STOCKS

News


ఎదురీదుతున్న ఐటీ షేర్లు

Tuesday 4th December 2018
Markets_main1543914119.png-22617

మార్కెట్‌ నష్టాలకు ఐటీ షేర్లు ఎదురీదుతున్నాయి. డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత అందుకు సహకరిస్తుంది. రెండురోజులుగా ముడిచమురు ధరలు ర్యాలీ చేయడం, ప్రధాన కరెన్సీల్లో డాలర్‌ బలపడటం తదితర కారణాలతో దేశీయ ఫారెక్స్‌ రూపాయి క్షీణిస్తున్న సంగతి తెలిసిందే. రూపాయి కరిగిపోవడంతో డాలర్ల రూపంలో ఆదాయాలను ఆర్జించే ఐటీ కంపెనీలకు కలిసొస్తుంది. అందుకు అనుగుణంగానే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 2శాతం ర్యాలీ చేసింది. నేడు ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ఇండెక్స్‌ నేడు 14,757.45 వద్ద ప్రారంభమైంది. రూపాయి క్షీణత కారణంగా నేడు ఇన్వెస్టర్లు ఈరంగ షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపారు. మధ్యాహ్నం గం.1:45ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(14740.40)తో పోలిస్తే 1.75శాతం లాభపడి 14,995.95 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయనికి ఈ సూచీలో భాగమైన మొత్తం 10 షేర్లలో 9 షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా, ఒక్క మైండ్‌ ట్రీ షేరు​1శాతం నష్టంతో ట్రేడ్‌ అవుతోంది. ఇన్ఫీభీమ్‌ అత్యధికంగా 7శాతం లాభపడింది. ఓఎఫ్‌ఎస్‌ఎస్‌ 3శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, విప్రో షేర్లు 2శాతం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అలాగే ఎన్‌ఐఐటీ, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, టాటా ఎలాక్సీ షేర్లు 1శాతం లాభపడ్డాయి.



You may be interested

మిశ్రమంగా రియల్టీ షేర్లు

Tuesday 4th December 2018

మార్కెట్‌ నష్టాల ట్రేడింగ్‌లో భాగంగా బుధవారం రియల్టీరంగ షేర్లు మిశ్రమంగా ర్యాలీ అవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో రియల్టీరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ 1శాతానికి పైగా నష్టపోయింది. ముఖ్యంగా ఈ ఇండెక్స్‌లోని ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌, ఓబేరాయ్‌ రియల్టీ, గోద్రేజ్‌ ప్రాపర్టీ, ఇండియాబుల్స్‌ రియల్‌ఎస్టేట్‌ షేర్ల పతనం ఇండెక్స్‌పై ఒత్తిడిని పెంచుతున్నాయి. మధ్యాహ్నం గం.2:45.ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు (237.60)తో పోలిస్తే 0.85శాతం నష్టంతో 235.55 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

డిసెంబర్‌లో మార్కెట్‌పై పట్టు ఎవరిది..?

Tuesday 4th December 2018

ముంబై: గతనెలలో ప్రధాన సూచీలు 5 శాతానికి మించి లాభాలను నమోదుచేశాయి. సెన్సెక్స్‌ 36,000 పాయింట్లను అధిగమించగా.. నిఫ్టీ 11,000 మార్కుకు సమీపించింది. ఇక నెలలో మార్కెట్‌ ట్రెండ్‌ ఏ విధంగా ఉంటుందనే అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా డిసెంబర్‌ నెలలో మార్కెట్‌ బుల్స్‌ పట్టులోనే ఉంటుందనేది గడిచిన 10 ఏళ్లలో మార్కెట్‌ నడిచిన తీరును చూస్తుంటే అర్థమవుతోందని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు చెబుతున్నాయి. 2008 నుంచి గడిచిన

Most from this category