News


ఐటీ షేర్లకు ఇన్ఫోసిస్‌ ఫలితాల జోష్‌

Wednesday 17th October 2018
Markets_main1539756400.png-21236

ముంబై:- ఐటీ దిగ్గజ కంపెనీలైన టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ల క్యూ2 ఫలితాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించడంతో బుధవారం ఐటీ షేర్లు లాభాల బాట పట్టాయి.  ఎన్‌ఎస్‌ఈలో ఐటీ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ ఉదయం ట్రేడింగ్‌లో 2శాతం లాభపడింది. ఉదయం గం.11:00లకు నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 1శాతం లాభంతో 15,025.70 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇన్ఫోసిస్‌ నిన్న ప్రకటించిన క్యూ2 ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉండటంతో ఈ షేరు కౌంటర్‌లో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. ఐటీ షేర్లలో టీసీఎస్‌ తరువాత అధిక వెయిటేజీ కలిగిన ఈ షేరు ఇంట్రాడేలో 2శాతం లాభపడింది. మరో ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్‌ 3శాతం ర్యాలీ కూడా నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ ర్యాలీకి దోహదపడింది. వాటితో పాటు విప్రో, టెక్‌ మహీంద్రా 1శాతం లాభపడ్డాయి. మరోవైపు ఇన్ఫీభీమ్‌ 3శాతం నష్టపోయింది. టాటా ఎలాక్సీ 2శాతం, మైండ్‌ ట్రీ 1శాతం, ఎన్‌ఐఐటీటెక్‌ అరశాతం నష్టపోయాయి. టీసీఎస్‌ షేరు సైతం 0.10శాతం నష్టపోయింది. డాలర్‌ మారకంలో రూపాయి రెండువారాల గరిష్టానికి చేరున్నప్పటికీ.., ఐటీ షేర్లు ర్యాలీ చేయడం విశేషం. ఇదే సమయానికి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ-50 సూచీలో టాప్‌ -5 గెయినర్లలో హెచ్‌సీఎల్‌ 3శాతం లాభంతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఇన్ఫోసిస్‌ 2శాతం లాభంతో మూడోస్థానాన్ని చోటు దక్కించుకుంది.


IT

You may be interested

మార్కెట్‌ రివర్స్‌.. నష్టాల్లో నిఫ్టీ

Wednesday 17th October 2018

అమెరికా మార్కెట్లు మంగళవారం 2 శాతానికి పైగా ర్యాలీ చేయడం, ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతుండటం, రూపాయి బలపడటం వంటి పలు సానుకూల అంశాల కారణంగా గ్యాప్‌అప్‌తో ప్రారంభమైన ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ తర్వాత ఆ లాభాలన్నింటికీ కోల్పోయింది. నిఫ్టీ ఇండెక్స్‌ నష్టాల్లోకి జారుకుంటే, సెన్సెక్స్‌ కూడా అదే దారిలో పయనిస్తోంది. ఉదయం 11:46 సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్‌ 28 పాయింట్ల లాభంతో 35,190 వద్ద, నిఫ్టీ 15 పాయింట్ల

ఇన్ఫీ షేరును ఏం చేద్దాం?

Wednesday 17th October 2018

దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ క్యు2లో అంచనాలకు అనుగుణంగా ఫలితాలు ప్రకటించింది. దీంతో పలు బ్రోకరేజ్‌లు ఇన్ఫీ షేరు టార్గెట్‌ను అప్‌గ్రేడ్‌ చేశాయి. క్యు2లో ఇన్ఫీ నికరలాభం 13.8 శాతం పెరుగుదలను, రెవెన్యూ 7.7 శాతం వృద్దిని నమోదు చేశాయి. అయితే పెట్టుబడులు పెరగడం, వ్యయాల కారణంగా మార్జిన్లు మాత్రం అంచనాల కన్నా కాస్త తక్కువగా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫీపై వివిధ బ్రోకరేజ్‌ల అంచనాలు ఇలా ఉన్నాయి.. - బోఫా

Most from this category