News


భారత మార్కెట్‌ ఆకర్షిస్తోంది!

Tuesday 16th October 2018
Markets_main1539692860.png-21209

జేపీ మోర్గాన్‌ సీనియర్‌ మేనేజర్‌ రష్మీ గుప్తా
ఇన్వెస్టర్లు అనవసర భయాలను పక్కనబెట్టి సరసమైన రేట్లకు స్టాకులను కొనుగోలు చేయడంపై దృష్టి పెట్టాలని జేపీ మోర్గాన్‌ మనీ మేనేజర్‌ రష్మీ గుప్తా సూచించారు. వర్దమాన దేశాల మార్కెట్లు ఇప్పటివరకు పలు భయాలతో నెగిటివ్‌ సెంటిమెంట్‌తో కుంగిపోయిఉన్నాయన్నారు. ఈ భయాల కారణంగా వర్ధమాన మార్కెట్లలో వచ్చిన మంచి అవకాశాలను ఇన్వెస్టర్లు గుర్తంచడం లేదన్నారు. ఈ ఏడాది వర్దమాన మార్కెట్లు దాదాపు 17 శాతం పతనమైన సంగతి తెలిసిందే. వాణిజ్యయుద్ధ భయాలు, ఫెడ్‌ రేట్ల పెంపు, క్రూడాయిల్‌ పెరుగుదల.. మార్కెట్లను దెబ్బకొట్టాయి. బ్రెజిల్‌, ఇండియా, రష్యా, మెక్సికో మార్కెట్లపై పాజిటివ్‌గా ఉన్నట్లు ఆమె చెప్పారు.
సంస్కరణలు శభాష్‌
ఈ ఏడాది నిజమైన సంస్కరణలు అమలు చేసిన దేశమంటే ఇండియానే అని రష్మీ ప్రశంసించారు. భారత్‌ అత్యంత వేగంగా ఎదుగుతున్న ఎకానమీ అన్నారు. దీర్ఘకాలిక ధృక్పథంతో పెట్టుబడులు పెట్టదలిస్తే ఇండియా మార్కెట్‌ ఆకర్షణీయంగా కనిపిస్తోందన్నారు. అయితే తాము ఇండియాలో పెట్టుబడులు పెట్టే ముందు కరెన్సీ ఒడిదుడుకులు కొలిక్కిరావాల్సిఉందన్నారు. వర్ధమాన దేశాల్లో అర్జెంటీనా, టర్కీ మార్కెట్లపై అప్రమత్తంగా ఉండాలని ఆమె చెప్పారు. టర్కీలో బలమైన కేంద్రబ్యాంకు లేదన్నారు. వాణిజ్యయుద్ధ ప్రభావాన్ని చైనా సమర్ధవంతంగా ఎదుర్కొంటుందని తాము భావించడంలేదన్నారు. ఇప్పుడు ప్రపంచ ఎకానమీ పరిస్థితి 2015లో ఉన్నంత నెగిటివ్‌గా ఉందని, కానీ అప్పుడున్నంత మందగమన భయాలు ఇప్పుడు లేవని వివరించారు. ఫెడ్‌ రేట్ల పెంపు కన్నా డాలర్‌ వేగంగా బలపడడం అత్యంత రిస్కీ అంశమని ఆమె చెప్పారు. 



You may be interested

మెప్పించిన ఇన్ఫీ!

Tuesday 16th October 2018

బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ అంచనాలను మించిన ఫలితాలతో ఆకట్టుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (2018-19, క్యూ2) కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ.4,110 కోట్లకు దూసుకెళ్లింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో లాభం రూ.3,726 కోట్లతో పోలిస్తే 10.3 శాతం వృద్ధి చెందింది. కంపెనీ మొత్తం ఆదాయం 17.3 శాతం ఎగబాకి రూ.17,567 కోట్ల నుం‍చి రూ.20,609 కోట్లకు చేరింది. డిజిటల్‌

35వేల ఎగువకు సెన్సెక్స్‌

Tuesday 16th October 2018

ఇన్వెస్టర్లు క్యూ2 ఫలితాలపై దృష్టి సారించి ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో మంగళవారం మార్కెట్‌ లాభంతో ముగిసింది. బ్యాంకింగ్‌, అటో, ఫైనాన్స్‌ రంగ షేర్ల ర్యాలీ కారణంగా సూచీలు ముచ్చటగా మూడోరోజూ లాభాల్లోనే ముగిశాయి. ఇంట్రాడేలో నిఫ్టీ 10600 పాయింట్లను అందుకుంది. సెన్సెక్స్‌ 35వేల ఎగువన ముగిసింది. చివరకు సెన్సెక్స్‌  297 పాయింట్ల లాభంతో 35,162 వద్ద, నిఫ్టీ 72 పాయింట్ల లాభంతో 10,585

Most from this category