STOCKS

News


ఇండియా బాండ్లతో హెడ్జింగ్‌

Friday 24th August 2018
Markets_main1535106197.png-19606

చైనా మందగమనం తట్టుకొనేందుకు జేపీ మోర్గాన్‌ సూచన
వర్ధమాన మార్కెట్ల బాండ్లలో ఇన్వెస్ట్‌ చేసేవాళ్లు చైనా మందగమన ప్రభావాన్ని తట్టుకునేందుకు భారత ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రేడ్‌ డాలర్‌ బాండ్స్‌ను ఆశ్రయించాలని జేపీ మోర్గాన్‌ ఛేజ్‌ సూచించింది. వర్ధమాన మార్కెట్‌ ఇన్వెస్టర్లకు ఇండియా ఐజీ బాండ్లు చైనా హెడ్జింగ్‌లాగా ఉపయోగపడతాయని తెలిపింది. చైనాలో మందగమన భయాలు వేగంగా వ్యాపిస్తున్నాయి. కమోడిటీలు నేల చూపులు చూస్తున్నాయి. ఈ పరిణామాలు వర్ధమాన మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయి. అయితే వర్ధమాన మార్కెట్లలో కనిపించే భయాలు ఇండియాను ప్రభావితం చేయలేవని, భారత స్థూల ఆర్థికాంశాలు బలంగా ఉన్నాయిన బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. చైనాకు చెందిన బీబీబీ రేటింగ్‌ బాండ్ల కన్నా భారత హైగ్రేడ్‌ బాండ్లు ఉత్తమమైనవని తెలిపింది. 2013తో పోలిస్తే భారత పరిస్థితి అత్యంత బలంగా ఉందని వివరించింది. అందువల్ల భారత సావరిన్‌ రేటింగ్‌కు తక్షణ ముప్పులేదని, ఇతర ఎమర్జింగ్‌ మార్కెట్లతో పోలిస్తే చాలా బెటర్‌గా ఉందని వివరించింది. అయితే ఇదే భరోసాను భారత కార్పొరేట్‌ రంగంపై ఉంచలేమని, ఈ రంగంలో చాలా కంపెనీలు కమోడిటీ సంబంధిత అంశాలతో ముడిపడిఉన్నాయని తెలిపింది. 



You may be interested

రికార్డ్‌ల ర్యాలీకి బ్రేక్‌

Friday 24th August 2018

నాలుగు రోజుల రికార్డ్‌ల ర్యాలీకి విరామం మార్కెట్‌ రికార్డు ర్యాలీకి శుక్రవారం బ్రేక్‌ పడింది. చైనా-అమెరికా దేశాల మధ్య జరుగుతున్న ట్రేడ్‌వార్‌ చర్చల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో ప్రపంచమార్కెట్లు పతనం కావడం... సూచీల గరిష్ట స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం... డాలర్‌ మారకంలో రూపాయి వరుసగా రెండో రోజూ 70 స్థాయిపై చేరుకోవడం... ఫెడ్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ పావెల్‌ ప్రసంగంపై ఇన్వెస్టర్ల ఎదురుచూపులు తదితర కారణాలతో

కొత్త ఛైర్మెన్‌ నియామకంపై అంచనాలు-యాక్సిస్‌ బ్యాంక్‌ 2శాతం అప్‌..!

Friday 24th August 2018

కొత్త సీఈవో అమితాబ్‌ చౌదరి..? ముంబై:- యాక్సిస్‌ బ్యాంకు కొత్త ఛైర్మన్‌గా అమితాబ్‌ చౌధరి నియామకం జరగవచ్చనే వార్తలతో ఆ బ్యాంకు షేరు శుక్రవారం ట్రేడింగ్‌లో 2శాతం ర్యాలీ చేసింది. నేడు యాక్సి బ్యాంక్‌ షేరు బీఎస్‌ఈలో రూ.631.8ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం బ్యాంకు ఛైర్మన్‌గా విధులు నిర్వహిస్తున్న శిఖాశర్మ స్థానంలో హెచ్‌డీసీఎఫ్‌సీ లైఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న అమితాబ్‌ చౌదరి నియమితులుకావొచ్చనే అంచనాలు మార్కెట్లో కొనసాగుతున్నాయి.  ఈ

Most from this category