News


రూపాయి జోరు... ఐటీ షేర్ల బేజారు..!

Friday 4th January 2019
Markets_main1546590764.png-23408

డాలర్‌ మారకంలో రూపాయి విలువ జోరుతో శుక్రవారం ఐటీ షేర్లు బేజారెత్తుతున్నాయి. నేడు ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి గతముగింపు(70.17)తో పోలిస్తే 21 పైసలు బలపడి 70 స్థాయికి దిగువున 69.96 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో ముడిచమురు ధరలు పతనం, డాలర్‌ బలహీనత తదితర కారణాలతో నేటి ఉదయం ట్రేడింగ్‌లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 31 పైసలు బలపడింది. రూపాయి ర్యాలీ డాలర్‌ మారకంలో ఆదాయాలను ఆర్జించే ఐటీ షేర్లను నష్టాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ నేటి ఇంట్రాడేలో దాదాపు 2శాతం నష్టపోయింది. ముఖ్యంగా ఐటీ షేర్లలో లార్జ్‌ క్యాప్‌ షేర్లైన టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు 2శాతం పతనం ఇండెక్స్‌ను భారీగా దెబ్బతీసింది. అలాగే మైండ్‌ ట్రీ అత్యధికంగా 3.50శాతం నష్టపోయింది. టాటాఎలాక్సీ 3శాతం, టెక్‌మహీంద్రా 2శాతం, హెచ్‌సీఎల్‌టెక్‌, ఎన్‌ఐఐటీటెక్‌ 1.50శాతం, ఇన్ఫీభీమ్‌ 1శాతం, విప్రో అరశాతం నష్టపోయాయి. అయితే ఓఎఫ్‌ఎస్‌ఎస్‌ షేరు మాత్రం స్వల్పంగా 0.10శాతం లాభపడింది.


TCS

You may be interested

పీఎస్‌యూ బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీ

Friday 4th January 2019

ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు శుక్రవారం లాభాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రాతినిథ్యం వహించే నిప్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ ఇంట్రాడేలో 2శాతం లాభపడింది. బ్యాంకులకు రుణాలను ఇచ్చే సామర్థం తగ్గిపోయిన నేపథ్యంలో క్యాపిటల్‌ అడెక్వసీ నిబంధనలను మరింత సరళతరం చేయాల్సిందిగా గురవారం భారత రిజర్వు బ్యాంక్‌ను పార్లమెంటరీ ప్యానెల్‌ కోరింది. బాసెల్‌ 3 నిబంధనలను మించి క్యాపిటల్‌ అడెక్వసీ నిబంధనలను ఆర్‌బీఐ అమలు చేయడాన్ని కమిటీ ప్రశ్నించింది.

పసిడి @ 1300 డాలర్లు

Friday 4th January 2019

కొత్త ఏడాది అంతర్జాతీయ మార్కెట్లో శుక్రవారం పసిడి ధర తొలిసారి 1300 డాలర్లను తాకింది. ఆసియాలో ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 5.55డాలర్లు పెరిగి 1,300.35 డాలర్ల గరిష్టాన్ని తాకింది. యెన్‌ మారకంలో డాలర్‌ బలహీనత, ఆర్థిక ఆర్థికాభివృద్ధి మందగమనంతో ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న అమ్మకాల ఒత్తిడి, బాండ్‌ ఈల్డ్‌ పతనం, ఫెడ్‌ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలు పసిడి ర్యాలీకి తోడ్పాటును అందించాయి. ఉదయం గం:10:45ని.లకు ఆసియాలో ట్రేడింగ్‌లో ఔన్స్‌

Most from this category