 వరకు ప్రస్తుత అప్‌మూవ్‌లో ర్యాలీ చేస్తుందన్న అంచనాను ఐసీఐసీఐ డైరెక్ట్‌ తెలిపింది. నిఫ్టీ తక్షణ మద్దతు స్థాయి 10,200ను బ్రేక్‌ చేస్తుందని తాము భావించడం లేదని పేర్కొంది. ఈ మద్దతు స్థాయి వరకూ మార్కెట్‌ దిద్దుబాటుకు గురైతే కనుక నాణ్యమైన స్టాక్స్ కొనుగోలుకు అవకాశంగా వినియోగించుకోవచ్చని సూచించింది. వారం వారీ స్కేల్‌ను గమనిస్తే నిఫ్టీ బలమైన బుల్‌ క్యాండిల్‌ ఏర్పాటు చేసిందని, గరిష్టంలో గరిష్టం, గరిష్ట కనిష్ట

డాక్డర్‌ రెడ్డీస్‌ దువ్వాడ ప్లాంట్‌పై నీలినీడలు..

Saturday 10th November 2018

నాలుగేళ్లలో ఒకే ప్లాంట్‌కు మూడు సార్లు అభ్యంతరాలు నూతన అనుమతులపై దువ్వాడ ప్లాంట్‌ ప్రభావం దేశీ ఫార్మా దిగ్గజాల్లో ఒకటైన డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌కు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (యుఎస్‌ ఎఫ్‌డీఏ) నుంచి వరుస అభ్యంతరాలు అందుతూనే ఉన్నాయి. అమ్మకాల పరంగా ఐదవ అతి పెద్ద కంపెనీగా ఉన్నటువంటి ఈ సంస్థకు చెందిన దువ్వాడ ప్లాంట్‌కు తాజాగా మరోసారి ఫారమ్‌ 483 జారీ అయినట్లు ఒక ఆంగ్ల పత్రిక వెల్లడించింది.

Most from this category