STOCKS

News


ఝున్‌ఝున్‌వాలాను ముంచేసిన మిడ్‌క్యాప్స్‌

Thursday 4th October 2018
Markets_main1538635341.png-20852

కేవలం రిటైల్‌ ఇన్వెస్టర్లను మాత్రమే కాదండోయ్‌.. పీఎంఎస్‌ మేనేజర్లను, వారి హై-నెట్‌వర్త్‌ క్లయింట్స్‌ను కూడా మార్కెట్‌ దెబ్బకొట్టింది. అఖరికి రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా వంటి సీజన్‌ ఇన్వెస్టర్లను కూడా మన ఈక్విటీ మార్కెట్‌ వదిలిపెట్టలేదు. ఈయన పోర్ట్‌ఫోలియో కూడా 2018లో బాగా నష్టపోయింది. మరీముఖ్యంగా మిడ్‌క్యాప్స్‌ హోల్డింగ్స్‌ 75 శాతం వరకు కరిగిపోయాయి. కాగా మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ ఈ ఏడాది ఇప్పటి దాకా 16 శాతంమేర పతనమైంది. గత నాలుగేళ్లలో మిడ్‌క్యాప్స్‌ బాగా ర్యాలీ చేశాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ 2014లో 55 శాతం, 2015లో 7.4 శాతం, 2016లో 8 శాతం, 2017లో 48 శాతం పెరిగింది. మార్కెట్‌ క్యాప్‌కు సంబంధించి సెబీ కొత్త నిబంధనలు తీసుకురావడం, మ్యూచువల్‌ ఫండ్స్‌ను పునఃవర్గీకరించడం, ఓవర్‌ వ్యాల్యుయేషన్స్‌ వంటి అంశాలు మిడ్‌క్యాప్స్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయి. 
ఝున్‌ఝున్‌వాలా పోర్ట్‌ఫోలియోలో చాలా స్టాక్స్‌ భారీగా నష్టపోయాయి. దీంతో ఆయన పోర్ట్‌ఫోలియో విలువ రూ.10,000 కోట్ల మార్క్‌కు దిగువకు తగ్గిపోయింది. ఆయన పోర్ట్‌ఫోలియోలోని 27 స్టాక్‌ను గమనిస్తే.. మూడు స్టాక్స్‌ మినహా మిగతావన్నీ నెగటివ్‌ రిటర్న్స్‌ను అందించాయి. ఫస్ట్‌సోర్స్‌ సొల్యూషన్స్‌ (51 శాతం అప్‌), వీఐపీ ఇండస్ట్రీస్‌ (17 శాతం అప్‌),లుపిన్‌ (2 శాతం అప్‌) స్టాక్స్‌ మాత్రమే పెరిగాయి. 
8 స్టాక్స్‌ 50 శాతానికిపైగా పతనం..
ఝున్‌ఝున్‌వాలా హోల్డిం‍గ్స్‌లోని 8 స్టాక్స్‌ 50 శాతానికిపైగా పడిపోయాయి. మందన రిటైల్‌ వెంచర్స్‌ 75 శాతం, జైప్రకాశ్‌ అసోసియేట్స్‌ 75 శాతం, డీబీ రియల్టీ 63 శాతం, జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 61 శాతం, అప్టెక్‌ 58 శాతం, ప్రొజోన్‌ ఇన్‌టు ప్రాపర్టీస్‌ 58 శాతం, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ 53 శాతం, బిల్‌కేర్‌ 51 శాతం నష్టపోయాయి. 
ఇక ఓరియెంట్‌ సిమెంట్‌, టీవీ18 బ్రాడ్‌కాస్ట్‌, ప్రకాశ్‌ ఇండస్ట్రీస్‌, మన్‌ ఇన్‌ఫ్రా కన్‌స్ట్రక‌్షన్‌, ఆటోలైన్‌ ఇండస్ట్రీస్‌, అయాన్‌ ఎక్స్చేంజ్‌ ఇండియా, ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, కరూర్‌ వైశ్యా బ్యాంక్‌, డెల్టా కార్ప్‌ షేర్లు 30-50 శాతం శ్రేణిలో తగ్గాయి. 



You may be interested

ఆగని ఐటీ షేర్ల పతనం

Thursday 4th October 2018

మార్కెట్‌ పతనం గురువారం గంట గంటకు పెరుగుతోంది. మధ్యాహ్నం గం.12:00లకు సెన్సెక్స్‌ 800 పాయింట్ల నష్టపోగా, నిఫ్టీ సూచీ 250 పాయింట్ల నష్టపోయి 10600 దిగువకు చేరుకుంది. మార్కెట్‌ పతనంతో భాగంగా అన్ని రంగాలకు చెందిన షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. అత్యధికంగా ఐటీ రంగానికి చెందిన షేర్లు నష్టపోయాయి. డాలర్‌ మారకంలో రూపాయి కనిష్టానికి చేరుకున్నప్పటికీ.., నేటి ట్రేడింగ్‌లో ఐటీ షేర్లు నష్టాల బాట పట్టడం గమనార్హం. ఎన్‌ఎస్‌ఈలో

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లే శరణ్యమా?

Thursday 4th October 2018

ఎంఎఫ్‌ల నుంచి వైదొలగడం ఉత్తమమా? డైలమాలో ఇన్వెస్టర్లు ఈక్విటీల అధ్వాన్న ప్రదర్శన రిటైల్‌ ఇన్వెస్టర్లను చాలా భయపెడుతోంది. ఎకానమీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, అంతర్జాతీయ పరిస్థితులు చూస్తే ఈక్విటీలంటే సగటు ఇన్వెస్టరు వణికిపోతున్నాడు. చాలా మంది ఇన్వెస్టర్లు మ్యూచువల్‌ఫండ్స్‌లో తమ పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈక్విటీలను నమ్ముకోవడం కంటే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో పొదుపు చేసుకోవడం మంచిదని చాలామంది భావిస్తున్నారు. నిజానికి చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడులను తీసుకువచ్చి భారీ రాబడుల కోసం

Most from this category