STOCKS

News


లాభాల్లో ఐటీ ఇండెక్స్‌

Monday 10th September 2018
Markets_main1536567748.png-20129

  • మిగిలిన ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే..!

ముంబై:- రూపాయి భారీ పతనంతో మిడ్‌ సెషన్‌ సమయానికి మార్కెట్‌ నష్టపోయింది. ఇంట్రాడేలో డాలర్‌ మారకంలో రూపాయి 72.49 వద్ద కొత్త కనిష్ట స్థాయికి క్షీణించింది. ఫలితంగా సెన్సెక్స్‌ 400 పాయింట్ల నష్టపోయి 38 వేల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిఫ్టీ 130 పాయింట్ల నష్టపోయి 11450 వద్ద ట్రేడ్‌ అవుతోంది. రూపాయి దెబ్బకి అన్ని రంగాలకు చెందిన సూచీలు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నప్పటికీ.., ఒక్క ఐటీ ఇండెక్స్‌ మాత్రం స్వల్పంగా లాభాల్లో ట్రేడ్‌ అవుతోంది. ఎగుమతులపై ఆధారపడే ఐటీ షేర్ల లాభం ట్రేడింగ్‌ కారణంగా ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 1శాతం వరకు లాభంతో ట్రేడ్‌ అవుతోంది. ఈ సూచీలోని మొత్తం 10 షేర్లకు గానూ 4 షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా, మరో 6షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఈ సూచీలోని హెచ్‌సీఎల్‌, కేపీఐటీ, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ షేర్లు 2నుంచి అరశాతం వరుకు లాభపడ్డాయి. మరోవైపు టెక్‌మహీంద్రా, టాటాఎలాక్సీ, ఇన్ఫోభీమ్‌, విప్రో, ఓఎఫ్‌ఎస్‌ఎస్‌, మైండ్‌ట్రీ షేర్లు 2నుంచి 1అరశాతం నష్టపోయాయి. మధ్యాహ్నం గం.1:20ని.లకు ఐటీ ఇండెక్స్‌ గతముగింపు 16,105తో పోలిస్తే 0.30శాతం లాభంతో 16,148 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ - 50 సూచీలోని టాప్‌-5 గెయినర్లలో హెచ్‌సీఎల్‌ టెక్‌(2శాతం), ఇన్పోసిస్‌(0.70శాతం) షేర్లు చోటు దక్కించుకున్నాయి.



You may be interested

కొత్త బాస్‌... యాక్సిస్‌ బ్యాంక్‌కు పాజిటివ్‌

Monday 10th September 2018

కొత్త మేనేజ్‌మెంట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌కు అతిపెద్ద పాజిటివ్‌ అంశమని ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌కు చెందిన కూనల్‌ షా పేర్కొన్నారు. ఎర్నింగ్స్‌ మెరుగుదల, రుణ నాణ్యత పనితీరు వంటి అంశాలపై రీరేటింగ్‌ ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. కొత్త సీఈవో (హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఎండీ అమితాబ్‌ చౌదరీ యాక్సిస్‌ బ్యాంక్‌ సీఈవోగా, ఎండీగా రావడం) నియామకం యాక్సిస్‌ బ్యాంక్‌కు సానుకూలమని తెలిపారు.

మార్కెట్‌ పడ్డా.. ఈ షేర్లలో రిటర్న్స్‌కు ఛాన్స్‌!!

Monday 10th September 2018

మార్కెట్లు సోమవారం ఢమాల్‌ అంటున్నాయి. సెన్సెక్స్‌, నిఫ్టీ బాగా పడిపోతున్నాయి. రూపాయి ఆల్‌టైమ్‌ కనిష్ట స్థాయికి పడిపోవడం ఇందుకు కారణం. వాణిజ్య ఉద్రిక్తతలు, క్రూడ్‌ ధరల పెరుగుదల వంటి అంశాలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. రానున్న రోజుల్లోనూ ఇదే ట్రెండ్‌ ఉండొచ్చని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి ఇలాంటి సమయాల్లో ఎలాంటి స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనే ప్రశ్న మదిలో మెదిలో ఉంటుంది. మీ ప్రశ్నకు సమాధానమే ఈ

Most from this category