STOCKS

News


ఏడాది కనిష్టానికి జేపీ అసోసియేట్స్‌..!

Tuesday 11th September 2018
Markets_main1536654942.png-20167

ముంబై:- జైప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్‌ షేరు మంగళవారం ట్రేడింగ్‌లో ఏడాది కనిష్టానికి పతనయ్యాయి. నేడు ఈ షేరు బీఎస్‌ఈలో రూ.10.55ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. జేపీ అసోసియేట్స్‌ కంపెనీ తమకు చెల్లించాల్సిన రూ.1500 కోట్ల రుణ చెల్లింపులో విఫలమైనందున కంపెనీపై దివాళా ప్రక్రియ భాగంగా చర్యలు తీసుకోవాలని ఐసీఐసీఐ బ్యాంకు ఎన్‌సీఎల్‌టీకు పిటిషన్‌ దాఖలు తీసింది. ఈ పిటిషన్‌ను స్వీకరించిన ఎన్‌సీఎల్‌టీసీ సెప్టెంబర్‌ 17లోగా ఈ అంశంపై స్పందిచాలని జేపీ అసోసియేట్స్‌కు నోటీసులు జారీచేసింది. ఈవార్తల నేపథ్యంలో జేపీ అసోసియేట్స్‌ షేరు 4.60శాతం నష్టపోయి రూ.10.68 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1:30ని.లకు షేరు గతముగింపు ధర(రూ.10.68)తో పోలిస్తే 3.75శాతం నష్టంతో రూ.10.28ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట గరిష్ట, ధరలు వరుసగా రూ.10.21 రూ.27.25లుగా నమోదయ్యాయి. జేపీ అసోసియేట్స్‌ షేరు క్షీణించడం ఇది వరుసగా రెండోరోజూ కావడం గమనార్హం.

 



You may be interested

క్రూడ్‌ ధరలు పరిగెడతాయ్‌

Tuesday 11th September 2018

        ఇరాన్‌పై ఆంక్షలు అమల్లోకి వస్తే.. 150 డాలర్లకు క్రూడ్‌ ప్రభుత్వానికి అంచనా వేయడం చేతకాలేదు ధరలు తగ్గుతాయని చెబుతోంది.. కానీ కచ్చితంగా పెరుగుతాయి చమురు ధరలు పెరిగితే ఏం చేయాలో కేంద్రం వద్ద సరైన ప్రణాళికలు లేవు అంతర్జాతీయ మార్కెట్లను నిందిస్తూ, ఏం పర్వాలేదని చెబితే సరిపోదు..  భరోసానిచ్చే ప్రకటనతో కన్సూమర్ల ముందుకు రావాలి కేంద్రం ఓఎన్‌జీసీని నిర్వీర్యం చేస్తోంది.. కంపెనీ విషయంలో సరిగ్గా వ్యవహరించడం లేదు ఓఎన్‌జీసీ మాజీ సీఎండీ ఆర్‌.ఎస్‌.శర్మ క్రూడ్‌ ధరలు పెరగడం తప్ప

పీఎస్‌యూ బ్యాంకింగ్‌ అప్‌

Tuesday 11th September 2018

ఎస్‌బీఐ 2.50శాతం ర్యాలీ  ముంబై:- ఒడిదుడుకుల మార్కెట్‌ ట్రేడింగ్‌లో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ సూచీలకు అండగా నిలుస్తోంది. క్రితం ట్రేడింగ్‌లో భారీగా పతనమైన షేర్ల చౌక ధరలకు లభిస్తుండంతో ఈ రంగ షేర్లలో కొనుగోళ్లు జరుపుతున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగషేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు ఇండెక్స్‌ 2శాతం‍ లాభపడింది. ఈ సూచీలోని మొత్తం 12 షేర్లకు గానూ 11 షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా,

Most from this category