STOCKS

News


జెట్‌ ఎయిర్‌ షేర్లు 11శాతం జంప్‌

Tuesday 23rd April 2019
Markets_main1556000643.png-25291

మూడురోజుల వరుసగా నష్టాల్లో ముగిసిన జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు మంగళవారం లాభాల బాట పట్టాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.158.80ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌ రుణదాతలు కంపెనీకి అంతర్జాతీయంగా ఉన్న ల్యాండింగ్‌ స్లాట్‌ను, ఓవర్సీస్‌ ప్లైయింగ్‌ రైటర్స్‌ పరిరక్షించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఫైనాన్షియల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఒక కథనాన్ని ప్రచురించింది. . బ్యాంకులకు రూ.8,500 కోట్లు, విమానాల లీజుకిచ్చిన సంస్థలకు, ఉద్యోగులకు జెట్‌ రూ.4,000 కోట్ల బాకీ పడింది. తీవ్ర రుణ సంక్షోభంలో చిక్కుకోవడంతో కార్యకలాపాలను పూర్తిగా నిలివేయడంతో కంపెనీ షేర్లు మూడు రోజుల్లో ఏకంగా 41శాతం నష్టపోయిన సంగతి తెలిసిందే. షేరు భారీ పతనం నేపథ్యంలో షేరు కనిష్ట విలువల వద్ద ట్రేడ్‌ అవుతుండంతో హై-రిస్క్‌ ఇన్వెస్టర్లు ఈ షేరు కొనుగోలుకు మొగ్గుచూపారు. ఈ నేపథ్యంలో కంపెనీ షేరు 11.50శాతం ర్యాలీ చేసి రూ.172.50ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం గం.11:30ని.లకు షేరు గతముగింపు ధర(రూ.154.6)తో పోలిస్తే రూ.9.50శాతం లాభంతో రూ.169.45ల వద్ద ట్రేడ్‌ అవుతోందిషేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 158.00  రూ.650.50లుగా నమోదయ్యాయి.



You may be interested

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు రేటింగ్‌ జోష్‌

Tuesday 23rd April 2019

విదేశీ రీసెర్చ్‌ సంస్థ మెక్వారీ ఔట్‌పెర్ఫార్మ్‌ రేటింగ్‌ కేటాయింపుతో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో 6శాతం ర్యాలీ చేశాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.400.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. గతేడాది ప్రమోటర్‌ సుభాస్‌ చంద్ర కంపెనీలో కొంత వాటా విక్రయించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. రానున్న 1-2 వారాల్లో ఈ వాటా విక్రయ అంశం ఓ కొలిక్కి వస్తుందని, వాటా కొనుగోలుకు అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి

పవన్‌హన్స్‌లో ఆగిన వాటాల విక్రయం

Tuesday 23rd April 2019

ఎన్నికల తర్వాతే తదుపరి ప్రక్రియ న్యూఢిల్లీ: హెలికాప్టర్‌ సేవల సంస్థ పవన్‌హన్స్‌లో కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమం తాత్కాలికంగా నిలిచిపోయింది. ఒకే ఒక్క ఇన్వె‍స్టర్‌ నుంచి బిడ్‌ వచ్చినట్టు ఓ సీనియర్‌ అధికారి తెలియజేశారు. ఎన్నికల వరకు ఈ ప్రక్రియను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పవన్‌హన్స్‌లో కేంద్రానికి 51 శాతం వాటా, ఓఎన్‌జీసీకి 49 శాతం వాటా ఉన్నాయి. ఆసక్తి కలిగిన ఇ‍న్వెస్టర్లు ఫైనాన్షియల్‌ బిడ్లను

Most from this category