STOCKS

News


గ్లోబల్‌ బెస్ట్‌ స్టీల్‌ స్టాక్‌ ఏదో తెలుసా?

Tuesday 28th August 2018
Markets_main1535444851.png-19724

అంతర్జాతీయంగా స్టీల్‌ విభాగంలో ఏ దేశపు స్టాక్‌ మంచి పనితీరు కనబరుస్తోందో తెలుసా? అదే మన మార్కెట్‌లోని జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేరు. ఇదే అంతర్జాతీయంగా అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న స్టీల్‌ స్టాక్‌. మార్జిన్లను స్థిరంగా కొనసాగించడం, తక్కువ వ్యయాలు కంపెనీ బలాలుగా చెప్పుకోవచ్చు.

స్టాక్‌ 30 శాతం జంప్‌
జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ స్టాక్‌ ధర ఈ ఏడాది 30 శాతానికి పైగా పెరిగింది. అదే సమయంలో దీని సహచర కంపెనీల స్టాక్‌ ధరలు పడిపోవడం గమనార్హం. జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ షేరు 1 శాతం, స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌) షేరు 19 శాతం, టాటా స్టీల్‌ షేరు 17 శాతం క్షీణించాయి. కాగా జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ స్టాక్‌ ధర 52 వారాల గరిష్ట స్థాయికి సమీపంలో ట్రేడవుతోంది.    

గ్లోబల్‌ లీడర్‌..
అంతర్జాతీయంగా చూసినా కూడా ఇతర స్టీల్‌ కంపెనీ స్టాక్స్‌ కన్నా జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ ఉత్తమమైన పనితీరు చూపించింది. ఇది ఏడాది కాలంలో ఈ స్టాక్‌ 30 శాతానికిపైగా పెరిగింది. అదే సమయంలో రష్యాలోని సెవెస్టల్‌ 21 శాతం, నోవోలిపెటెక్‌ స్టీల్‌ 8 శాతం ఎగశాయి. ఇక బ్రెజిల్‌లోని సియా సైడెరుర్గికా నేషనల్‌ 3 శాతం, తైవాన్‌లోని చైనా స్టీల్‌ కార్ప్‌ 2 శాతం పెరిగాయి. ఇక అమెరికాలోని నుకార్‌ కార్ప్‌ 1.7 శాతం, లక్సెంబర్గ్‌లోని అర్సెలర్‌మిట్టల్‌ 3.4 శాతం, దక్షిణకొరియాలోని పొస్కో 4.1 శాతం, చైనాలోని అంగంగ్‌ స్టీల్‌ 5 శాతం, చైనాలోని బోసన్‌ ఐరాన్‌ అండ్‌ స్టీల్‌ 6.6 శాతం క్షీణించాయి. చైనాలోని హెస్టీల్‌ ఏకంగా 28 శాతంమేర పతనమైంది. 

ఈబీటా రయ్‌.. రయ్‌..
జేఎస్‌డబ్ల్యూ ప్రతిసారి స్థిరమైన మార్జిన్లను ప్రకటిస్తూ వస్తోంది. పూర్తి స్థాయి వినియోగం ఇందుకు కారణం. టన్ను పరంగా కంపెనీ ఈబీటా గమనిస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1లోని ఈబీటాయే గత తొమ్మిదేళ్లలో కంపెనీ ప్రకటించిన గరిష్ట ఈబీటాల్లో రెండోది. వార్షికంగా చూస్తే ఇందులో 65 శాతం వృద్ధి కనిపించింది. తన సహచర కంపెనీల్లోకెల్లా ఇదే గరిష్ట వృద్ధి. 2018 మార్చితో ముగిసిన సంవత్సరంలో కూడా జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ కంపెనీ వరుసగా రెండోసారి భాతర్‌లో విక్రయాల పరంగా నెంబర్‌ వన్‌ కంపెనీగా ఉంది. అలాగే కంపెనీ సామర్థ్యం పెంపుపై కూడా దృష్టి కేంద్రకరించింది. ఇన్‌సావ్వెన్సీ అసెట్స్‌ బిడ్డింగ్‌లో చురుకుగా లేకున్నప్పటికీ, ఇన్వెస్టర్లకు ఇచ్చిన ప్రజంటేషన్‌ గమనిస్తే వచ్చే ఐదేళ్లపాటు ఇదే మార్కెట్‌ లీడర్‌గా కొనసావచ్చనే అంచనాలున్నాయి. 

