News


జెట్‌ ఎయిర్‌వేస్‌ 12 శాతం డౌన్‌

Tuesday 14th May 2019
Markets_main1557822569.png-25733

జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లకు నష్టాల కష్టాలు ఇప్పట్లో వీడేలా లేవు. ఈ కంపెనీ షేర్లు మంగళవారం మరో 12శాతం నష్టపోయాయి. కంపెనీ డిప్యూటీ ఛైర్మన్‌, ఛీప్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్‌ అమిత్‌ అగర్వాల్‌ రాజీనామా చేయడం ఇందుకు కారణమైంది. నేడు జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు బీఎస్‌ఈలో రూ.125.55ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. వ్యక్తిగత కారణాలతో కంపెనీకి డిప్యూటీ ఛైర్మన్‌, ఛీప్‌ ఫైనాన్స్‌ ఆఫీసరుగా సేవలు అందిస్తున్న అమిత్‌ అగర్వాల్‌ రాజీనామా చేశారు. మే 13నుంచి అమిత్‌ అమల్లోకి వస్తుందని జెట్‌ ఎయిర్‌ స్టాక్‌ ఎక్చే‍్సంజ్‌లకు సమాచారం ఇచ్చింది. ఫలితంగా నేడు ఇన్వెస్టర్లు షేర్లు అమ్మకానికి మొగ్గుచూపడంతో 12.50శాతం నష్టపోయి రూ. 122.10ల వద్ద ఇంట్రాడే కనిష్టానికి పతనమయ్యాయి. మధ్యాహ్నం గం.1:30ని.లకు షేర్లు గతముగింపు(రూ.139.45)తో పోలిస్తే 8శాతం నష్టంతో రూ.128.10ల వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.121.30  489.90లుగా నమోదయ్యాయి. గత నెల రోజుల కాలంలో నలుగురు కీలక వ్యక్తులు సంస్థను వీడారు.  ఇప్పటికే  ఇండిపెండెంట్‌  డైరెక్టర్‌ రాజశ్రీ పాతీ, అలాగే  మాజీ ఏవియేషన్‌ సెక్రటరీ, కంపెనీ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నసీం జైదీ  రాజీనామా  చేశారు. వీరికితోడు ఇటీవల పూర్తి కాలపు డైరెక్టర్‌  గౌరాంగ్‌ శెట్టి జెట్‌ ఎయిర్‌వేస్‌కు గుడ్‌ బై చెప్పిన సంగతి తెలిసిందే. 



You may be interested

హెచ్‌డీఎఫ్‌సీ షేరును ఏం చేద్దాం?

Tuesday 14th May 2019

బ్రోకరేజ్‌ల సలహాలు క్యు4 ఫలితాల అనంతరం హెచ్‌డీఎఫ్‌సీ షేరుపై బ్రోకరేజ్‌ల అంచనాలు ఇలా ఉన్నాయి. 1. మాక్క్వైరీ: అవుట్‌పెర్ఫామ్‌ రేటింగ్‌. టార్గెట్‌ను రూ. 2400 నుంచి 2350కు తగ్గించింది. కంపెనీ వృద్దిలో కార్పొరేట్‌ రుణాల కారణంగా మందగమనం కనిపించింది. ఆస్తుల నాణ్యత క్షీణించలేదు అందువల్ల అండర్‌రైటింగ్‌ను పట్టించుకోనక్కర్లేదు. నికరవడ్డీ మార్జిన్‌ అంచనాలు తగ్గడంతో ఈపీఎస్‌ అంచనాలు 1- 5 శాతం మేర తగ్గించింది.  2. డాయిష్‌ బ్యాంక్‌: కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ రూ. 2300.

బ్యాంక్‌ నిఫ్టీ అరశాతం అప్‌

Tuesday 14th May 2019

మార్కెట్‌ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నప్పటికీ, ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న బ్యాంక్‌ నిఫ్టీ స్వల్ప లాభంతో ట్రేడ్‌ అవుతోంది. ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌(పీఎస్‌యూ) షేర్ల ర్యాలీ బ్యాంక్‌ నిప్టీ లాభాల ట్రేడింగ్‌కు కారణమవుతోంది. గత ట్రేడింగ్‌లో భారీ పతనమైన పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లలో నేడు రివకరీ బాట పట్టాయి.అలాగే నిన్న మార్కెట్‌ ముగింపు అనంతరం పీఎస్‌యూ బ్యాంక్‌లైన ఆంధ్రా బ్యాంక్‌, యునైటెడ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా, ఓరియంటల్‌ బ్యాంకు

Most from this category