STOCKS

News


నష్టాల్లో ఐటీ షేర్లు

Thursday 1st November 2018
Markets_main1541055910.png-21635

కిందటి రోజు ట్రేడింగ్‌లో సూచీల భారీ లాభాలకు కారణమైన ఐటీ షేర్లు గురువారం ట్రేడింగ్‌ సెషన్‌లో మాత్రం నష్టాల బాట పట్టాయి. ఐటీ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ నేటి ఉదయం ట్రేడింగ్‌ సెషన్స్‌లో 2.50శాతం శాతం నష్టపోయింది. డాలర్ మారకంలో రూపాయి బలపడటంతో ఐటీ షేర్లలో అమ్మకాలు పెరిగాయి. మధ్యాహ్నం గం.12:00లకు నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 2శాతం నష్టంతో 14,597 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి సూచీలో హెచ్‌సీఎల్‌ టెక్‌ షేరు అత్యధికంగా 4శాతం నష్టపోయింది. టెక్‌మహీంద్రా 3శాతం, ఇన్ఫోసిస్‌ 2.50శాతం, మైండ్‌ ట్రీ,  ఓఎఫ్‌ఎస్‌ఎస్‌ 2శాతం, విప్రో, టీసీఎస్‌ 1శాతం, ఎన్‌ఐఐటీ టెక్‌ సూచీ అరశాతం నష్టపోయాయి. మరోవైపు టాటా ఎలాక్సీ 3శాతం, ఇన్ఫీభీమ్‌ షేరు 1.50శాతం లాభపడ్డాయి. ఇదే సమయానికి హెచ్‌సీఎల్‌, టెక్‌మహీంద్రా, ఇన్ఫోసిస్‌ షేర్లు నిఫ్టీ-50 సూచీలోని టాప్‌-5 లూజర్లలో మొదటి మూడు స్థానాల్లో చోటు దక్కించుకోవడం గమనార్హం.



You may be interested

రాణిస్తున్న రియల్టీ రంగ షేర్లు

Thursday 1st November 2018

ఆరంభలాభాలను కోల్పోయి సూచీలు మిడ్‌సెషన్‌ సమయానికి నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అయితే రియల్టీరంగ షేర్లు మాత్రం మార్కెట్‌ దృక్పథానికి విభిన్నంగా స్పందిస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలోని కీలక సూచీలన్నీంటిలోకి నిఫ్టీ రియల్టీ సూచీ నేటి ట్రేడింగ్‌లో అత్యధికంగా 3శాతం లాభపడింది. మధ్యాహ్నం గం.12:30లకు ఇండెక్స్‌ గతముగింపు(214.90)తో పోలిస్తే 2శాతం లాభంతో 219ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ సూచీలో భాగమైన 10షేర్లకు గానూ మొత్తం షేర్లన్నీ లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.

మిస్త్రీని తొలగించడంలో నిబంధనల ఉల్లంఘన

Thursday 1st November 2018

సమాచార హక్కు కింద ఆర్‌వోసీ సమాధానం ముంబై: టాటా సన్స్‌, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌) చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని అర్ధంతరంగా తొలగించడంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్‌వోసీ) ముంబై విభాగం స్పష్టం చేసింది. కంపెనీల చట్టం, రిజర్వ్ బ్యాంక్ నిబంధనలతో పాటు టాటా సన్స్‌ స్వంత ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ నిబంధనలను కూడా ఉల్లంఘించినట్లు పేర్కొంది. షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌కి చెందిన ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు

Most from this category