News


కరెక‌్షన్‌ వైపు అడుగులు!?

Saturday 8th September 2018
Markets_main1536403071.png-20096

మార్కెట్‌ అంతిమంగా కరెక‌్షన్‌ వైపు అడుగులు వేస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. దేశీ, అంతర్జాతీయ పరిస్థితులు ఇందుకు కారణమని తెలిపారు. డాలర్‌ బలపడటం, కరెంట్‌ అకౌంట్‌ లోటు పెరుగుదల, ద్రవ్యల్బోణ అంచనాలు, గ్లోబల్‌గా వడ్డీ రేట్ల పెంపు ధోరణి, భౌగోళిక రాజకీయ పరిస్థితులు క్షీణించడం వంటి అంశాలు తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు.  
స్టాక్స్‌ కొత్త గరిష్ట స్థాయిలకు చేరుకున్న తర్వాత పతనం బాటలో పయనిస్తున్నాయని గుర్తు చేశారు. అలాగే వీటిపై డౌన్‌ట్రెండ్‌ ఒత్తిడి పెరగొచ్చని అంచనా వేశారు. స్థూల ఆర్థికాంశాలు క్షీణించొచ్చని పేర్కొన్నారు. భారత్‌లో మాత్రమే కాకుండా ఇతర మార్కెట్లలోనూ కరెక‌్షన్‌ ప్రారంభమైందని తెలిపారు. ఇతర వర్ధమాన మార్కెట్ల కరెన్సీలతో పోలిస్తే డాలర్‌ బలపడుతూనే ఉందని పేర్కొన్నారు. 
అస్థిరత కొనసాగవచ్చని తెలిపారు. డౌన్‌ట్రెండ్‌ నుంచి తప్పించుకునే అంశాలు కనిపించడం లేవన్నారు. భయాలు, సందేహాలు, అనిశ్చితి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు చిక్కుకున్నారని పేర్కొన్నారు. ఒడిదుడుకులు అనేవి బేర్‌ మార్కెట్‌కు స్నేహితులు వంటివని తెలిపారు. అందువల్ల ఇండెక్స్‌లపై ఒత్తిడి పెరగొచ్చని, ఇది అలాగే కొనసాగవచ్చని పేర్కొన్నారు. తైమాసిక ఎర్నింగ్స్‌ వెలువడే దాకా ప్రాఫిట్‌ బుకింగ్‌ జరుగుతూనే ఉంటుందని తెలిపారు. 
ఆగస్ట్‌ నెలలో ప్యాసింజర్‌ వాహన విక్రయాలు బలహీనంగా ఉండటం కూడా ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని సూచిస్తోందని పేర్కొన్నారు. కరెన్సీ క్షీణత కారణంగా కన్సూమర్ల కొనుగోలు సామర్థ్యం తగ్గిందనడానికి ఇది ఉదాహరణ లాంటిదని తెలిపారు. రూపాయి మరింత కనిష్ట స్థాయిలకు పడిపోతే పెట్రోల్‌, డీజిల్‌, ఇతర ప్రొడక్టుల ధరలు పెరుగుతాయని అప్పుడు కన్సూమర్ల వ్యయాలు పెరుగుతాయని, జేబులు గుళ్లవుతాయని పేర్కొన్నారు. 
టెక్నికల్‌గా చూస్తే..
టెక్నికల్‌గా చూస్తే నిఫ్టీ-50లో సెల్లాఫ్‌ చోటుచేసుకుందని మార్కెట్‌ నిపుణులు తెలిపారు. వీక్లి చార్ట్‌లో బేర్‌ ప్యాట్రన్‌ ఏర్పడిందని పేర్కొన్నారు. ఇది కరెక‌్షన్‌ను సూచిస్తోందని తెలిపారు. అయితే ఇండెక్స్‌ పతనం పాక్షికంగా ఆగిపోయి, స్వల్ప కాలంలో బౌన్స్‌ అవ్వొచ్చని అంచనా వేశారు. అయితే చివరకు ఇండెక్స్‌ మళ్లీ పడిపోతుందని తెలిపారు. అందువల్ల ట్రేడర్లు లాంగ్‌ పొజిషన్ల నుంచి ఎగ్జిట్‌ అయ్యి, కచ్చితమైన స్టాప్‌లాస్‌లతో షార్ట్‌ పొజిషన్లను తీసుకుంటే మంచిదని సూచించారు. 
ఈ వారం అంచనాలు..
రానున్న రోజుల్లో భౌగోళిక అస్థిరతలు ఎక్కువ కావొచ్చని మార్కెట్‌ నిపుణులు అంచనా వేశారు. అందువల్ల మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి పెరుగుతుందని పేర్కొన్నారు. ఇది బుల్స్‌కు రిస్క్‌ అంశమని తెలిపారు. బుల్‌ మార్కెట్‌ గరిష్టాల్లో ఉన్నప్పుడు, కంపెనీలు విస్తరణ ప్రణాళికలు ప్రకటించినప్పుడు.. మార్కెట్లు ఆ కంపెనీలను శిక్షిస్తాయని పేర్కొన్నారు. దీనికి బాలకృష్ణ టైర్స్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ కంపెనీలను ఉదాహరణగా తీసుకోవచ్చన్నారు. ఇవి రెండూ కంపెనీల స్టాక్స్‌ విస్తరణ ప్రణాళికలు ప్రకటించిన దగ్గరి నుంచి క్షీణించాయని తెలిపారు. 
కరెక‌్షన్‌ కొనసాగుతుందని, ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్‌ చేయడానికి ముందు భారీ కరెక‌్షన్‌ కోసం వేచి చూడటం మంచిదని సూచించారు. అధిక వ్యాల్యుయేషన్స్‌ ఉన్న ఎఫ్‌ఎంసీజీ, కన్సూమర్‌ డ్యూరబుల్స్‌, ఐటీ, కొన్ని ఫార్మా స్టాక్స్‌లో ప్రాఫిట్‌ బుకింగ్‌ ఉంటుందని తెలిపారు. You may be interested

