STOCKS

News


మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 29th January 2019
Markets_main1548732777.png-23857

వివిధ వార్తల‌కు అనుగుణంగా మంగ‌ళ‌వారం ప్రభావితమ‌య్యే షేర్ల వివ‌రాలు
పెర్సిస్టెంట్ సిస్టమ్స్:- రూ.225 కోట్ల బై-బ్యాక్ ఇష్యూకు బోర్డు ఆమోదం తెలిపింది.
ఐఎల్‌&ఎఫ్ఎస్ ట్రాన్స్‌పోర్టేష‌న్స్‌:- ద్రవ్యకొర‌త కార‌ణంగా ఎన్‌సీడీల‌పై డిబెంచ‌ర్ల హోల్డర్లకు చెల్లించాల్సిన వ‌డ్డీని చెల్లించ‌డంలో విఫ‌ల‌మైంది.
నెట్‌వ‌ర్క్ 18 మీడియా అండ్ ఇన్వెస్ట్‌మెంట్‌:- కంపెనీ రూ.1000 కోట్ల రుణ స‌దుపాయాల‌కు ప్రముఖ రేటింగ్ సంస్థ ఇక్రా ఎఎఎ(స్టిరత్వం) రేటింగ్‌ను కేటాయించింది.
న్యూజెన్ సాఫ్ట్‌వేర్ టెక్నాల‌జీస్‌:- ఉత్తర‌ప్రదేశ్‌లో నోయిడాలోని నూతన కార్యాల‌య భ‌వన నిర్మాణానికి 4,067 చ‌ద‌ర‌పు మీట‌ర్ల స్థలాన్ని రూ.50 కోట్లకు కొనుగోలు చేసిన‌ట్లు ఎక్చ్సేంజీల‌కు స‌మాచారం ఇచ్చింది.
హ‌బ్ టౌన్‌:- త‌న అనుబంధ సంస్థ హీట్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో వాటా ఉప‌సంహ‌ర‌ణ‌కు ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఈ ప్రక్రియ‌లో భాగంగా కంపెనీ రూ.100 ముఖ విలువ క‌లిగిన 4,720 ఈక్వీటీ షేర్లను విక్రయించ‌నుంది.
ష‌రోన్ బ‌యో - మెడిసిన్‌:- ప్రివెష‌న్ & కంట్రోల్ ఆఫ్ పొల్యూష‌న్ చ‌ట్టం ఉల్లంఘ‌న‌తో మ‌హారాష్ట్రలోని తాలోజ్ ఏపీఐ ప్లాంట్‌ను మూసివేసి వేశారు.
లోథా డెవెల‌ప‌ర్స్‌:- గ‌డిచిన ఆరునెల‌ల్లో కంపెనీ అమ్మకాలు క్షీణించ‌డంతో పాటు రానున్న రెండు ఆర్థిక సంవ‌త్సరాల్లో కంపెనీ రుణ భారం అధికమ‌వుతుంద‌నే అంచ‌నాల‌తో ప్రముఖ గ్లోబ‌ల్ రేటింగ్ సంస్థ మూడీస్... కంపెనీ రేటింగ్‌ను స‌వ‌రించింది. ప్రస్తుతం కంపెనీపై ఉన్న పాజిటీవ్ రేటింగ్‌ను స్థిర‌త్వంకు ప‌రిమితం చేసింది.
నేడు క్యూ3 ఫ‌లితాలు ప్రక‌టించే కొన్ని ప్రధాన కంపెనీలు:- హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్‌, బ‌జాజ్ ఫైనాన్స్‌, ఓరియంట్ బ్యాంక్ ఆఫ్ కామ‌ర్స్‌, జాన్సస్ కంట్రోల్స్‌, ఎరిస్ లైఫ్ సైన్సెస్‌, హిమాద్రి స్పెషాలిటీస్ కెమిక‌ల్‌, ఇండియాబుల్స్ ఇంటిగ్రేడ్ స‌ర్వీసెస్, ఓర్చిడ్ ఫార్మా, మ‌హాన‌గ‌ర్ గ్యాస్‌, భార‌త్‌ఫైనాన్సియ‌ల్ ఇన్‌క్లూజ‌న్‌, సోరియ‌ల్ ఇన్‌ఫ్రా రీసోర్స్, కింగ్‌ఫా సైన్సెస్, ఇంటెన్స్ టెక్నాలజీస్‌, లాయిడ్ స్టీల్ ఇండ‌స్ట్రీస్‌, టీమ్‌లీజ్ స‌ర్వీసెస్‌, టాటా స్టీల్ బీఎస్ఎల్‌, వెల్‌స్పాన్ ఎంట‌ర్‌ప్రైజెస్‌, డీసీఎం శ్రీరామ్‌, ది రామ్‌కో సిమెంట్స్‌, సుబాక్స్‌, టాటా కాఫీ, రేవ‌తి ఎక్విప్‌మెంట్‌, ఈకేసీ ఇంట‌ర్నేష‌న‌ల్‌, బ‌జాజ్ ఫిన్‌స‌ర్వీసెస్‌, ఎల‌క్ట్రోస్టీల్ కాస్టింగ్స్‌, కేఈఐ ఇండ‌స్ట్రీస్, గోద్రేజ్ క‌న్జూమ‌ర్ ప్రోడెక్ట్స్, ఫెర్టిలైజ‌ర్స్ అండ్  కెమిక‌ల్స్ ట్రావెన్సీ కోర్‌, క‌న్సాయ్ నెరోలాక్ పెయింట్స్‌, రామ్‌కో ఇండ‌స్ట్రీస్‌, ఇన్ఫో ఎడ్జ్‌(ఇండియా), అప్కోటెక్స్ ఇండస్ట్రీస్‌, స్టెరైడ్ ఫార్మా సైన్స్‌, గ్రాన్సూల్స్ ఇండియా.You may be interested

నష్టాలతో ప్రారంభం

Tuesday 29th January 2019

సెన్సెక్స్‌ 75 పాయింట్లు, నిఫ్టీ 25 పాయింట్లు డౌన్‌   అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నడుమ మంగళవారం భారత్‌ సూచీలు నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ప్రారంభ సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 75 పాయింట్లు క్షీణించి 35,580 పాయింట్ల వద్ద, నిఫ్టీ 25 పాయింట్ల నష్టంతో 10,635 పాయింట్ల వద్ద కదులుతున్నాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, బజాజ్‌ ఆటో, గెయిల్‌, యూపీఎల్‌, బీపీసీఎల్‌లు 1-2.5 శాతం మధ్య నష్టంతో ట్రేడవుతుండగా, అల్రా‍్టటెక్‌ సిమెంట్‌, బజాజ్‌

కార్మికులకు కనీస పెన్షన్‌ రూ.2,000?

Monday 28th January 2019

ఉద్యోగుల పెన్షన్‌ స్కీమ్‌ (ఈపీఎస్‌) కింద ఇస్తున్న కనీన పింఛన్‌ను రూ.2,000 చేసే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సభ్యులు ఈపీఎస్‌లో భాగమన్న విషయం తెలిసిందే. కనీసం పదేళ్ల సర్వీసు ఉండి, రిటైర్‌ అయిన కార్మికులకు ఈపీఎఫ్‌వో పరిధిలోని ఈపీఎస్‌ పథకం కింద పెన్షన్‌ అందుతుంది. అత్యున్నత స్థాయిలోని కమిటీ కనీస పెన్షన్‌ పెంపు ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచింది. దీన్ని కేంద్ర ఆర్థిక శాఖ

Most from this category