STOCKS

News


మిశ్రమంగా ఆసియా మార్కెట్లు..

Saturday 29th September 2018
Markets_main1538200325.png-20688

ఆసియా ప్రధాన సూచీలన్నీ శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. జపాన్‌ నికాయ్‌ 225 ఏకంగా 323 పాయింట్ల లాభంతో 24,120 పాయింట్లకు పెరిగింది. దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 12 పాయింట్ల నష్టంతో 2,343 పాయింట్ల వద్ద ముగిసింది. హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 73 పాయింట్ల లాభంతో 27,788 పాయింట్లకు పెరిగింది. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 21 పాయింట్ల లాభంతో 3,257 పాయింట్లకు ఎగసింది. తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 28 పాయిం‍ట్ల నష్టంతో 11,006 పాయింట్లకు తగ్గింది. చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 30 పాయింట్ల లాభంతో 2,821 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. 
యెన్‌ క్షీణించడం వల్ల జపాన్‌ నికాయ్‌ 225.. శుక్రవారం ఎనిమిది నెలల గరిష్ట స్థాయికి చేరింది. ఇంట్రాడేలో ఒకానొక సమయంలో 24,286 పాయింట్లను కూడా తాకింది. 1991 నవంబర్‌ 15 నుంచి చూస్తే ఇదే గరిష్ట స్థాయి. ఇండెక్స్‌ ఈ వారంలో 1 శాతం, నెలలో 5.5 శాతంమేర లాభపడింది. 
 



You may be interested

బ్యాంకులకు రూ.1,700 కోట్లకు టోపీ

Saturday 29th September 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: టెలికం, నెట్‌వర్కింగ్‌, పవర్‌ కన్వర్షన్ పరికరాల తయారీలో ఉన్న హైదరాబాద్‌ కంపెనీ వీఎంసీ సిస్టమ్స్‌.. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియానికి రూ.1,700 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టింది. పీఎన్‌బీ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) వీఎంసీతో పాటు, కంపెనీ ప్రమోటర్లు ఉప్పలపాటి హిమబిందు, ఉప్పలపాటి వెంకట రామారావు, బి.వెంకట రమణపై కేసు నమోదు చేసింది. వీరిపై నేరపూరిత కుట్ర,

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ దిగువకు

Saturday 29th September 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం స్వల్ప నష్టాలతో ముగిసింది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 3 పాయింట్ల స్వల్ప నష్టంతో 10,956 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,954 పాయింట్లతో పోలిస్తే 2 పాయింట్లు స్వల్ప లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే నిప్టీ సోమవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. కాగా

Most from this category