News


ఐటీసీ ఫలితాల అంచనాలు మిస్‌: షేరు 4శాతం డౌన్‌

Wednesday 23rd January 2019
Markets_main1548237065.png-23758

  • 4శాతం క్షీణించిన షేరు

ఎఫ్‌ఎంసీజీ రంగ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్‌ లాభాల మార్జిన్లు అంచనాల్ని అందుకోలేకపోవడంతో బుధవారం ఈ షేరు 4 శాతంపైగా పతనమయ్యింది. మధ్యాహ్న సమయంలో కంపెనీ ప్రకటించిన మూడో త్రైమాసిక ఫలితాల ప్రకారం కంపెనీ నికర లాభం లాభం స్వల్పంగా 4శాతం పెరిగి రూ.3,209 కోట్లను ఆర్జించింది.  ఇక మొత్తం ఆదాయం 15 పెరిగి రూ.11,128 కోట్లకు చేరింది.  ఇబిటా 11శాతం వృద్ధి చెంది రూ. 4326 కోట్లను సాధించగా, ఇబిటా మార్జిన్లు మాత్రం 39.8శాతం నుంచి 38.5 శాతానికి పరిమితయ్యాయి. అలాగే సిగరెట్ల వ్యాపారపు ఇబిటా 8.8 శాతం వృద్ధిచెందినప్పటికీ, మార్జిన్లు 70.6 శాతం నుంచి 70.1 శాతానికి తగ్గాయి. 
క్యూ3 ఫలితాలు అంచానాలను అందుకోలేకపోవడంతో షేరు ఫలితాల వెల్లడి తర్వాత భారీగా అమ్మకాల ఒత్తిడికి లోనైంది. మధ్యాహ్నం గం.3:15ని.లకు షేరు ఇంట్రాడే కనిష్టం 4శాతం పతనంతో రూ.277ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.251.30 రూ.322.70లుగా నమోదైంది.


ITC

You may be interested

సూచీలకు ఐటీసీ షాక్‌

Wednesday 23rd January 2019

10850దిగువకు నిఫ్టీ 336 పాయింట్ల నష్టపోయిన సెన్సెక్స్‌ సూచీలను నష్టాల్లోకి నెట్టిన ఐటీసీ క్యూ3 ఫలితాలు ఐటీసీ మూడో త్రైమాసిక ఫలితాలు సూచీలకు షాక్‌ ఇచ్చాయి. ఐటీసీ కంపెనీ ఫలితాలు ఈ క్యూ3లో విశ్లేషకుల అంచనాలను అందుకోవడంలో విఫలం కావడం మార్కెట్లో ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తా‍్తయి. ఫలితంగా సూచీలు రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 336.17 పాయింట్ల నష్టంతో 36108 వద్ద, నిఫ్టీ 91.30 పాయింట్ల పతనంతో 10831.50 వద్ద ముగిసింది.  నిఫ్టీ

బడ్జెట్‌ వేళ వీటిపై కన్నేయండి!

Wednesday 23rd January 2019

మరో పదిరోజుల్లో సార్వత్రిక బడ్జెట్‌ పార్లమెంట్‌ ముందుకు రానుంది. బడ్జెట్‌ తరుణంలో వినియోగరంగ స్టాకులపై ఎక్కువ ఫోకస్‌ పెట్టాలని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో పాటు ప్రైవేట్‌బ్యాంకులు, ఇన్‌ఫ్రా, వ్యవసాయ, గ్రామీణ రంగాల షేర్లను కూడా పరిశీలించవచ్చని సూచిస్తున్నారు. బడ్జెట్‌ నేపథ్యంలో బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్న రంగాలు, షేర్లు ఇలా ఉన్నాయి.. - షేర్‌ఖాన్‌: బాటా ఇండియా, బ్రిటానియా, సెంచరీ ప్లైబోర్డ్స్‌, డాబర్‌, ఎస్కార్ట్స్‌, ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌, జీఎన్‌ఏ, హెచ్‌యూఎల్‌, ఐసీఐసీఐ,

Most from this category