STOCKS

News


ఐటీసీ నికరలాభం 12 శాతం అప్‌

Friday 26th October 2018
Markets_main1540548308.png-21498

ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ నికరలాభం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి 12 శాతం పెరిగి రూ. 2,950 కోట్లకు చేరింది. ఆదాయం 7.3 శాతం వృద్ధితో రూ. 11,069 కోట్లకు పెరిగింది. కంపెనీ సిగరెట్ల ఆదాయం 10 శాతంపైగా పెరిగి రూ. 5,060 కోట్లకు చేరింది. కంపెనీ మొత్తం ఆదాయంలో ఈ వ్యాపారం ద్వారా 45 శాతం సమకూరింది. సిగరెట్ల మీద ఇబిటా 8.3 శాతం వృద్ధిచెందిందని, అయితే మార్జిన్లు అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే 10 బేసిస్‌ పాయింట్లు తగ్గినట్లు కంపెనీ తెలిపింది. మొత్తం ఎఫ్‌ఎంసీజీ వ్యాపారపు ఇబిటా 9.8 శాతం పెరగ్గా, దీనికి సంబంధించిన మార్జిన్లు 60 బేసిస్‌పాయింట్లు తగ్గాయి. హోటల్స్, పేపర్, ఆగ్రో తదితర ఇతర వ్యాపారాలతో కలిసి మొత్తం కంపెనీ ఇబిటా 11.8 శాతం వృద్ధితో రూ. 4,200 కోట్లకు చేరగా, మొత్తం మార్జిన్లు 150 బేసిస్‌ పాయింట్ల పెరుగుదలతో 38 శాతానికి చేరింది. మార్కెట్‌  సమయంలో కంపెనీ ఫలితాలు వెల్లడయినంతనే ఈ షేరు 4 శాతం క్షీణతతో రూ. 277 సమీపంలో కనిష్టస్థాయిని నమోదుచేసింది.  చివరకు 2.3 శాతం తగ్గుదలతో రూ.281 వద్ద ముగిసింది.
 



You may be interested

7నెలల కనిష్టానికి నిఫ్టీ

Friday 26th October 2018

ప్రపంచమార్కెట్లో అస్థిరత భారత్‌ మార్కెట్‌ను మరోసారి దెబ్బతీసింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు దిగివచ్చినప్పటికీ, దేశీయంగా డాలర్‌ మారకంలో రూపాయి రీకవర అయినప్పటీకీ మార్కెట్‌ కోలుకోలేకపోయింది.  ఆసియా నుంచి యూరప్‌తో పాటు అమెరికా మార్కెట్‌ ఫ్యూచర్ల నష్టాల ట్రేడింగ్‌తో కారణంగా దేశీయ సూచీలు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా ఎఫ్‌ఎంజీసీ, ఐటీ, బ్యాంకింగ్‌ రంగ షేర్లు అమ్మకాలతో సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ సూచీ 341 పాయింట్లు నష్టపోయి 33,349 వద్ద,

ప్రపంచ మార్కెట్లకు అమెజాన్, గూగుల్‌ దెబ్బ

Friday 26th October 2018

అమెజాన్, అల్ఫాబెట్‌ (గూగుల్‌ మాతృసంస్థ) సెప్టెంబర్‌ క్వార్టర్‌ ఫలితాలు....మార్కెట్‌ అంచనాల్ని అందుకోలేకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం టెక్నాలజీ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఇప్పటికే ప్రధాన ఆసియా మార్కెట్లలో టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌ షేర్లు నష్టాల్లో ముగియగా, యూరప్‌లో గ్యాప్‌డౌన్‌తో మొదలయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల సమయానికి ప్రధాన యూరప్‌ సూచీలు జర్మనీ డాక్స్, ఫ్రాన్స్‌ కాక్, బ్రిటన్‌ ఎఫ్‌టీఎస్‌ఈలు 1.5–2 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. భారత్‌లోని సెన్సెక్స్, నిఫ్టీలు మధ్యాహ్న

Most from this category