STOCKS

News


మార్కెట్‌ ర్యాలీకి ఈ 5 నాణ్యమైన షేర్లే కారణం..!

Thursday 12th July 2018
Markets_main1531392417.png-18249

ముంబై: ప్రస్తుతం నిఫ్టీ 11,000 మార్కును అధిగమించినప్పటికీ.. నిజానికి ఈ సూచీ 10,000 వద్దనే ఉన్నట్లు లెక్కని యాక్సిస్‌ ఏఎమ్‌సీ ఈక్విటీస్‌ హెడ్‌ జినేష్‌ గోపానీ విశ్లేషించారు. 11,000 అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అని ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. సరిగ్గా గతేడాది ఇదే రోజు నుంచి ఇప్పటి వరకు చూస్తే స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 19 శాతం నష్టపోగా, మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 24 శాతం నష్టపోయిందని.. ఈ అంశాన్ని పరిగణలోనికి తీసుకుని చూస్తే నిఫ్టీ నిజానికి 10,000 దగ్గరే ఉందని వివరించారు. ఇంకాస్త లోతుగా విశ్లేషిస్తే కేవలం 5-6 నాణ్యమైన షేర్లు మాత్రమే ప్రధాన సూచీలను నిలబెట్టినట్లు వివరించారు. నిఫ్టీ తాజాగా 11,078 వద్దకు ర్యాలీ చేయడానికి ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు మాత్రమే కారణం తప్పించి పూర్తి మార్కెట్‌ ర్యాలీ కాదని వ్యాఖ్యానించారు. గడిచిన ఆరు నెలలుగా ఈ షేర్లు నూతన గరిష్టస్థాయిలకు చేరుకుంటుండడం వల్ల మార్కెట్‌ నిలబడిందని వివరించిన ఆయన.. వాణిజ్య యుద్ధ భయాలు, మండుతున్న ముడిచమురు ధరల అంశాల కారణంగా గడిచిన నాలుగు నెలల మాదిరిగానే మార్కెట్‌లో ఇక మీదట కూడా ఒడిదుడుకులు తప్పవని సూచించారు. ఒకవేళ ఈ అంశాలు చల్లబడితే మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌లు ర్యాలీని కనబరుస్తాయని వివరించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కేవలం క్వాలిటీ షేర్లు మాత్రమే నడిపిస్తున్నాయని విశ్లేషించారు. తమ ఉద్ధేశ్యం ప్రకారం మరో 6-8 నెలలు మార్కెట్‌లో ఒడిదుడుకులకు అవకాశం ఉందన్నారు. జీడీపీ వృద్ధిరేటు 7-7.5-8 శాతం వరకు ఉంటుందన్న ఆయన రంగాలు, కంపెనీలు 20-25 శాతం వృద్ధిని నమోదుచేయాలంటే మాత్రం జీడీపీ వృద్ధిరేటు ఏకంగా 11-12 వరకు ఉండాల్సి ఉంటుందన్నారు. అంటే ఇప్పుడున్నదానికంటే కనీసం రెండు, మూడు రెట్లు నమోదైతే తప్పించి ఆ స్థాయి వృద్ధి కష్టమని వివరించారు.You may be interested

అశోక్‌ లేలాండ్, హెచ్‌పీసీఎల్‌ కో-బ్రాండెడ్‌ కార్డు

Thursday 12th July 2018

చెన్నై: హిందూజా గ్రూప్‌నకు చెందిన అశోక్‌ లేలాండ్‌... తాజాగా హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌) భాగస్వామ్యంతో ‘ఇన్‌-ధన్‌ ఫ్యూయెల్‌ కార్డు’ను మార్కెట్లోకి తెచ్చింది. దీని ద్వారా వాణిజ్య వాహన యజమానులు కస్టమైజ్‌డ్‌ సేవలు పొందొచ్చు. ఈ కార్డు ఆవిష్కరణ సందర్భంగా అశోక్‌ లేలాండ్‌ ఎండీ కె దాసరి మాట్లాడుతూ.. ‘వాహనాల నిర్వహణలో ఇంధనం ఖర్చే 70 శాతం వరకు ఉంటుంది. కస్టమర్లకు మా కో-బ్రాండెడ్‌ కార్డు కస్టమైజ్డ్‌ సర్వీసులందిస్తుంది. దీని

సెన్సెక్స్‌ రికార్డు ముగింపు

Thursday 12th July 2018

11 వేల పాయింట్ల పైన ముగిసిన నిఫ్టీ రాణించిన రిలయన్స్‌ ఇండస్ట్రీ అంతర్జాతీయంగా ముడి చమురు పతనంతో పాటు ఆయిల్‌ అండ్‌ గ్యాస్, బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీతో మార్కెట్‌ వరుసగా ఐదో రోజూ లాభాలతో ముగిసింది. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలకు నెలకొనడంతో పాటు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలపై ఇన్వెస్టర్లు ఆశావహంగా ఉండటంతో ట్రేడింగ్‌ ఆద్యంతం ఇన్వెస్టర్లు కొనుగోళ్ల మొగ్గుచూపారు. ముఖ్యంగా హెవీ వెయిట్‌ షేర్లైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ

Most from this category