STOCKS

News


టాటాతో చర్చలు.. జెట్‌ 10% అప్‌

Monday 5th November 2018
Markets_main1541411552.png-21725

జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు ధర సోమవారం ఏకంగా 10 శాతానికి పైగా ఎగసింది. టాటా గ్రూప్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌ మధ్య రెండో విడత చర్చలు ప్రారంభమైనట్లు మీడియాలో వార్తలు వెలువడటం ఇందుకు కారణం. సీఎన్‌బీసీ-టీవీ18 ప్రకారం.. టాటా గ్రూప్‌.. జెట్‌ ఎయిర్‌వేస్‌లో సంస్థ ప్రమోటర్ల వాటాను, ఇతిహద్‌ వాటాను కొనుగోలు చేయాలని భావిస్తోంది. దీనికి సంబంధించి ఇరు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ ఈ డీల్‌ కుదిరితే.. అప్పుడు టాటా గ్రూప్‌.. విస్తారాను జెట్‌ ఎయిర్‌వేస్‌తో విలీనం చేసే అవకాశముంది. 

కాగా మధ్యాహ్నం 3:27 సమయంలో ఎన్‌ఎస్‌ఈలో జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు ధర 10.23 శాతం వృద్ధితో రూ.252 వద్ద ట్రేడవుతోంది. 



You may be interested

ఎస్‌బీఐ లాభం రూ.945 కోట్లు

Monday 5th November 2018

దేశీ దిగ్గజ బ్యాంక్‌ ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ (ఎస్‌బీఐ) తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసిక (క్యూ2, జూలై-సెప్టెంబర్‌) ఫలితాలను ప్రకటించింది. వార్షిక ప్రాతిపదికన బ్యాంక్‌ స్టాండలోన్‌ నికర లాభం 40 శాతం క్షీణతతో రూ.945 కోట్లకు తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంక్‌ రూ.1,581 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. క్యూ1లో బ్యాంక్‌ ఏకంగా రూ.4,875 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది.

ద్రవ్యకొరతతో హౌసింగ్‌ ఫైనాన్స్ షేర్ల పతనం

Monday 5th November 2018

బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో ద్రవ్యత్వ కొరత అంశం మరోసారి తెరపైకి రావడంతో  సోమవారం ఆ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీల్లో లిక్విడిటీ కొరత ఇంకా తీరలేదని కార్పోరేట్‌ అఫైర్స్‌ సెక్రటరీ సోమవారం తెలిపారు. ఎన్‌బీఎఫ్‌సీలకు బ్యాంకులు రుణం ఇచ్చే విషయంలో ఆర్‌బీఐ కొంత నిబంధనలను సడలించినప్పటికి బ్యాంకులు మాత్రం హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు రుణాల కేటాయింపు విషయంలో వెనకడుగు వేస్తన్నట్లు ఆయన తెలిపారు. ఈ కారణంగా ఎన్‌బీఎఫ్‌సీ

Most from this category