STOCKS

News


ఝున్‌ఝున్‌వాలా బుట్టలో డీఎల్‌ఎఫ్‌

Friday 31st August 2018
Markets_main1535654170.png-19807

ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా రియల్‌ ఎస్టేట్‌ రంగంలో అగ్రగామి కంపెనీ అయిన డీఎల్‌ఎఫ్‌లో వాటాలు కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. కంపెనీలో ఝున్‌ఝున్‌వాలాలకు 1.19 కోట్ల షేర్లు ఉన్నాయి. మార్చి నాటికి కంపెనీ ఈక్విటీ 178.40 కోట్ల షేర్లతో ఉంది. ఈ ప్రకారం చూస్తే ఆయన వాటా 0.67 శాతానికి  సమానం. తాజా షేరు ధర రూ.216 ప్రకారం చూస్తే డీఎల్‌ఎఫ్‌లో ఝున్‌ఝున్‌వాలా వాటాల విలువ రూ.257 కోట్లకు సమానం. చివరిగా ఆయన రూ.170 స్థాయిలో షేర్లను కొనుగోలు చేశారు. 

 

డీఎల్‌ఎఫ్‌లో ఝున్‌ఝున్‌వాలా వాటాల వివరాలు లిస్టింగ్‌ నిబంధనల మేరకు బయటకు వెల్లడించాల్సిన అవసరం లేదు. అందుకే కంపెనీ ఇప్పటి వరకు బహిర్గతం చేయలేదు. అయినా సరే తాజాగా ఈ వివరాలను వెల్లడిస్తున్నట్టు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. డీఎల్‌ఎఫ్‌ షేర్లను తొలిసారిగా ఝున్‌ఝున్‌వాలా 2016లో కొనుగోలు చేశారు. 2017-18లోనూ షేర్లను కొనుగోలు చేసి, విక్రయించడం జరిగింది. గత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో 75 లక్షల షేర్ల వరకు (0.42 శాతం) ఆయన కలిగి ఉన్నారు. ఇవి గత గణాంకాలు. ఝున్‌ఝున్‌వాలా సాధారణంగా తన పేరు లేదా భార్య రేఖ పేరుతో, తన పెట్టుబడుల సంస్థ రేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పేరుమీద కూడా పెట్టుబడులు పెడుతుంటారు. ఒక శాతం మించి పెట్టుబడులను కలిగి ఉంటే ఆ సమాచారం ఆయా కంపెనీల వాటాదారుల వివరాల్లో ఉంటుంది. ఢిల్లీ ఎన్‌సీఆర్‌ ప్రాంతానికే చెందిన నిర్మాణ రంగ కంపెనీ జైప్రకాష్‌ అసోసియేట్స్‌లోనూ ఝున్‌ఝున్‌వాలాకు 2 శాతం వాటా ఉన్న విషయం తెలిసిందే. లుపిన్‌, టైటాన్‌ తదితర ఎన్నో కంపెనీల్లో ఆయనకు పెట్టబడులు ఉ‍న్నాయి.

 

భవిష్యత్తు మెరుగు!
డీఎల్‌ఎఫ్‌కు ముందున్నది బంగారు భవిష్యత్తు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డీఎల్‌ఎఫ్‌ స్టాక్‌కు ప్రముఖ బ్రోకరేజీ సంస్థ జేపీ మోర్గాన్‌ ఓవర్‌వెయిట్‌ రేటింగ్‌ ఇచ్చింది. 2019 మార్చి 1 నాటికి ఈ స్టాక్‌ లక్ష్యిత ధర రూ.280గా పేర్కొనడం గమనార్హం. హర్యానాలోని గురుగ్రామ్‌, ఫరీదాబాద్‌, యూపీలోని నోయిడా, ఘజియాబాద్‌, గ్రేటర్‌ నోయిడా వంటి కీలక మార్కెట్లలో డీఎల్‌ఎఫ్‌ బలమైన రియల్‌ ఎస్టేట్‌ ప్లేయర్‌గా ఉంది. ఇక్కడ చిన్న సంస్థలు బయటకు వెళ్లిపోతుండడంతో డీఎల్‌ఎఫ్‌ వంటి పెద్ద సంస్థలకు లాభకరమన్నది విశ్లేషణ. ఈ ఆర్థిక సంవత్సరంలో క్వాలిఫైడ్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లకు షేర్ల జారీ ద్వారా రూ.4,000 కోట్ల మేర సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. 



You may be interested

విస్తతమైన ర్యాలీ ముందుంది: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌

Friday 31st August 2018

నిఫ్టీ జీవితకాల గరిష్ట స్థాయి 11,760ని నమోదు చేసిన తర్వాత కీలక సూచీలు స్థిరీకరణ దశలో ఉన్నాయి. నిఫ్టీ 11,000 స్థాయిలో ఉన్నప్పుడు చాలా మంది నిపుణులు మార్కెట్‌ విషయంలో అప్రమత్తత ప్రకటించారు. ఈ స్థాయికి మార్కెట్లు పరుగులు తీస్తాయని వారు అస్సలు అంచనా వేయలేకపోయారు. ఇందులో హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ఇనిస్టిట్యూషనల్‌ రీసెర్చ్‌ హెడ్‌ దీపేన్‌సేత్‌ కూడా ఒకరు కావడం గమనార్హం. ఆ అంచనాలను దాటి మార్కెట్ల పయనం ఉండడంతో

ఆటో ఔట్‌లుక్‌ అదిరింది.. కానీ?

Thursday 30th August 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ ర్యాలీ చేస్తోంది. అయితే ఇక్కడ ఆటో రంగ పరిస్థితి మాత్రం అర్ధం కావడం లేదు. ఈ పరిశ్రమపై అంచనాలు బాగున్నాయి. అయితే స్టాక్స్‌లో మాత్రం అనుకున్నంత చలనం లేదు. వాహన రంగం గత రెండేళ్లలో ట్రాక్‌లోనే ఉంది. అయితే గత మే నెల నుంచి కొంత వెనుకంజలో ఉంది. బీఎస్‌ఈ ఆటో ఇండెక్స్‌ను సెన్సెక్స్‌తో పోలిస్తే ఈ విషయం అర్థమౌతుంది. మే నెల మధ్య నుంచి

Most from this category