STOCKS

News


క్యూ2 జీడీపీలో ఆశ్చర్యం కలిగించే అంశాలు

Tuesday 4th December 2018
Markets_main1543862097.png-22600

సెప్టెంబర్‌ త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 7.1 శాతంగా నమోదైంది. అంతకుముందు జూన్‌ త్రైమాసికంలో 8.2 శాతం నుంచి ఒకే సారి గణనీయంగా తగ్గుదల నమోదైంది. డీమోనిటైజేషన్‌ తర్వాత గరిష్ట వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలోనే సాధ్యమైంది. గత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్‌ క్వార్టర్లో నమోదైన 6.3 శాతం వృద్ధి రేటుపైనే నమోదవడం కాస్త ఊరట. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఎక్కువ వృద్ధి రేటు ఘనత ఇప్పటికీ భారత్‌కే ఉంది. ఈ సారి వృద్ధి రేటుపై ప్రభావం చూపిన ప్రధాన అంశాల్లో...

 

ప్రైవేటు వినియోగం దెబ్బ
ప్రైవేటు వినియోగ వ్యయం 7 శాతం నమోదైంది. ప్రభుత్వం వినియోగ వ్యయం 12.7 శాతంగా ఉంది. మొత్తం మీద పెట్టుబడుల వృద్ధి మాత్రం 12.9 శాతంగా ఉంది. అంటే పెట్టబడుల్లో వృద్ధి ఉంది కానీ, వినియోగంలో ఆచరణ రూపం దాల్చలేదని తెలుస్తోంది. పెట్టుబడుల్లో 12.7 శాతం వృద్ధి అన్నది 2012 సెప్టెంబర్‌ తర్వాత అత్యంత గరిష్ట వృద్ధి అన్నది గుర్తుంచుకోవాలి. దేశ జీడీపీలో ప్రైవేటు వినియోగ వ్యయం 50 శాతానికి పైగా ఉంటుంది. జూన్‌ త్రైమాసికంలో ప్రైవేటు వినియోగం 8.6 శాతంగా నమోదైంది. జీడీపీని వినియోగం నడిపిస్తుండగా, క్యూ2లో దీని స్థానంలో నిధుల వ్యయాలు గరిష్ట పాత్ర పోషించాయి. ప్రభుత్వ నిధుల వ్యయమే జీడీపీని గణనీయంగా నడిపించింది. ప్రైవేటు వినియోగం లేదా పెట్టుబడులు ఊపందుకోకపోతే తదుపరి త్రైమాసికాల్లోనూ వృద్ధి రేటుపై ప్రభావం పడుతుందని తెలుస్తోంది. 

 

రూపాయి తగ్గుదల ఎగుమతులను పెంచిందా?

  • జూన్‌ క్వార్టర్లో ఎగుమతుల వృద్ధి 12.7 శాతం అయితే, సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఇది 13.4 శాతానికి పెరిగింది. క్యూ2లో రూపాయి భారీ పతనం అయిన విషయం తెలిసిందే, మరి ఇది మన ఎగుమతులకు మేలు చేసిందా? అంటే స్వల్పమేనని తెలుస్తోంది. 
  • బేస్‌ ఇయర్‌లో మార్పులు సానుకూలమే అయినా గానీ, వృద్ధి తగ్గడానికి ప్రధాన కారణంగా చమురు ధరల పెరుగుదలను చెప్పుకోవాలి. గ్రామీణ ఆర్థిక రంగంపై ఒత్తిడికి కూడా ప్రభావం చూపించింది. 
  • ఎగుమతుల కంటే దిగుమతులు రెట్టింపు స్థాయిలో ఉన్నాయి. ఎగుమతుల వృద్ధి 13.4 శాతం. కానీ, దిగుమతులు క్యూ2లో 25.6 శాతం పెరిగాయి. 
  • జీడీపీకి వినియోగం కంటే కూడా నిధుల వ్యయాలే ఎక్కువ భాగం పోషించాయి. 

 

వ్యవసాయంలో డిఫ్లేషన్‌
వ్యవసాయ రంగంలో డిఫ్లేషన్‌ నమోదైంది. జూన్‌ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం (ఇన్‌ఫ్లేషన్‌) 1.4 శాతం ఉంటే, సెప్టెంబర్‌ క్వార్టర్లో మైనస్‌ 1.3 శాతానికి జారిపోయింది. ధరల పెరుగుదలను ఇన్‌ఫ్లేషన్‌గా, దీనికి విరుద్ధంగా ధరల పతనాన్ని డిఫ్లేషన్‌గా చెబుతారు. సాగు రంగంపై ఒత్తిడి ఉందని తాజా పరిస్థితి తెలియజేస్తోంది. అధిక మద్దతు ధరల ద్వారా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తోంది. 

 

దేని వాటి ఎంత 
సెప్టెంబర్‌ క్వార్టర్‌ జీడీపీలో వ్యవసాయం, అటవీ, మత్స్య విభాగాల వాటా 6.30 శాతం. మైనింగ్‌, క్వారీయింగ్‌ మైనస్‌ 0.90 శాతం, తయారీ రంగం20 శాతం, విద్యుత్‌, గ్యాస్‌, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవల వాటా 3 శాతం, నిర్మాణరంగం 8.60 శాతం చొప్పున ఉన్నాయి. అలాగే, ట్రేడ్‌, హోటల్‌, రవాణా, కమ్యనికేషన్‌ సేవలు 18.30 శాతం, ఫైనాన్షియల్‌, రియల్‌ఎస్టేట్‌ రంగం, నైపుణ్య సేవలు 24.10 శాతం, రక్షణ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ 20.60 శాతం చొప్పున వాటా ఆక్రమించాయి. You may be interested

ప్రారంభం ఫ్లాట్‌

Tuesday 4th December 2018

ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సాంకేతాలను అందుకున్న దేశీయ మార్కెట్‌ మంగళవారం మిశ్రమంగానే ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 50 పాయింట్ల లాభంతో 36,290.48 వద్ద, నిఫ్టీ 10 పాయింట్ల నష్టంతో 10,877.10మ వద్ద ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ర్యాలీ చేయడంతో క్రితం రోజు ట్రేడింగ్‌లో 88పైసలు నష్టపోయి రూపాయి నేటి ట్రేడింగ్‌లో స్వల్పంగా బలహీనపడి సూచీలను వెనక్కిలాగుతుంది. అలాగే హెవీవెయిట్‌ షేర్లయిన హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, మహీం‍ద్రా అండ్‌ మహీంద్రా,

రికార్డు గరిష్టానికి హెచ్‌యూఎల్‌

Monday 3rd December 2018

ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ హిందుస్తాన్‌ యూనిలీవర్‌ (హెచ్‌యూఎల్) షేర్లు సోమవారం జీవితకాల గరిష్టాన్ని తాకాయి. గ్లాక్సో స్మిత్‌క్లెయిన్‌ కన్జూమర్‌ను విలీనం చేసుకునేందుకు హెచ్‌యూఎల్‌ బోర్డు ఆమోదం తెలపడటం ఇందుకు కారణమైంది. నేడు హెచ్‌యూఎల్ షేరు ఎన్‌ఎస్‌ఈలో రూ.1,769.50ల వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించింది. జీఎస్‌కే కన్జూమర్‌ హెల్త్‌కేర్‌ వ్యాపారాన్ని విలీనం చేసుకునేందుకు బోర్డు అనుమతిచ్చినట్లు హెచ్‌యూఎల్‌ స్టాక్‌ ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. దీంతో హెచ్‌యూఎల్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. పలితంగా షేరు

Most from this category