యాక్సిస్‌ బ్యాంక్‌ సీఈఓగా అమితాబ్‌ చౌదురీ

Saturday 8th September 2018

నెలల తరబడి ఊహాగానాలకు తెరవేస్తూ కొత్త సీఈఓ, ఎండీని యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఎండీగా పనిచేస్తున్న అమితాబ్‌ చౌదురీని తమ కొత్త సీఈఓ, ఎండీగా ఎంచుకున్నట్లు యాక్సిస్‌ బ్యాంక్‌ ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి ఆయన పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. 2021 డిసెంబర్‌ 31వరకు ఆయన యాక్సిస్‌బ్యాంక్‌ను నడిపిస్తారు. చౌదురీ నియామకానికి ఆర్‌బీఐ ఆమోదం తెలిపిందని యాక్సిస్‌ బ్యాంక్‌ వెల్లడించింది. యాక్సిస్‌బ్యాంక్‌

మీ ఫండ్స్‌ సెన్సెక్స్‌తో పాటు ర్యాలీ చేయలేదా?

Saturday 8th September 2018

ఈ ఏడాదిలో సెన్సెక్స్‌ సూచీ 10 శాతం ర్యాలీ చేసింది. 38,989 పాయింట్ల వద్ద తన జీవితకాల గరిష్టాన్ని నమోదుచేసింది. సెన్సెక్స్‌ భారీ స్థాయిలో ర్యాలీ చేసినప్పటికీ మ్యూచువల్‌ ఫండ్స్‌ మాత్రం ఈస్థాయి ర్యాలీని అందుకోలేకపోయాయి. అందుకు గల కారణాన్ని కోటక్‌ ఇంటర్నేషనల్‌ ఈక్విటీస్‌ వివరిస్తూ ‘‘సెన్సెక్స్‌ ర్యాలీకీ ప్రధాన కారణమైన కొన్ని హెవీవెయిట్‌ షేర్లను మ్యూచువల్‌ ఫండ్స్‌ మేనేజర్లు, విదేశీ ఇన్వెస్టర్లు తక్కువ హోల్డ్‌ చేయడంతో మ్యూచువల్‌ ఫండ్స్‌ సెన్సెక్స్‌తో

Most from this category