STOCKS

News


2020లో జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌ ఐపీఓ !

Thursday 13th December 2018
Markets_main1544677609.png-22883

ముంబై: సజ్జన్‌ జిందాల్‌కు చెందిన జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌లోని సిమెంట్‌ విభాగం, జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌ 2020 కల్లా ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) రానుంది. ఈ కంపెనీ ఐపీఓ సైజు రూ.4,500 కోట్ల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. ఈ ఐపీఓలో భాగంగా ప్రమోటర్‌ వాటాలో నాలుగో వంతు షేర్లను విక్రయించాలని జేఎస్‌డబ్ల్యూ యోచిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 12.8 మిలియన్‌ టన్నులుగా ఉంది. దీన్ని వచ్చే ఏడాదిమార్చి కల్లా 14 మిలియన్‌ టన్నులకు పెంచుకోనున్నట్లు జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ నీలేశ్‌ నర్వేకర్‌ పేర్కొన్నారు. 2020 కల్లా 20 మిలియన్‌ టన్నులకు పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నామన్నారు. సిమెంట్‌ ఉత్పత్తి ఈ స్థాయికి చేరాకే ఐపీఓకు వస్తామన్నారు.
కంపెనీ విలువ రూ.18,000 కోట్లు...
ఐపీఓకు వచ్చే నాటికి జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌ కంపెనీ విలువ రూ.18,000 కోట్లుగా ఉండేలా చూసుకోవాలని లక్ష్యించినట్లు నీలేశ్‌ చెప్పారు. ఈ ఐపీఓలో భాగంగా ప్రమోటర్లు తమ వాటాలో నాలుగో వంతు షేర్లను విక్రయించే అవకాశం ఉందన్నారు. అంటే ఈ ఐపీఓ సైజు రూ.4,500 కోట్ల రేంజ్‌లో ఉండొచ్చు. ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను రుణ భారం తగ్గించుకోవడానికి, ఉత్పత్తి పెంచుకోవటానికి వినియోగిస్తామన్నారు. 
మరింతగా సిమెంట్‌ వినియోగం 
ఆర్థిక వృద్ధి పరిస్థితులు మెరుగుపడుతున్నాయని, మౌలిక రంగం జోరు పెరుగుతోందని, డిమాండ్‌ పుంజుకుంటోందని ఫలితంగా సిమెంట్‌ వినియోగం మరింతగా పెరగనున్నదని నీలేశ్‌ చెప్పారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడానికే ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుకుంటున్నామని చెప్పారు. ‘‘ఇతర కంపెనీల కొనుగోళ్లపై దృష్టి సారించాం. దివాలా ప్రక్రియ వల్ల సిమెంట్‌ కంపెనీల కొనుగోలు ప్రక్రియ సులభతరమవుతోంది. దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లో పటిష్టంగానే ఉన్నాం. ఇపుడు తూర్పు రాష్ట్రాల్లో నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్నాం’’ అని వివరించారు. 



You may be interested

బైజూస్‌లో భారీగా పెట్టుబడులు

Thursday 13th December 2018

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ స్టార్టప్‌ బైజూస్‌... మరో విడత భారీగా పెట్టుబడులను సమీకరించింది. బైజూస్‌లో దక్షిణాఫ్రికా మీడియా దిగ్గజం, నాస్పర్స్‌ భారీగా పెట్టుబడులు పెట్టినట్లు తెలియవచ్చింది. నాస్పర్స్‌ సంస్థ రూ.2,879 కోట్లు (40 కోట్ల డాలర్లు) పెట్టుబడులు పెట్టిందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. దీన్లో 30 కోట్ల డాలర్ల పెట్టుబడులు బైజూస్‌కు ఇప్పటికే అందాయని, మిగిలిన 10 కోట్ల డాలర్లు కూడా త్వరలోనే అందుతాయని ఆ

అక్టోబర్‌లో పారిశ్రామిక వృద్ధి పరుగులు

Thursday 13th December 2018

న్యూఢిల్లీ: దేశ పారిశ్రామికోత్పత్తి అక్టోబర్‌ మాసంలో వేగాన్ని పుంజుకుంది. మైనింగ్‌, విద్యుత్‌, తయారీ రంగాల తోడ్పాటుతో గడిచిన 11 నెలల కాలంలో అత్యధికంగా 8.1 శాతం వృద్ధి నమోదు చేసింది. పారిశ్రామిక తయారీ సూచీ (ఐఐపీ) అన్నది క్రితం ఏడాది (2017) అక్టోబర్‌లో కేవలం 1.8 శాతమే వృద్ధిని నమోదు చేసింది. ఈ మేరకు వివరాలను కేంద్ర గణాంక కార్యాలయం బుధవారం విడుదల చేసింది. 2017 నవంబర్లో ఐఐపీ వృద్ధి

Most from this category