STOCKS

News


రెండో రోజూ జెట్‌ ఎయిర్‌వేస్‌ ర్యాలీ

Friday 16th November 2018
Markets_main1542346936.png-22070

టాటా సన్స్‌ కంపెనీ టేకోవర్‌ వార్తల నేపథ్యంలో జెట్‌ ఎయిర్‌ షేర్ల ర్యాలీ రెండో రోజూ కొనసాగుతోంది. నేటి బీఎస్‌ఈ ట్రేడింగ్‌లోనూ జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు మరో 11శాతం ర్యాలీ చేసింది. తీవ్ర ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ను టాటా గ్రూప్‌ కొనుగోలుకు మొగ్గుచూపుతుందనే వార్తల నేపథ్యంలో క్రితం ట్రేడింగ్‌ సెషన్‌లో 25శాతం లాభంతో రూ.321 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. జెట్‌ ఎయిర్‌వేస్‌ను కొనుగోలు చేసుకునేందుకు టాటా సన్స్‌ బోర్డు నేడు కీలక సమావేశం నిర్వహించనుంది. ఒకవేళ కొనుగోలుకు బోర్డు ఆమోదం తెలిపినట్లయితే డీల్‌ మరింత వేగవంతమవుతుంది. ఈ నేపథ్యంలో నేడు మరోసారి జెట్‌ ఎయిర్‌వేస్‌ కంపెనీ షేర్లకు డిమాండ్‌ పెరిగింది. ఫలితంగా షేరు 11శాతం పెరిగి రూ.356.60ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. నేడు ఉదయం గం.10:45ని.లకు సూచీ గత ముగింపు ధరతో పోలిస్తే 8శాతం నష్టంతో రూ.347.35ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇక షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.163.00 రూ.883.65లుగా నమోదయ్యాయి.



You may be interested

రుణభారం తగ్గించుకోవడంపై కంట్రీక్లబ్ దృష్టి

Friday 16th November 2018

ముంబై: రుణభారాన్ని గణనీయంగా తగ్గించుకునే క్రమంలో నిధుల సమీకరణకు కంట్రీ క్లబ్‌ వివిధ మార్గాలు అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని బేగంపేట్‌, కర్ణాటకలోని సర్జాపూర్‌ ప్రాపర్టీలను సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు కంట్రీ క్లబ్ హాస్పిటాలిటీ అండ్ హాలిడేస్‌ (సీసీహెచ్‌హెచ్‌ఎల్‌) చైర్మన్ వై.రాజీవ్ రెడ్డి వెల్లడించారు. వీటిని అభివృద్ధి చేయడంతో 5 లక్షల చదరపుటడుగుల డెవలప్‌మెంట్ ఏరియా అందుబాటులోకి వస్తుందని, కంపెనీకి రూ.140

కోటక్‌ బ్యాంక్‌లో ఐఎన్‌జీ గ్రూప్‌ వాటా విక్రయం !

Friday 16th November 2018

న్యూఢిల్లీ: కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌లో తన కున్న వాటాను డచ్‌ ఆర్థిక దిగ్గజం ఐఎన్‌జీ గ్రూప్‌ విక్రయించనుంది. కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌లో ఈ గ్రూప్‌కు 3.73 శాతం వాటా ఉంది. ఈ వాటా మొత్తాన్ని ఈ వారంలో బహిరంగ మార్కెట్‌ లావాదేవీల ద్వారా ఐఎన్‌జీ గ్రూప్‌ విక్రయించనున్నదని సమాచారం. ఒక్కో షేర్‌ను రూ.1,070 ధర చొప్పున విక్రయించడానికి ఐఎన్‌జీ గ్రూప్‌ రెండు, మూడు సంస్థలతో డీల్‌ కుదుర్చుకున్నదని సంబంధిత వర్గాలు

Most from this category