STOCKS

News


బ్రోకరేజ్‌ల లాంగ్‌టర్మ్‌ రికమండేషన్లు

Tuesday 22nd January 2019
Markets_main1548148485.png-23732

1. జస్ట్‌డయిల్‌: నోమురా నుంచి కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ రూ. 765. ఎస్‌ఎంఈ అడ్వర్టైజింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌లో అత్యంత వ్యయనియంత్రిత కంపెనీ. క్యు3లో మంచి ఫలితాలు చూపింది. ఈ రంగంలో పోటీ ఉన్నా, టైర్‌2, 3 నగరాలకు విస్తరించడం ద్వారా పోటీని తట్టుకుంటోంది.
2. కోటక్‌మహీంద్రా బ్యాంక్‌: సీఎల్‌ఎస్‌ఏ నుంచి కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ రూ. 1500. ఎర్నింగ్స్‌లో 21 శాతం చక్రీయవార్షిక వృద్ధి ఉంటుంది. ఎన్‌ఐఐలో 23 శాతం పెరుగుదల అత్యంత పాజిటివ్‌ అంశం. ఆర్‌ఓఈలో సైతం మంచి పురోగతి కనిపిస్తోంది.
3. అశోక్‌లేలాండ్‌: సీఎల్‌ఎస్‌ఏ నుంచి అమ్మొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ రూ. 75. ట్రక్‌ మార్కెట్లో నాలుగేళ్ల అప్‌సైకిల్‌ తర్వాత తాజా డౌన్‌ట్రెండ్‌ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. డౌన్‌ట్రెండ్‌లో పోటీ మరింత ఎక్కువగా ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈపీఎస్‌ వృద్ధి అంచనాల కన్నా తక్కువగా ఉండొచ్చు.
4. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా: సీఎల్‌ఎస్‌ఏ నుంచి కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ రూ. 105. ఆస్తుల నాణ్యత బలహీనంగా ఉన్నా, క్రమంగా ఎర్నింగ్స్‌లో మెరుగుదల కనిపించవచ్చు. అయితే స్లిపేజ్‌లు బాగా ఎక్కువగా ఉండడం మంచిది కాదు.
5. లుపిన్‌: క్రెడిట్‌ సూసీ నుంచి అండర్‌పెర్ఫామ్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 800. లెవో థైరాక్సిన్‌ అనుమతులు పొందడం చాలా కీలకాంశం. రాబోయే రెండేళ్లలో ఈ ఔషధ విక్రయాలు గరిష్ఠాలను తాకుతాయని అంచనా. వచ్చే ఏడాది మరో రెండు జెనరిక్‌ అనుమతులు సాధించే అవకాశం ఉంది. 



You may be interested

5 రోజుల లాభాలకు బ్రేక్‌

Tuesday 22nd January 2019

మార్కెట్‌ మంగళవారం నష్టంతో ముగిసింది. మార్కెట్‌ వరుసగా 5రోజుల ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ, హెవీవెయిట్‌ షేర్ల పతనం, అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన సంకేతాలు మార్కెట్‌ ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. భారత్‌ పెరుగుతున్న ద్రవ్యలోటుపై ఐఎంఎఫ్‌ ఆందోళన వ్యక్తం చేయడం సైతం సెంటిమెంట్‌ను బలహీనపరిచింది. ముఖ్యంగా మెటల్‌, ఐటీ, అటో, ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లలో అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. సెన్సెక్స్‌ 134 పాయింట్లను కోల్పోయి 36,444 వద్ద, నిఫ్టీ

ఫలితాల జోష్‌.... టీవీఎస్‌ మోటర్‌ ర్యాలీ

Tuesday 22nd January 2019

 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(క్యూ3)లో అంచనాలకు మించి ఫలితాలను ప్రకటించంతో టీవీఎస్‌ మోటర్ షేరు మంగళవారం ట్రేడింగ్‌లో లాభాల బాట పట్టింది. నేడు బీఎస్‌ఈలో టీవీఎస్‌ షేరు రూ.535.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నేడు కంపెనీ ప్రకటించిన లాభదాయక క్యూ3 ఫలితాలతో షేరు డిమాండ్‌కు పెరిగింది. ఫలితంగా ఇంట్రాడేలో షేరు 4శాతం ర్యాలీ చేసి రూ.559.90ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.2:00లకు షేరు గత ముగింపు ధర(రూ.538.05)

Most from this category