STOCKS

News


రూపీ ర్యాలీ : ఐటీ డీలా..!

Tuesday 20th November 2018
Markets_main1542706067.png-22227

ముంబై:- డాలర్‌ మారకంలో రూపాయి ర్యాలీ మంగళవారం ఐటీ షేర్లకు కలిసొచ్చింది. నేటి ట్రేడింగ్‌లో రూపాయి గత ముగింపు(71.65)తో పోలిస్తే 37 పైసలు లాభపడి 71.28 స్థాయి వద్ద కనిష్టానికి చేరుకుంది. దేశీయ ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి వరుసగా ఆరోరోజూ లాభాల్లో ట్రేడవ్వడం విశేషం. దేశీయంగా రూపాయి బలపడుతుండటం డాలర్‌ మారకంలో ఆదాయాలను ఆర్జించే ఐటీ, ఫార్మా షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ ఇంట్రాడేలో 2శాతానికి పైగా నష్టపోయింది. మధ్యాహ్నం గం.2:45ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(14599.75)తో పోలిస్తే -1.95శాతం నష్టంతో 14,314.35 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి సూచీలో సూచీలో భాగమైన మొత్తం 10 షేర్లలో 9 షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండగా, ఒక్క షేరు మాత్రం లాభాల్లో ట్రేడ్‌ అవుతోంది. అత్యధికంగా విప్రో 3.50శాతం నష్టపోయింది. టెక్‌మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌ 3శాతం క్షీణించాయి. ఇన్ఫీభీమ్‌, ఎన్‌ఐఐటీ టెక్‌ 2శాతం, ఇన్ఫోసిస్‌, మైండ్‌ ట్రీ, ఓఎఫ్‌ఎస్‌ఎస్‌ షేర్లు 1.50శాతం పతనమయ్యాయి. టీసీఎస్‌ షేరు 1శాతం నష్టపోయింది. సూచీలో టాటా ఎలాక్సీ మాత్రం 1శాతం లాభంతో ట్రేడ్‌ అవుతోంది. విప్రో షేరు 3.50శాతం నిఫ్టీ - 50 సూచీలో టాప్‌-5 లూజర్లలో  నాలుగో స్థానంలో ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

దీర్ఘకాల పెట్టుబడికి ఐదు షేర్లు

Tuesday 20th November 2018

బ్రెగ్జిట్ సంబంధిత అంశాలు, ఇటలీ బడ్జెట్‌ ప్రణాళిక, ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ ఆర్థిక సంక్షోభం, ద్రవ్య లభ్యత సమస్య, సాధారణ ఎన్నికల వంటి కీలక పరిణామాలు ఈ ఏడాది ద్వితియార్థంలో మార్కెట్‌పై ప్రభావం చూపనున్నాయని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ ఎండీ, సీఈఓ అరుణ్‌ తుక్రాల్‌ వ్యాఖ్యానించారు. మార్కెట్‌ దిద్దుబాటు సమయంలో చౌకగా లభిస్తున్న షేర్లను కొనుగోలు చేయడం ద్వారా ఆకర్షణీయ లాభాలను గడించవచ్చని సూచిస్తున్న ఈయన దీర్ఘకాల పెట్టుబడులకు పంచకల్యాణి లాంటి

యస్‌ బ్యాంక్‌ మళ్లీ డౌన్‌

Tuesday 20th November 2018

న్యూఢిల్లీ:- యస్‌ బ్యాంకు షేర్ల లాభాలు ఒక్కరోజే పరిమితం అయ్యాయి. బోర్డు నుంచి మరో సభ్యుడి నిష్క్రమణతో మంగళవారం ఆ బ్యాంకు షేర్లు మళ్లీ నష్టాల బాట పట్టాయి. రాణా కపూర్‌ వారసడి వెతికే ప్రక్రియను బోర్డు వేగవంతం చేసిందనే వార్తల నేపథ్యంలో సోమవారం 7శాతం లాభపడిన సంగతి తెలిసిందే.  వ్యక్తిగత కారణాలతో స్వతంత్ర్య డైరెక్టర్‌ రెంటాల చంద్రశేఖర్‌ సోమవారం రాజీనామా చేసినట్లు సంస్థ స్టాక్‌ ఎక్చే‍్సంజ్‌లకు తెలిపింది. నాన్‌

Most from this category