STOCKS

News


టాటా డీల్‌పై డైలమా... ఎయిర్‌వేస్‌ డౌన్‌

Monday 19th November 2018
Markets_main1542609004.png-22180

ముంబై:- కంపెనీలో వాటాను కొనుగోలుకు టాటాసన్స్‌ గ్రూప్‌ ఆసక్తి చూపిన నేపథ్యంలో గతవారం 41శాతం ర్యాలీ చేసిన జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు సోమవారం నష్టాల బాటలోకి పట్టింది. వాటా కొనుగోలు అంశంపై చర్చలు జరిపినప్పటికి.., బోర్డు ఇంకా  నిర్మాణాత్మక నిర్ణయాలేవీ తీసుకోలేదని టాటాసన్స్‌ ప్రకటించింది. ఈ ప్రకటనతో నేడు జెట్‌ ఎయిర్‌వేస్‌ బీఎస్‌ఈలో 6.59శాతం నష్టంతో రూ.324.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో ఇన్వెస్టర్లు షేరులో లాభాల స్వీకరణకు పూనుకోవడంతో షేరు 12.50శాతం వరకు నష్టపోయి రూ.303.25ల వద్ద చేరుకుంది. ఆగస్ట్‌ 10వ తేది తరువాత ఒకేరోజులో షేరు ఇంత స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. ఉదయం గం.10:45ని.లకు షేరు గత ముగింపు ధర(రూ.346.85)తో పోలిస్తే 7శాతం నష్టంతో రూ.321ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇక షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.163.00లు రూ.883.65లుగా నమోదయ్యాయి. ఈ ఏడాదిలో ముడిచమురు ధరల పెరుగుదలతో కారణంగా ఈ షేరు ఏడాదిలో కాలంలో 53.30శాతం వరకు నష్టపోయింది.



You may be interested

ఆర్‌బీఐ-కేంద్రం విభేదాలు.. విదేశీ ఇన్వెస్టర్ల ఆందోళన

Monday 19th November 2018

ఆర్‌బీఐ-కేంద్రం మధ్య నడుస్తోన్న పలు వివాదాలు విదేశీ ఇన్వెస్టర్లపై ప్రతికూల ‍ప్రభావం చూపుతున్నాయి. రిజర్వు బ్యాంక్‌ స్వే‍చ్ఛను నియంత్రించాలని చూస్తోన్న కేంద్ర ప్రభుత్వపు విధానాల వల్ల విదేశీ ఇన్వెస్టర్లలో ఆందోళనలు తలెత్తాయి. మరీముఖ్యంగా ఇండియన్‌ రూపాయి, బాండ్‌ మార్కెట్‌పై ఒత్తిడి పెగిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ఆర్‌బీఐ స్వతంత్రతను నియంత్రించేలా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకున్నా.. భారత్‌ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుందని లండన్‌లోని పిన్‌బ్రిడ్జ్‌

సీమెన్స్‌కు ఫలితాల షాక్‌..!

Monday 19th November 2018

5శాతం నష్టపోయిన షేరు ముంబై:- ఇంజనీరింగ్‌ దిగ్గజ కంపెనీ సీమెన్స్‌ లిమిటెక్‌ షేరుకు జూలై - సెప్టెంబర్‌ క్వార్టర్‌ ఫలితాలు షాక్‌నిచ్చాయి.  త్రైమాసిక ఫలితాలు ఆశించినస్థాయిలో నమోదు కాకపోవడంతో సోమవారం సీమెన్స్‌ షేర్లు 5శాతం నష్టపోయాయి. నేడు సీమెన్స్‌ షేర్లు బీఎస్‌ఈలో రూ.978.5ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఈ క్వార్టర్‌ ఫలితాలు నిరుత్సాహపరడంతో ఇన్వెస్టర్లు షేరు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా షేరు ఇంట్రాడేలో 5శాతం నష్టపోయి రూ.930.00ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని

Most from this category