STOCKS

News


కరెక‌్షన్‌లో కొంటునే ఉన్నాడు..

Thursday 25th October 2018
Markets_main1540456544.png-21482

ఆరు కంపెనీల్లో వాటాలు పెంచుకున్న రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా
దేశీయ మార్కెట్లో పతనం కొనసాగుతూనే ఉంది. ఆగస్టు గరిష్టాల నుంచి మార్కెట్లు దాదాపు 10 శాతం పతనమయ్యాయి. ఇదే సమయంలో ప్రముఖ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా పాత సూత్రాన్ని పాటిస్తూ కొనసాగుతున్నారు. అందరూ అమ్ముతుంటే కొను, అంతా కొనేటప్పుడు అమ్ము.. అనే ప్రాథమిక సూత్రాన్ని అనుసరిస్తూ రాకేశ్‌ ఈ త్రైమాసికంలో కొనుగోళ్లు కంటిన్యూ చేశారు. ప్రస్తుతం 27 కంపెనీల్లో రాకేశ్‌కు ఒక శాతానికి మించి వాటాకు సమానమైన షేర్లున్నాయి. ప్రస్తుతం వీటిలో ఎంసీఎక్స్‌ మినహా అన్నీ నష్టాల్లోనే ఉన్నాయి.

రాకేశ్‌కు వాటాలున్న డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేరు కౌంటర్లో ఆయన మరిన్ని కొనుగోళ్లు జరిపినట్లు గణాంకాలు చెబుతున్నాయి. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌తో పాటు, ఎన్‌సీసీలో రాకేశ్‌ వాటాలు పెంచుకున్నారు. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌లో వాటాను ఆయన 2.76 శాతం నుంచి 3.19 శాతానికి పెంచుకున్నారు. క్యు2లో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేరు దాదాపు 60 శాతం పతనమైన సంగతి తెలిసిందే. వీటితో పాటు టీవీ 18లో వాటాను 2.6 శాతం నుంచి 3 శాతానికి, జుబిలాంట్‌ లైఫ్‌సైన్సెస్‌లో వాటాను 1.3 శాతం నుంచి 1.6 శాతానికి, ఎస్కార్ట్స్‌లో 0.1 శాతం మేర పెంచుకున్నారు. క్యు2లో రాకేశ్‌ పోర్టుఫోలియోలోకి కొత్తగా ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌, స్పైస్‌జెట్‌ షేర్లు చేరాయి. స్పైస్‌జెట్‌లో రాకేశ్‌ 1.3 శాతం వాటా కలిగిఉన్నారు. ఫోర్టిస్‌లో 2 శాతం వాటాను కొనుగోలు చేశారు.

ఇదే సమయంలో 13 కంపెనీల్లో ఆయన వాటాలు యథాతధంగా ఉన్నాయి. వీటిలో ఆగ్రోటెక్‌ఫుడ్స్‌, ఫస్ట్‌సోర్స్‌ సొల్యూషన్స్‌, మాన్‌ ఇన్‌ఫ్రా, ఎంసీఎక్స్‌, మంధనా రిటైల్‌ వెంచర్స్‌ ఉన్నాయి. క్రిసిల్‌, జైపీ అసోసియేట్స్‌, లుపిన్‌లో వాటాలను రాకేశ్‌ క్యు2లో విక్రయించారు. రేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అనే కంపెనీ ద్వారా రాకేశ్‌ తన పేరుమీద లేదా తన భార్య రేఖ పేరు మీద షేర్లు కొంటుంటారు. పైన పేర్కొన్న వివరాలు ఆయా కంపెనీలు సమర్పించిన వాటాదారుల వివరాల నుంచి సేకరించడం జరిగింది. క్యు2లో రాకేశ్‌ పోర్టుఫోలియో బాగా నష్టాలు చవిచూసింది. ఈ సమయంలో ఆయన పోర్టుఫోలియోలో పలు షేర్లు 5- 60 శాతం వరకు నష్టాలు చవిచూశాయి. ఫోర్బ్స్‌ ఇండియా ప్రకారం భారత కుబేరుల్లో రాకేశ్‌ 61వ స్థానంలో ఉన్నారు. 



You may be interested

అంచనాల్ని అందుకోని భెల్‌...షేరు 7 శాతం క్రాష్‌

Thursday 25th October 2018

ముంబై:- విద్యుదుత్పత్తి పరికరాలు తయారు చేసే ప్రభుత్వ రంగ భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌(భెల్‌) నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ విశ్లేషకుల అంచనాలను అందుకోలేకపోయాయి.  బీహెచ్‌ఈఎల్‌ ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో రూ.185.17 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే క్యూ2లో సాధించిన రూ.115.42 కోట్లతో పోలిస్తే ఇది 60శాతం అధికం. అయితే విశ్లేషకులు మాత్రం ఈ క్యూ2లో భెల్‌ కంపెనీ రూ.218 కోట్ల

ఏడాది కనిష్టానికి ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌

Thursday 25th October 2018

ముంబై:- క్యూ2 ఫలితాల్ని మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగా సాధించినప్పటికి.., ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌ షేరు గురువారం ట్రేడింగ్‌లో ఏడాది కనిష్టానికి పతనమైంది. నేడు బీఎస్‌ఈలో రూ.126.6ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో షేరు ఏకంగా 12శాతం పతనమై రూ.111.20ల వద్ద ఏడాది కనిష్టానికి చేరుకుంది. మధ్యాహ్నం గం.1:00లకు షేరు గత ముగింపు ధర(రూ.126.6)తో పోలిస్తే 7శాతం నష్టంతో రూ.117.50ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట,

Most from this category