STOCKS

News


880కు రిలయన్స్‌!?

Thursday 30th August 2018
news_main1535616278.png-19799

  • టార్గెట్‌ ప్రైస్‌ తగ్గించిన జెఫెరీస్‌

మీరు చదివింది నిజమే. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ధర రూ.880 ఏంటని ఆలోచిస్తున్నారా? గ్లోబల్‌ బ్రోకరేజ్‌ సంస్థ జెఫెరీస్‌ తాజాగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ టార్గెట్‌ ప్రైస్‌ను రూ.880కి తగ్గించింది. కాగా ప్రస్తుతం ఈ షేరు ధర రూ.1,280 వద్ద ఉంది. బుధవారం ఒకానొక సమయంలో ఏకంగా షేరు ధర రూ.1,329 స్థాయికి పెరిగింది కూడా. దీన్ని జెఫెరీస్‌ టార్గెట్‌ ప్రైస్‌తో పోల్చి చూస్తే దాదాపు 34 శాతం తగ్గుదుల కనిపించనుంది.  
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఈ ఏడాది కాలంలో ఏకంగా రూ.2 లక్షల కోట్లు పెరిగింది. ఇందులో సగభాగం కేవలం గత నెలలోనే ఎగసింది. బలమైన క్యూ1 ఆర్థిక ఫలితాలు, కన్సూమర్‌ సర్వీసెస్‌​బిజినెస్‌లపై వృద్ధి అంచనాలు పటిష్టంగా ఉండటం వంటి అంశాలు ఈ ర్యాలీకి దోహదపడ్డాయి. కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఇటీవలనే రూ.8 లక్షల కోట్ల మైలురాయిని కూడా అధిగమించింది. దీంతో భారత్‌లో అత్యంత విలువైన కంపెనీగా ఖ్యాతి గడించింది. 2018లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు 40.5 శాతంమేర పెరిగాయి. గత ఎనిమిది సెషన్లలో షేరు పెరుగుతూ వచ్చింది. బెంచ్‌మార్క్‌ నిఫ్టీ ఇండెక్స్‌ ర్యాలీని కూడా అధిగమించింది. ఇది ఈ ఏడాదిలో 11 శాతంమేర పెరిగింది. మరోవైపు రిలయన్స్‌ టెలికం విభాగం జియో మంచి పనితీరు కనబరుస్తోంది. రెవెన్యూ మార్కెట్‌ పరంగా చూస్తే ఎయిర్‌టెల్‌ తర్వాత రెండో స్థానంలో ఉంది. ఇటీవలే వొడాఫోన్‌ను వెనక్కు నెట్టింది. ఈ క్యూ1లో 22.4 శాతం వాటాను సొంతం చేసుకుంది. దీంతో రిలయన్స్‌ షేరు ఈపీఎస్‌ పెరగొచ్చు. మరి ఇలాంటప్పుడు జెఫెరీస్‌ ఎందుకు టార్గెట్‌ ప్రైస్‌ను తగ్గించిందో చూద్దాం..

♦ క్యాపిటల్‌ వ్యయాలకు నికర లయబిలిటీలకు పొంతన ఉండాలి. అయితే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ విషయంలో రెండూ పెరుగుతూ వస్తున్నాయి. దీంతో రానున్న కాలంలో సంస్థ వ్యయాలు ఇంకా పెరగొచ్చు. 
♦రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ స్థూల రిఫైనింగ్‌ మార్జిన్లు తగ్గచ్చు. రిఫైనింగ్‌ డిమాండ్‌ సరఫరా తక్కువగా ఉండటం ఇందకు కారణం. గత ఆర్థిక సంవత్సరపు తొలి క్వార్టర్‌లో బ్యారెల్‌కు 11.9 డాలర్లుగా ఉన్న స్థూల రిఫైనింగ్‌ మార్జిన్లు బ్యారెల్‌కు 10.5 డాలర్లకు తగ్గాయి.  
♦మార్కెట్‌ అంచనా వేస్తున్నట్లు కాకుండా టెలికం వ్యాపారంలో ఎగుడుదిగుడులు ఎక్కువగా ఉండొచ్చు.
♦టెలికం మూలధన వ్యయాలు పెరుగుతూనే ఉంటాయి. 
♦ఎక్స్‌ప్లోరేషన్‌, ప్రొడక‌్షన్‌ వ్యయాలు పెరుగుతాయి.  
♦రిటర్న్‌ రేషియో ఒకమోస్తారుగా ఉంటుంది. నికర రుణాలు మాత్రం పెరుగుతాయి.
♦రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వ్యాల్యుయేషన్స్‌ ఎక్కువగా ఉన్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరపు అంచనా ఈవీ/ఈబీటాకు 12.5 రెట్లు వద్ద ఉంది. ఇది గతంతో పోలిస్తే 30-35 శాతం అధిక స్థాయి. అలాగే తన సహచర కంపెనీల కన్నా 30-70 శాతం ఎక్కువ.    


ఆర్‌ఐఎల్‌ షేరు ధర బుధవారం 52 వారాల గరిష్ట స్థాయిలకు చేరుకుంది. దీంతో ప్రాఫిట్‌ బుకింగ్‌ చోటుచేసుకుంది. అందువల్ల బుధవారం కూడా షేరు పడిపోయింది. మరోవైపు గురువారం జెఫెరీస్‌ షేరు టార్గెట్‌ ధర తగ్గించింది. ఈ ప్రతికూలత వల్ల ఆర్‌ఐఎల్‌ షేరు వరుసగా రెండో సెషన్‌లోనూ క్షీణించింది. ఎన్‌ఎస్‌ఈలో మధ్యాహ్నం 12:56 సమయంలో 1.28 శాతం క్షీణతతో 1,277 వద్ద ట్రేడవుతోంది. 


 



You may be interested

నేల చూపులు చూస్తోన్న ఏవియేషన్‌ షేర్లు

Thursday 30th August 2018

ముంబై:- అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఆకాశానికి చేరుకోవడంతో గురువారం ట్రేడింగ్‌లో ఏవియేషన్‌ షేర్లు నేలచూపులు చూస్తున్నాయి. ఇండిగో షేరు:- నేడు బీఎస్‌ఈ ట్రేడింగ్‌లో రూ.970.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 5శాతం నష్టపోయి రూ.921.30ల వద్ద ఇంట్రాడే కనిష్టానికి పతనమైంది. మధ్యాహ్నం గం.1:00లకు షేరు గత ముగింపుధర(రూ.969.55)తో పోలిస్తే 4శాతం నష్టంతో రూ.929ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. గత ట్రేడింగ్‌లో 5.5శాతం నష్టపోయింది. ఇక షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు

రూపీ@70.82

Thursday 30th August 2018

రూపాయి పతనం కొనసాగుతూనే ఉంది. డాలర్‌ మారక విలువతో పోలిస్తే రోజుకో జీవితకాల కనిష్టస్థాయిలకు పతనమవుతున్న రూపాయి విలువ గురువారం ఇంట్రాడేలో మరోకొత్త కనిష్టాన్ని నమోదు చేసింది.  డాలర్‌తో పోలిస్తే రూపాయి గురువారం 70.69 వద్ద ప్రారంభమైంది. అంతర్జాతీయంగా చమురుధరలు పెరగడంతో పాటు​భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 7.93 శాతానికి చేరుకోవడం ఇన్వెస్టర్లు డాలర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా రూపాయి విలువ ఇంట్రాడేలో 70.82 కొత్త కనిష్టస్థాయికి చేరుకుంది. మధ్యాహ్నం

Most from this category