STOCKS

News


జెట్‌ ఎయిర్‌వేస్‌ 10 శాతం డౌన్‌

Friday 10th August 2018
Markets_main1533883181.png-19115

ముంబై:- తొలి త్రైమాసిక ఫలితాల ప్రకటన వాయిదా పడటంతో శుక్రవారం జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు నేలచూపులు చూస్తున్నాయి. నేడు బీఎస్‌ఈలో జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు రూ.271.55ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కంపెనీ ఆగస్ట్‌ 09న (నిన్న) నిర్వహించిన బోర్డు సమావేశంలో త్రైమాసిక ఫలితాల విడుదలను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. అలాగే ఆడిట్‌ ప్యానల్‌ కూడా ఫలితాల ప్రకటనకు నిరాకరించడంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు నేటి ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 10శాతం వరకు నష్టపోయాయి. ట్రేడింగ్‌ ప్రారంభం తరువాత కూడా షేర్ల అమ్మకాలు విపరీతంగా జరగడంతో ఇంట్రాడే 13.29 శాతం మేర నష్టపోయి రూ.261.60ల వద్ద ఏడాది కనిష్టానికి చేరుకుంది. తరువాత కోలుకున్న షేర్లు మధ్యాహ్నం గం.11:45ని.లకు షేర్లు 7.42 శాతం నష్టపోయి రూ.279.30ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. గడిచిన 6నెలల కాలంలో షేరు ఏకంగా 65శాతం మేర నష్టపోయింది. ఇక షేరు ఏడాది కనిష్ట, గరిష్ట, ధరలు వరుసగా రూ.261.60లు రూ.285.60ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

స్టార్‌ సిమెంట్‌ కొనొచ్చు..

Friday 10th August 2018

బ్రోకరేజ్‌: ఆనంద్‌రాఠి స్టాక్‌: స్టార్‌ సిమెంట్‌ ఇండస్ట్రీ: సిమెంట్‌ ప్రస్తుత ధర: రూ.114 టార్గెట్‌ ప్రైస్‌: రూ.160 బ్రోకరేజ్‌ సంస్థ ఆనంద్‌రాఠి.. స్టాక్‌ సిమెంట్‌పై బుల్లిష్‌గా ఉంది. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేస్తోంది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.160గా నిర్ణయించింది. సరుకు, విద్యుత్‌, ఇంధన వ్యయాల హేతుబద్దీకరణ సహా విక్రయాల్లో పెరుగుదల, పనితీరు మెరుగుపడటం వంటి అంశాలను ఇందుకు కారణంగా పేర్కొంది. స్టార్‌ సిమెంట్‌కు మంచి బ్రాండ్‌ పేరు ఉందని, మార్కెట్‌లో 23 శాతం వాటాను

సాంక్టమ్‌ వెల్త్‌ షార్ట్‌టర్మ్‌ సిఫార్సులు

Friday 10th August 2018

 ఒకటి రెండు నెలల కాలానికి 20 శాతం వరకు రాబడినిచ్చే ఐదు స్టాకులను సాంక్టమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ రికమండ్‌ చేస్తోంది... 1. యాక్సిస్‌ బ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 750. స్టాప్‌లాస్‌ రూ. 580. మూడేళ్ల పాటు రూ. 365- 655 రేంజ్‌లో కన్సాలిడేట్‌ అయింది. నెల చార్టుల్లో సౌష్ఠవాకార త్రిభుజాకృతిని ఏర్పరిచింది. తాజాగా అప్‌మూవ్‌ సాధించి నిరోధక ట్రెండ్‌లైన్‌ను దాటేసింది. రెండువారాలుగా వాల్యూంలతో కూడిన అప్‌మూవ్‌ చూపుతోంది. బోలింగర్‌ బ్యాండ్‌,

Most from this category