STOCKS

News


జెట్‌ఎయిర్‌ 4.50శాతం డౌన్‌

Tuesday 16th April 2019
Markets_main1555398946.png-25163

నిధుల సమీకరణ అంశంపై స్పష్టత రాకపోవడంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ కంపెనీ షేర్లు మంగళవారం మరో 4శాతం నష్టపోయాయి. నేడు బీఎస్‌ఈలో జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు రూ.254.50ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కంపెనీ అత్యవసర కార్యకలాపాల నిర్వహణకు మూలధన నిధుల సమీకరించే అంశంపై సోమవారం బ్యాంకర్లు, యాజమాన్యంతో చర్చలు జరిపారు. చర్చలు సుధీర్ఘంగా జరిగినప్పటికీ ఇరువర్గాలు తుది నిర్ణయానికి రాలేకపోయారు. దీంతో సమావేశాన్ని నేటి వాయిదా చేస్తున్నట్లు కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ వినయ్‌ దూబే ప్రకటించారు. ఈ నేపథ్యంలో నేడు కంపెనీ షేర్లు గతముగింపు(రూ. 261.8)తో పోలిస్తే 2.78శాతం నష్టంతో రూ.254.50ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నేడు కూడా ఇన్వెస్టర్లు షేర్ల అమ్మకానికే మొగ్గుచూపడంతో ఇంట్రాడేలో 4.50శాతం వరకూ నష్టపోయి రూ. 250.20ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. మధ్యాహ్నం గం.12:00లకు షేర్లు గతముగింపుతో పోలిస్తే 2.50శాతం నష్టంతో రూ.254.95ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 163.00  రూ.650.50లుగా నమోదయ్యాయి.



You may be interested

పీసీ జ్యువెల్లర్స్‌ 18శాతం జూమ్‌

Tuesday 16th April 2019

పీసీ జ్యువెల్లర్స్‌ షేర్లు వరుసగా నాలుగో ట్రేడింగ్‌ సెషన్స్‌లో లాభపడ్డాయి. నేటి బీఎస్‌ఈలో ట్రేడింగ్‌లో 18శాతం ర్యాలీ చేశాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టింగ్‌ సంస్థ కర్లినా ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా షేరు ధర రూ.105.73 ధర వద్ద ఏప్రిల్‌ 10న 37లక్షల ఈక్విటీ షేర్లను రూ.35 కోట్లకు, ఏప్రిల్‌ 14న అదే కంపెనీ 47లక్షల ఈక్విటీ షేర్లను రూ.46 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ మొత్తం ఈక్విటీ షేర్ల వాటా

జీఎస్‌టీ ఆడిట్‌ రిపోర్టులను ఫైల్‌ చేయండి

Tuesday 16th April 2019

- రూ.2 కోట్ల టర్నోవర్‌ దాటితే ఫైలింగ్‌ తప్పనిసరి న్యూఢిల్లీ: 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీఎస్‌టీ ఆడిట్‌ రిపోర్టులు దాఖలు చేయడానికి (జీఎస్‌టీఎన్‌) నెట్‌వర్క్‌లో ఫార్మెట్‌ సిద్ధంగా ఉందని కౌన్సిల్‌ ప్రకటించింది. ఫైలింగ్‌కు ఆఖరి తేదీ జూన్‌ 30 కాగా, రూ.2 కోట్ల టర్నోవర్‌ దాటితే ఫైలింగ్‌ తప్పనిసరని సోమవారం ప్రకటించింది. డిసెంబర్‌లోనే ఇందుకు సంబంధించిన ఫామ్‌లు.. జీఎస్‌టీఆర్‌-9 (సామాన్య ట్యాక్స్‌ పేయర్లకు), జీఎస్‌టీఆర్‌-9ఏ (కాంపోజిషన్‌ ట్యాక్స్‌ పేయర్లకు), జీఎస్‌టీఆర్‌-9సీ

Most from this category