STOCKS

News


రెండోరోజూ జెట్‌ఎయిర్‌వేస్‌ జంప్‌

Tuesday 26th March 2019
Markets_main1553586950.png-24802

జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్ల జోరు వరుసగా రెండోరోజూ కొనసాగుతోంది. నేడు బీఎస్‌ఈలో జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు రూ.265.25ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. తీవ్ర నిధుల కొరత, రుణ భారం సమస్యల నుంచి గట్టేందుకు పలు బ్యాంకులు కంపెనీకి రూ. 1500 కోట్ల అదనపు రుణాలను మంజూరు చేయనున్నాయి. స్టేట్‌బ్యాంక్‌ అధ్యక్షతన రుణదాతల కన్సార్షియం కంపెనీలో మెజారిటీ వాటాను తీసుకోనుండటం, ప్రమోటర్‌ నరేష్‌ గోయల్‌ పదవి నుంచి తప్పుకునేందుకు నిర్ణయించుకోవడం వంటి సానుకూలాంశాలతో ఇన్వెస్టర్లు జెట్‌ఎయిర్‌వేస్‌ షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఫలితంగా షేరు 9.50శాతం ర్యాలీ చేసి రూ.279.00ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం గం.1:00లకు షేరు గత ముగింపు ధర(రూ.254.5)తో పోలిస్తే 9శాతం లాభంతో రూ. 277ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.163.00 రూ.650.50లుగా ఉన్నాయి. గోయల్‌ వైదొలగిన వార్తలతో జెట్‌ షేరు గత ట్రేడింగ్‌లో 17శాతం లాభపడిన సంగతి తెలిసిందే.



You may be interested

రాణిస్తున్న రియల్టీ షేర్లు

Tuesday 26th March 2019

లాభాల మార్కెట్‌లో రియల్టీ షేర్లు రాణిస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ రంగ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ నేడు ట్రేడింగ్‌లో 1.50శాతం లాభపడింది. ఇండెక్స్‌లోని మొత్తం 10 షేర్లకు గానూ 6 షేర్లు లాభాల్లో ట్రేడవ్వగా, 4షేర్లు మాత్రం నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా డీఎల్‌ఎఫ్‌ లిమిటెడ్‌ షేరు 8.50శాతం పెరిగింది.  రూ.3,000 కోట్ల రుణభారం తగ్గించుకునేందుకు సోమవారం క్యూఐపీ(క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌)ను ఆరంభించిన సంగతి తెలిసిందే. అలాగే

వంట నూనెల మార్కెట్లో బ్రాండ్స్‌ హవా

Tuesday 26th March 2019

వంట నూనెల మార్కెట్లో బ్రాండ్స్‌ హవా వ్యవస్థీకృత రంగానిదే 70 శాతం వాటా  సగటు వినియోగం 18 కిలోలకు చేరిక   హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: వంట నూనెల మార్కెట్లో బ్రాండెడ్‌ కంపెనీల హవా నడుస్తోంది. రెండు దశాబ్దాల క్రితం దేశంలో మొత్తం అమ్మకాల్లో విడినూనెల వాటా 70 శాతం ఉండేది. ప్రస్తుతం సీన్‌ రివర్స్‌ అయింది. ఇప్పుడీ వాటాను ప్యాక్డ్‌ విభాగం కైవసం చేసుకుంది. వ్యవస్థీకృత బ్రాండ్లు క్రమంగా మార్కెట్‌ను చేజిక్కించుకుంటున్నాయి. ఫుడ్‌ సేఫ్టీ

Most from this category