STOCKS

News


జేబీ కెమికల్స్‌ షేర్ల బైబ్యాక్‌ 10 నుంచి

Thursday 4th October 2018
Markets_main1538626586.png-20836

న్యూఢిల్లీ: జేబీ కెమికల్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ కంపెనీ షేర్ల బైబ్యాక్‌ ఈ నెల 10 నుంచి ప్రారంభం కానున్నది. ఈ నెల 24న ముగిసే ఈ బైబ్యాక్‌ ఆఫర్‌ ‍ద్వారా 33.33 లక్షల షేర్లను కొనుగోలు చేస్తామని జేబీ కెమికల్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ తెలిపింది. ఒక్కో షేర్‌ను రూ.390 ధర చొప్పున ఈ షేర్ల బైబ్యాక్‌ విలువ రూ.130 కోట్లని వివరించింది. షేర్ల బైబ్యాక్‌ వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో జేబీ కెమికల్స్‌ అండ్‌ ఫార్మా షేర్‌ ధర 2.4 శాతం లాభంతో రూ.299 వద్ద ముగిసింది. 



You may be interested

సుజుకీ నుంచి 2 అధునాతన బైక్‌లు

Thursday 4th October 2018

న్యూఢిల్లీ: సుజుకీ మోటార్‌ సైకిల్‌ ఇండియా భారత మార్కెట్‌లో రెండు గ్లోబల్‌ ఫ్లాగ్‌షిప్‌ బైక్‌లను విడుదలచేసింది. ఆర్‌ఎం-జెడ్‌ 250 పేరిట విడుదలైన బైక్‌ ధర రూ.7.10 లక్షలు కాగా, ఆర్‌ఎం-జెడ్‌ 450 మోడల్‌ ధర రూ.8.31 లక్షలుగా నిర్ణయించినట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సతోషి ఉచ్ఛిదా మాట్లాడుతూ.. ‘గత కొంత కాలంగా భారత్‌లో ఆఫ్‌-రోడింగ్‌ విభాగానికి చెందిన బైక్‌లకు డిమాండ్‌ గణనీయంగా పెరుగుతోంది. సాహసోపేతమైన రైడింగ్‌

ఆన్‌లైన్‌ రిటైల్‌లో 4 రెట్లు వృద్ధి..!

Thursday 4th October 2018

న్యూఢిల్లీ: సంప్రదాయ రిటైల్‌ నుంచి సామాన్యులు ఆన్‌లైన్‌ బాటా పడుతున్న నేపథ్యంలో ఈ రంగం అంచనాలకు మించి వేగంగా అభివృద్ధి చెందనుందని వెల్లడైంది. చౌక స్మార్ట్‌ఫోన్లు, అందుబాటులో ఉన్న హైస్పీడ్‌ డేటాలు ఈ-కామర్స్‌ రంగాన్ని నూతన శిఖరాలకు చేరుస్తున్నాయని విశ్లేషించిన ప్రముఖ రిలైల్‌ కన్సల్టెంట్ అనరాక్.. 2022 నాటికి ఆన్‌లైన్‌ రిటైల్‌ నాలుగు రెట్లు వృద్ధి చెంది రూ.5,36,440 కోట్ల మార్కెట్‌గా అవతరించనుందని అంచనావేసింది. ప్రస్తుతం ఈ మార్కెట్‌ రూ.1,30,749

Most from this category