STOCKS

News


ఐటీ షేర్ల ర్యాలీ..ఇన్ఫోసిస్‌ 3 శాతం జంప్‌

Thursday 31st January 2019
Markets_main1548922468.png-23927

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌....వడ్డీ రేట్ల పెంపునకు బ్రేక్‌ వేసిన ప్రయోజనాన్ని అత్యధికంగా ఐటీ షేర్లు అందిపుచ్చుకున్నాయి. గురువారం ఎన్‌ఎస్‌ఈలోని ఐటీ ఇండెక్స్‌...ఇతర రంగాల సూచీలకంటే అధికంగా 1.5 శాతం పెరిగింది. ఈ సూచీలో భాగమైన ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ 3 శాతంపైగా లాభపడి నెలల గరిష్టస్థాయి రూ. 750 వద్దకు చేరింది. మరో హెవీవెయిట్‌ ఐటీ షేరు టీసీఎస్‌ 1.3 శాతం జంప్‌ చేసింది. టెక్‌ మహింద్రా 2.7 శాతం పెరిగింది. విప్రో, ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌ షేర్లు 1 శాతం వరకూ పెరిగాయి. 



You may be interested

బడ్జెట్‌ కన్నా ఎన్నికలే కీలకం

Thursday 31st January 2019

జేఎం ఫైనాన్షియల్‌ శుక్రవారం ప్రవేశపెట్టే మధ్యంతర బడ్జెట్‌ కన్నా రాబోయే సాధారణ ఎన్నికలే మార్కెట్‌కు కీలకమని జేఎం ఫైనాన్షియల్స్‌ ప్రతినిధి సుహాస్‌ హరినారాయణ్‌ అభిప్రాయపడ్డారు. మధ్యంతర బడ్జెట్లో ప్రభుత్వానికి పెద్ద నిర్ణయాలు తీసుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు. గత బడ్జెట్లో చెప్పిన ఎంఎస్‌పీ ఫార్ములాను ప్రభుత్వం సమర్ధవంతంగా అమలు చేయలేకపోయిందని, ఈ ప్రభావం గతేడాది జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో కనిపించిందని తెలిపారు. అందువల్ల ఈ బడ్జెట్లో ఎక్కువమందిని ఆకర్షించే చర్యలకే ప్రభుత్వం

27000పైకి బ్యాంక్‌ నిఫ్టీ

Thursday 31st January 2019

మార్కెట్లో జోరుగా ట్రేడయ్యే బ్యాంక్‌ నిఫ్టీ....జనవరి డెరివేటివ్స్‌ కాంట్రాక్టులకు చివరిరోజైన గురువారం మధ్యాహ్న సమయానికి 27,000 పాయింట్ల స్థాయిని అధిగమించింది. 26,900 పాయింట్ల సమీపంలో ట్రేడైన ఈ సూచీ హెవీవెయిట్‌ బ్యాంకింగ్‌ షేర్లయిన ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కొటక్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌లు బాసటతో కీలకమైన సాంకేతిక స్థాయి 27,000 పాయింట్లను దాటి మధ్యాహ్నం 1 గంట సమయానికి 27,044 పాయింట్ల వద్దకు చేరింది. బ్యాంక్‌ నిఫ్టీలో భాగమైన

Most from this category