STOCKS

News


అప్పులున్న కంపెనీలకు ‘జెట్‌’ భయాలు

Friday 19th April 2019
Markets_main1555655819.png-25226

భారీగా పతనమైతున్న షేర్ల ధరలు
భారీగా రుణభారమున్న కంపెనీలకు జెట్‌ సెగలు తగులుతున్నాయి. రుణాలు తీర్చలేక కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు గురువారం భారీగా పతనమైన సంగతి తెలిసిందే. ఈ సెగలు అప్పులు ఎక్కువున్న ఇతర కంపెనీలకు కూడా తాకాయి. దీంతో సదరు కంపెనీల షేర్లు సైతం క్రాష్‌ అయ్యాయి. ముఖ్యంగా అనీల్‌ అంబానీ గ్రూప్‌నకు చెందిన కంపెనీలపై జెట్‌ ప్రభావం ఎక్కువగా కనిపించింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ సూచీలో ఈ గ్రూప్‌ కంపెనీల షేర్లు అధ్వాన్న ప్రదర్శన చూపాయి. ఆర్‌క్యాప్‌, ఆర్‌పవర్‌, ఆర్‌ఇన్‌ఫ్రా, ఆర్‌నిప్పన్‌లైఫ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీల షేర్లు 4- 13 శాతం మేర కుంగిపోయాయి. స్మాల్‌క్యాప్స్‌లో ఆర్‌ హోమ్‌ ఫైనాన్స్‌ 6.6 శాతం, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ 8 శాతం క్షీణించాయి. అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ పోర్ట్స్‌ షేర్లు 1-3 శాతం మేర పతనమయ్యాయి.

బలహీన కంపెనీలకు ప్రభుత్వం ఎలాంటి బెయిల్‌అవుట్‌ అందించదని జెట్‌ విషయంలో స్పష్టమైందని అందుకే అధిక రుణభారం ఉన్న కంపెనీల షేర్లు నేల చూపులు చూస్తున్నాయని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గురువారం జెట్‌ షేరు 32 శాతం క్షీణించింది. బాగా ప్రఖ్యాతిఉన్న పెద్ద కంపెనీ షేరు అధిక రుణభారం, కార్యనిర్వాహక ఇబ్బందుల కారణంగా ఒక్కపాటున పతనమైతే అలాంటి లక్షణాలున్న ఇతర కంపెనీల షేర్లు, అదే రంగానికి చెందిన కంపెనీల షేర్లు అదేబాటలో పయనిస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వీటిని ఆదుకునే నాధుడు కనిపించేవరకు ఇలాంటి షేర్ల పరిస్థితి అధోముఖంగానే ఉంటుందంటున్నారు. గతేడాది ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ కుంగిపోయినప్పుడు అదే తరహా కంపెనీల షేర్లు సైతం భారీగా పడిపోయాయని గుర్తుచేస్తున్నారు. 



You may be interested

11600- 12000పాయింట్ల రేంజ్‌లో నిఫ్టీ!

Friday 19th April 2019

యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ అంచనా వచ్చే మూడు నాలుగు వారాల పాటు నిఫ్టీ 11600- 12000 పాయింట్ల రేంజ్‌లో కదలాడవచ్చని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ రిసెర్చ్‌ హెడ్‌ రాజేష్‌ పాల్వియా అంచనా వేస్తున్నారు. గత రెండు వారాల శ్రేణిని ఈ వారం నిఫ్టీ దాటి మరో ఆల్‌టైమ్‌హైని చూసింది. దీంతో మిడ్‌టర్మ్‌కు బుల్లిష్‌ సెంటిమెంట్‌ పుంజుకుందని తెలిపారు. చార్టుల్లో హయ్యర్‌టాప్స్‌, బాటమ్స్‌ ఏర్పరుస్తోందన్నారు. నిఫ్టీ 11760 పాయింట్లకు పైన ఉన్నంత వరకు బుల్లిష్‌గానే ఉంటుందని,

11800 వద్ద ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Friday 19th April 2019

విదేశీ మార్కెట్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ శుక్రవారం 11800ల స్థాయికి అందుకుంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో ఉదయం గం.11:30ని.లకు 11800ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ కాంట్రాక్టు  గురువారం ముగింపు 11771తో పోలిస్తే 29 పాయింట్ల లాభంతో ఉందనే విషయాన్ని గమనించాలి. ఇక నేడు ఆసియాలోని అన్ని మార్కెట్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా జపాన్‌ ఇండెక్స్‌ నికాయ్‌ ఇండెక్స్‌ అరశాతం లాభపడింది. తైవాన్‌, కోప్పి, చైనా షాంఘై కాంపోజిట్‌ సూచీలు 0.10శాతం లాభపడ్డాయి. మరోవైపు

Most from this category