తక్కువ మూలధనం.. రాబడి ఎక్కువ
జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ ఒక టన్ను కోసం వెచ్చించే మూలధనం (క్యాపిటల్‌) ఇతర కంపెనీల కన్నా తక్కువ. అదేసమయంలో క్యాపిటల్‌పై పొందే రాబడి మాత్రం ఇతర కంపెనీల కన్నా ఎక్కువ. అయితే కంపెనీ విస్తరణ ప్రణాళికల నేపథ్యంలో వచ్చే బ్యాలెన్స్‌ షీట్‌పై కొంత ఒత్తిడి ఏర్పడవచ్చు. అదే సమయంలో కంపెనీ వ్యయ నియంత్రణ చర్యలు కూడా పాటిస్తోంది. గత ఏడాది కాలంగా స్టాక్‌ ధర పెరుగుతూ వచ్చింది. దీంతో ప్రస్తుతం జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ తన గత 12 నెలల ఎంటర్‌ప్రైస్‌ వ్యాల్యు-టు-ఈబీటాకు 6.9 రెట్లు వద్ద ట్రేడవుతోంది. అలాగే పరిశమ్ర సగటు 6.2 రెట్లుతో పోలిస్తే 12 శాతం ప్రీమియంతో ఉంది. ఇక టాటా స్టీల్‌కు 35 శాతం ఎక్కువ స్థాయిలో ఉంది. టాటా స్టీల్‌ ఎంటర్‌ప్రైస్‌ వ్యాల్యు-టు-ఈబీటా 5.1 శాతంగా ఉంది.

అప్‌సైడ్‌ ఉండొచ్చా?
దాదాపు 70 శాతానికిపైగా అనలిస్ట్‌లు జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేశారు. అయితే బ్లూమ్‌బర్గ్‌ డేటా ప్రకారం స్టాక్‌ ధరలో అప్‌సైడ్‌ కేవలం 2 శాతంగా ఉండొచ్చని తెలుస్తోంది. అయితే ఈ స్టాక్‌ ఈ ఏడాదిలో పలుమార్లు బ్లూమ్‌బర్గ్‌ టార్గెట్‌ ప్రైస్‌ను అధిగమించి పరుగులు పెట్టింది. సిటీ గ్రూప్‌ ఇటీవల కాలంలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ రేటింగ్‌ను న్యూట్రల్‌ నుంచి బైకి మార్చింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.420కి పెంచింది. బలమైన స్టీల్‌ డిమాండ్‌, చైనాలోని తయారీ సామర్థ్య సవాళ్లను ఇందుకు కారణంగా పేర్కొంది. 



You may be interested

ఐసీఐసీఐ డైరెక్ట్‌ నుంచి టాప్‌ పిక్స్‌

Tuesday 28th August 2018

బ్యాంకింగ్‌ రంగంలో గడ్డుకాలం ముగియడం, సాగు రంగం పుంజుకోవడం, పారిశ్రామికం జోరు పెరగడంతో వచ్చే రెండేళ్లు నిఫ్టీ ఎర్నింగ్స్‌లో 20 శాతం వృద్ధి ఉంటుందని ఐసీఐసీఐ డైరెక్ట్‌ రిసెర్చ్‌ హెడ్‌ పంకజ్‌ పాండే అంచనా వేశారు. ఇన్వెస్ట్‌మెంట్‌ పరంగా ఐదు స్టాకులను లాంగ్‌టర్మ్‌ కోసం రికమండ్‌ చేశారు. 1. గ్రిండ్‌వెల్‌ నార్టన్‌: క్యు1లో మంచి ప్రదర్శన చూపింది. ఎబిటాలో 33.5 శాతం వృద్ధి నమోదయింది. సిరామిక్స్‌, ఇతర విభాగాలు మంచి పనితీరు

కంపెనీల డివిడెండ్‌ బొనాంజా

Tuesday 28th August 2018

ఇండియన్‌ కంపెనీల డివిడెంట్‌ చెల్లింపులు జోరుగా ఉన్నాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 870 కంపెనీల డివిడెండ్‌ చెల్లింపులు రూ.1,78,501 కోట్లకు పెరిగాయి. 2012-13 నుంచి చూస్తే ఇదే గరిష్ట చెల్లింపులు. 2016-17 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2017-18 ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్‌ చెల్లింపులు 3 శాతం పెరిగాయి. అయితే పేఔట్‌ రేషియో మాత్రం తగ్గింది. 2016-17తో పోలిస్తే 2017-18 ఆర్థిక సంవత్సరంలో కంపెనీలు వాటి లాభాల్లో తక్కువ వాటాను డివిడెండ్‌

Most from this category