STOCKS

News


జెట్‌ ఎయిర్‌వేస్‌ను వీడని నష్టాలు

Tuesday 11th June 2019
Markets_main1560237549.png-26227

  • మరో 14శాతం నష్టపోయిన షేర్లు

గత కొద్ది రోజులుగా నష్టాల బాటలోనే ప్రయాణిస్తున్న ప్రైవేట్‌ రంగ సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు మంగళవారం మరో 14.50శాతం నష్టపోయాయి. హిందూజా, ఎతిహాత్‌ కంపెనీలు జెట్‌ ఎయిర్‌ పునరుర్ధణకు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదనే వార్తలు ఇందుకు కారణమవుతున్నాయి. నేడు బీఎస్‌ఈలో కంపెనీ షేర్లు రూ.112.70ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. లండన్‌ ఆధారిత హిందూజా గ్రూప్‌ జెయిట్‌ ఎయిర్‌వేస్‌లో వాటా కొనుగోలుకు చేపట్టిన చర్చలను నిలిపివేసినట్లు మింట్‌ మీడియా ఒక వార్త కథనాన్ని ప్రచురించింది. అలాగే అబుదాబి కంపెనీ ఎతిహాద్‌... జెయిట్‌ ఎయిర్‌వేస్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు విముఖత చూపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు షమన్‌ వీల్స్‌, గగ్గర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కంపెనీలు తమకు రుణాన్ని చెల్లించడంలో జెయిట్‌ ఎయిర్‌వేస్‌ విఫలమైనందున సదరు కంపెనీపై దివాళాస్మృతి చర్యలను తీసుకోవాలని ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించాయి. ఫలితంగా నేడు ఈ కంపెనీ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇంట్రాడేలో 14.50శాతం నష్టపోయి రూ.107.15ల వద్ద కొత్త ఏడాది కనిష్టాన్ని నమోదు చేశాయి. షేర్లకు ఇవి వరుసగా ఎనిమిదోరోజూ నష్టాల ట్రేడింగ్‌ కావడం గమనార్హం. మధ్యాహ్నం గం.12:00లకు షేర్లు గత ముగింపు(రూ.125.2)తో పోలిస్తే 10శాతం నష్టంతో రూ.112.45ల వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఇక షేర్ల ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 107.15 రూ.420.70లుగా నమోదయ్యాయి.

ఇక ఇదే సమయానికి సెన్సెక్స్‌ 142 పాయింట్ల లాభంతో 39927.06 వద్ద, నిఫ్టీ 36.7 పాయింట్లు పెరిగి రూ.11959.40 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

ఆటోమొబైల్‌ ప్లాంట్లు షట్‌డవున్‌

Tuesday 11th June 2019

తగ్గిన వాహన విక్రయాలు  తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేయనున్నా తయారి సంస్థలు దేశియ మార్కెట్లలో డిమాండ్‌ లేకపోవడమే కారణం  సాక్షి: వాహన తయారి సంస్థలు కొన్ని రోజుల పాటు తమ ఉత్పత్తి ప్లాంట్‌లను మూసివేయడానికి సిద్ధమవుతున్నాయి. దేశియ మార్కెట్లలో అమ్మకాలు తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించాయి. రూ.35,000 కోట్ల విలువ గల 5 లక్షలకు పైగా ప్రయాణ వాహనాలు జూన్‌ మొదటి వారానికి  అమ్మకాలు లేక డీలర్స్‌ వద్దనే ఉన్నాయన్నారు.  రూ. 17,500 కోట్ల

జీవితకాల గరిష్టానికి చేరువలో టీసీఎస్‌

Tuesday 11th June 2019

దేశ అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా క‌న్సల్టెన్సీ స‌ర్వీసెస్ (టీసీఎస్) షేర్లు మంగళవారం ఉదయం సెషన్స్‌లో ఆల్‌టైంకి చేరువలో ట్రేడ్‌ అవుతున్నాయి. క్రితం ట్రేడింగ్‌ సెషన్‌లో దాదాపు 2.5శాతం లాభపడిన ఈ షేర్లు నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.2237.90ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు ఈ షేర్ల కొనుగోళ్లకు  మొగ్గు చూపడంతో 1.25శాతం లాభపడి రూ.2257.00 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. కాగా ఈ

Most from this category