News


ఆగని టాటా మోటార్స్‌ ర్యాలీ

Thursday 10th January 2019
Markets_main1547108322.png-23506

 టాటామోటర్స్‌ షేర్ల ర్యాలీ ఆగడం లేదు. వరుసగా ఐదోరోజూ షేర్లు లాభాల పట్టాయి. బీఎస్‌ఈలో గురువారం మరో 2శాతం ర్యాలీ చేసింది. గతేడాదిలో కంపెనీ తన అనుబంధ సంస్థ సంస్థ జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) రికార్డు స్థాయిలో జరిపిన విక్రయాలు.... షేర్ల ర్యాలీకి అండగా నిలిచాయి. నేడు బీఎస్‌ఈలో కంపెనీ షేరు రూ.183.65ల వద్ద ప్రారంభమైంది. జేఎల్ఆర్‌ 2018లో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిపినట్లు గణాంకాలు వెలువడంతో కంపెనీ షేర్లకు డిమాండ్‌ ఏర్పడింది. ఫలితంగా  కంపెనీ షేరు 2శాతం లాభపడి రూ.186.80వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం గం.1:15ని.లకు షేరు గతముగింపు ధర రూ.183.1తో పోలిస్తే 1.50శాతం లాభపడి రూ.185.85ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 154.70 రూ.443.55లుగా నమోదయ్యాయి.
రికార్డు స్థాయిలో జేఎల్‌ఆర్‌ అ‍మ్మకాలు:-
జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) గతేడాది భారత్‌లో 4,596 వాహనాలు విక్రయించింది. 2017లో విక్రయించిన 3,954 కార్లతో పోలిస్తే ఇవి 16.23 శాతం అధికం. అలాగే అమెరికాలో గతేడాది 14,079  వాహనాలు విక్రయించింది. అంతముందు ఏడాది (2017)తో పోలిస్తే ఇది 24శాతం అధికం. కంపెనీ ఒక ఏడాదిలో నమోదు చేసిన అత్యధిక అమ్మకాలు ఇవే కావడం విశేషం. ల్యాండ్‌ రోవర్‌ డిస్కవరీ స్పోర్ట్‌, రేంజ్‌ రోవర్‌ ఎవోక్‌, జాగ్వార్‌ ఎఫ్‌-పేస్‌, ఎక్స్‌ఈ, ఎక్స్‌ఎఫ్‌ మోడళ్లు ఇందుకు దన్నుగా నిలిచాయని కంపెనీ వెల్లడించింది.



You may be interested

క్యు3లో ఎఫ్‌ఐఐలు వాటా తగ్గించుకున్న స్టాకులివే!

Thursday 10th January 2019

మూడోత్రైమాసికంలో ఎఫ్‌ఐఐలు నికర అమ్మకందారులుగా మారారు. అక్టోబర్‌లో ఎఫ్‌పీఐలు దాదాపు 29వేల కోట్ల రూపాయల విక్రయాలు జరిపారు. తిరిగి నవంబర్‌, డిసెంబర్‌లో కొంతమేర కొనుగోళ్లు జరిపినా త్రైమాసికం మొత్తానికి అమ్మకాలు ఎక్కువ. క్యు3లో ఎఫ్‌ఐఐలు రూ. 20వేల కోట్ల రూపాయల విక్రయాలు జరిపాయి. ముఖ్యంగా ఎన్‌బీఎఫ్‌సీ, బ్యాంకింగ్‌ స్టాకుల నుంచి ఎఫ్‌పీఐలు ఎక్కువగా వైదొలిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు 12 కంపెనీల్లో ఎఫ్‌ఐఐలు సుమారు ఒక్క శాతం వాటాకు మించిన

ఈక్విటీలను ‘సిప్‌’ చేస్తున్నారు

Thursday 10th January 2019

దేశీయ హౌస్‌హోల్డ్‌ అసెట్స్‌లో క్రమంగా ఈక్విటీ పెట్టుబడుల వాటా పెరుగుతోంది. రిటైలర్లలో మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఆసక్తి కారణంగా గృహ పెట్టుబడుల్లో ఈక్విటీలు క్రమంగా మంచిస్థానం సంపాదించుకుంటున్నాయని ఆర్బీఐ, ఐఆర్‌డీఏ తదితర సంస్థల గణాంకాల ఆధారంగా సీఎల్‌ఎస్‌ఏ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలోని మొత్తం హౌస్‌హోల్డ్‌ అసెట్స్‌ విలువ 8.5 లక్షల కోట్ల డాలరు. ఇది జీడీపీ కన్నా మూడు రెట్లు అధికం. గతేడాదితో పోలిస్తే ఈ మొత్తం దాదాపు 9

Most from this category