STOCKS

News


ఐటీ షేర్లు జంప్‌

Thursday 27th December 2018
Markets_main1545887949.png-23260

కలిసొచ్చిన రూపాయి పతనం
డాలర్‌ మారకంలో రూపాయి విలువ తగ్గముఖం పట్టడంతో గురువారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఐటీ షేర్లు మార్కెట్‌ ర్యాలీకి దున్నుగా నిలిచిస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌లో 2శాతానికి లాభపడింది. అంతర్జాతీయ మార్కెట్లో నిన్న రాత్రి అమెరికా మార్కెట్లో ముడిచమురు ధరల 5శాతం రిలీఫ్‌ ర్యాలీ, డాలర్‌ ఇండెక్స్‌ 4 నెలల కనిష్టం నుంచి కోలుకోవడం తదితర కారణాలతో నేటి ఇంట్రాడేలో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 23 పైసలు బలహీనపడింది. రూపాయి తగ్గుదలతో డాలర్‌ మారకంలో ఆదాయాలను ఆర్జించే ఐటీ కంపెనీలకు కలిసొచ్చింది. ఫలితంగా ఐటీ కంపెనీ షేర్లు భారీగా లాభపడి నేటి మార్కెట్‌ ర్యాలీని ముందుండి నడిపిస్తున్నాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 2.50 శాతం లాభపడి 14,455.30 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. ఉదయం గం.10:20లకు ఇండెక్స్‌ గత ముగింపు(14,158.90)తో పోలిస్తే 2శాతం లాభపడి 14,453.80 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇండెక్స్‌లో టాటా ఎలాక్సీ షేరు అత్యధికంగా 2.60శాతం లాభపడింది. టెక్‌ మహీంద్రా, ఎన్‌ఐఐటీ టెక్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, మైంట్‌ ట్రీ షేర్లు 2శాతం ర్యాలీ చేశాయి. అలాగే హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫీభీమ్‌, విప్రో, ఓఎఫ్‌ఎస్‌ఎస్‌ షేర్లు 1నుంచి అరశాతం లాభపడ్డాయి. ఇదే సమయానికి ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌ షేర్లు నిఫ్టీ-50 సూచీలో టాప్‌-5 గెయిన్లరలో మొదటి మూడు స్థానాల్లో ట్రేడ్‌ అవుతుండటం విశేషం.You may be interested

వెలుగులో మెటల్‌ షేర్లు

Thursday 27th December 2018

మార్కెట్‌ లాభాల ట్రేడింగ్‌లో భాగంగా గురువారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో మెటల్‌ షేర్లు వెలుగులోకి వచ్చాయి. హిందాల్కో, వేదాంత షేర్లు 2శాతం ర్యాలీ మెటల్‌ షేర్లకు కలిసొచ్చింది. ఎన్‌ఎస్‌ఈలోని మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌లో దాదాపు 1శాతం లాభపడింది. ఉదయం గం.11:00లకు ఇండెక్స్‌ అరశాతం లాభంతో 31113 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లోని మొత్తం 15 షేర్లకు గానూ, 12

స్థిరంగా పసిడి ధర

Thursday 27th December 2018

ప్రపంచమార్కెట్లో గురువారం పసిడి ధర 1270డాలర్ల వద్ద స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. అమెరికాలో నెలకొన్న రాజకీయ అస్థితర, అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి మందగమన ఆందోళనలు పసిడి ర్యాలీకి మద్దతనిస్తున్నాయి. నేడు ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 2.50డాలర్లు పెరిగి 1,272.30 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. గతరాత్రి అమెరికా మార్కెట్లో ఈక్విటీ షేర్లతో పాటు ట్రెజరీ బాండ్‌ ఈల్డ్‌‍్స పెరగడంతో డాలర్‌ ఇండెక్స్‌ 4నెలల కనిష్టం నుంచి కోలుకోవడంతో

Most from this category