STOCKS

News


ఆల్‌టైమ్‌ హై సరే.. ఈ అంశాలతో జాగ్రత్త...

Thursday 12th July 2018
Markets_main1531390982.png-18247

దేశీయ సూచీలు రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతున్నాయి. తాజాగా సెన్సెక్స్‌ రికార్డు స్థాయిని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో సూచీల జోరుకు పగ్గాలు వేసే ఐదు రిస్కు అంశాలను జాగ్రత్తగా గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు..
1. క్రూడాయిల్‌ ధర పెరుగుదల, రూపాయి క్షీణత: చాలా రోజుల తర్వాత క్రూడాయిల్‌ ధర ఇటీవలే బ్యారెల్‌ 80 డాలర్లను తాకింది. అయితే అక్కడ నిలదొక్కుకోలేక ప్రస్తుతం 73-74 డాలర్ల రేంజ్‌లో కదలాడుతోంది. ఇకమీదట క్రూడ్‌ ధర 80 డాలర్లను దాటితే ఎకానమీకి కష్టాలు తప్పవని, ఇది అంతిమంగా మార్కెట్లపై నెగిటివ్‌ ప్రభావం చూపుతుందని నిపుణుల విశ్లేషణ. మరోవైపు ఇటీవల కాలంలో రూపాయి మారకం విలువ భారీగా పతనమైంది. రూపాయి మరింత దిగజారితే అది క్రూడ్‌ దిగుమతులపై మరింత భారం మోపుతుంది. ఈ ద్వంద అంశాలు సంయుక్తంగా సూచీలను కుంగదీస్తాయి. వెనుజులా, ఇరాన్‌, కెనెడా, లిబియా నుంచి క్రూడ్‌ సరఫరాకు ఆటుపోట్లు ఎదురవుతున్న వేళ ఈ రెండు అంశాలను నిశింతగా పరిశీలిస్తూ ఉండాలి.
2. అంతర్జాతీయ వాణిజ్యయుద్ధ భయాలు: వచ్చే ఆరునెలల్లో అంతర్జాతీయ వాణిజ్యయుద్ధం ఆరంభమైతే ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ దుష్ఫలితాలను అనుభవించాల్సిఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఈ భయాలు వర్ధమాన దేశాల మార్కెట్లను భారీగా కుంగదీశాయి. మరోవైపు ట్రంప్‌ పలు దేశాలపై కారాలు మిరియాలు నూరుతున్నాడు. మరిన్ని టారిఫ్‌లు విధించే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నాడు. ఇవి నిజమైతే దేశీయ సూచీలపై నెగిటివ్‌ ప్రభావం తప్పదు.
3. ఫెడ్‌, ఆర్‌బీఐ రేట్ల పెంపు: యూఎస్‌ఏ ఫెడరల్‌ బ్యాంకు ఉద్దీపనల ఉపసంహరణలో భాగంగా వడ్డీరేట్లను పెంచడం ఆరంభించింది. మరోపక్క ఆర్‌బీఐ కూడా చాలా రోజుల తర్వాత గత సమావేశంలో రేట్లను పెంచింది. కేంద్ర బ్యాంకుల ఈ ధోరణి స్పీడందుకుంటే లిక్విడిటీకి భారీగా దెబ్బపడుతుంది. కంపెనీలకు కావలసిన నిధులు సమకూర్చుకోవడం కష్టమవుతుంది. దీంతో ఈక్విటీలు నేలచూపులు చూస్తాయి. ప్రస్తుతం క్రూడాయిల్‌ పెరుగుదల, ద్రవ్యోల్బణ పెరుగుదల ఇలానే కొనసాగితే వడ్డీరేట్లు మరింత పెరగవచ్చు.
4. ఎర్నింగ్స్‌ వృద్ధి: కొత్త ఆర్థిక సంవత్సరం కంపెనీలు రెండంకెల ఎర్నింగ్స్‌ నమోదు చేస్తాయని మార్కెట్‌వర్గాలు ఆశిస్తున్నాయి. ఈ ఆశలకు భిన్నంగా ఏమాత్రం నిరుత్సాహకర ఫలితాలు వచ్చినా ఈక్విటీల్లో సెంటిమెంట్‌ పెద్ద ఎత్తున దెబ్బతింటుంది. ఇప్పటికైతే పరిస్థితులు బాగున్నట్లున్నా, ట్రేడ్‌వార్‌ శృతిమించితే ఎర్నింగ్స్‌ అంచనాలు కుప్పకూలవచ్చు.
5. రాష్ట్రాల ఎన్నికలు: ఈ ఏడాది అధికార పార్టీకి కీలకమైన రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటి ఫలితాలు తేడా కొడితే మార్కెట్లో సెంటిమెంట్‌పై నెగిటివ్‌ ప్రభావం పడవచ్చు. ఈ ఫలితాలు వచ్చే ఏడాది సాధారణ ఎన్నికల్లో రిపీటవుతాయన్న భయాలు పెరగవచ్చు. ఇది మొత్తం మీద పెట్టుబడుల వాతావరణాన్ని దెబ్బ కొట్టవచ్చు. 
ఈ ఐదు అంశాలను దృష్టిలో ఉంచుకొని భారత ఈక్విటీల భవిష్యత్‌ అంత సాఫీగా ఉండకపోవచ్చని బీఎన్‌పీ పారిబా ఎంఎఫ్‌ అభిప్రాయపడుతోంది. వచ్చే ఆరు నుంచి పన్నెండు నెలలపాటు తీవ్ర ఒడిదుడుకులకు ఎక్కువ అవకాశాలున్నాయని అంచనా వేసింది. You may be interested

సెన్సెక్స్‌ రికార్డు ముగింపు

Thursday 12th July 2018

11 వేల పాయింట్ల పైన ముగిసిన నిఫ్టీ రాణించిన రిలయన్స్‌ ఇండస్ట్రీ అంతర్జాతీయంగా ముడి చమురు పతనంతో పాటు ఆయిల్‌ అండ్‌ గ్యాస్, బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీతో మార్కెట్‌ వరుసగా ఐదో రోజూ లాభాలతో ముగిసింది. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలకు నెలకొనడంతో పాటు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలపై ఇన్వెస్టర్లు ఆశావహంగా ఉండటంతో ట్రేడింగ్‌ ఆద్యంతం ఇన్వెస్టర్లు కొనుగోళ్ల మొగ్గుచూపారు. ముఖ్యంగా హెవీ వెయిట్‌ షేర్లైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ

ఈ 3 ఆయిల్‌ రంగ షేర్లలో ర్యాలీ..!

Thursday 12th July 2018

ముంబై: ఎర్నింగ్స్‌ వృద్ధి పరంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రికవరీ చోటుచేసుకుంటుందని, క్యూ1 ఫలితాలు బలంగా ఉండనున్నాయని ఎమ్‌ఓఎస్‌ఎల్‌ (రీటైల్) రీసెర్చ్ హెడ్ సిద్దార్థ్ ఖేమ్కా అన్నారు. అతి తక్కువ బేస్‌ ఇయర్‌ అయినందున తొలి త్రైమాసిక ఫలితాలు ఆకర్షణీయంగా ఉంటాయని భావిస్తున్నట్లు ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. వస్తు సేవల పన్ను అమలు ప్రభావం అనేక రంగాలపై ఉండగా.. ఇవన్నీ గతేడాదిలో వెనుకబడి ఉన్నాయని, ఇప్పుడు

Most from this category