STOCKS

News


ఐటీ షేర్ల ర్యాలీ

Wednesday 6th February 2019
Markets_main1549434842.png-24047

డాలర్‌ మారకంలో రూపాయి బలపడుతున్నప్పటికీ.., ఐటీ షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ బుధవారం ఉదయం ట్రేడింగ్‌లో 2శాతం లాభపడింది.  ఉదయం గం.11.30ని.లకు నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 1.56 శాతం పెరిగి 15,989.50 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ రంగానికి చెందిన టెక్‌ మహీంద్రా షేరు 6శాతం లాభపడింది. ఈ క్యూ3లో కంపెనీ ఆశాజనకమైన ఫలితాల ప్రకటన ఇందుకు నేపథ్యం. అలాగే హెవీవెయిట్‌ షేర్లైన టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ 1శాతం ర్యాలీ చేశాయి. మైండ్‌ ట్రీ, ఇన్ఫీభీమ్‌ షేర్లు 2శాతం లాభపడ్డాయి. హెచ్‌సీఎల్‌, ఓఎఫ్‌ఎస్‌ఎస్‌ షేర్లు 1శాతం ర్యాలీ చేయగా, ఎన్‌ఐఐటీటెక్‌, టాటా ఎలాక్సీ షేర్లు అరశాతం పెరిగాయి.

ఐటీ షేర్ల ర్యాలీ అండతో బుధవారం ఉదయం ట్రేడింగ్‌లో ప్రధాన సూచీలు స్థిరమైన లాభాలను ఆర్జిస్తున్నాయి. ఉదయం గం.11.50ని.లకు నిఫ్టీ ఇండెక్స్‌ 75 పాయింట్లు పెరిగి 11వేల పైన 11,010 వద్ద ట్రేడ్‌ అవుతోంది. సెన్సెక్స్‌ 221 పాయింట్ల లాభంతో 36,838.26 వద్ద ట్రేడ్‌ అవుతోంది.You may be interested

మూడోరోజూ కొనసాగుతున్న అడాగ్‌ షేర్ల పతనం

Wednesday 6th February 2019

అనిల్‌ అంబానీ గ్రూప్‌ అడాగ్‌ షేర్ల పతనం ఆగట్లేదు. దివాళా పరిష్కారానికి ఎన్‌సీఎటీకి వెళ్లనున్న నేపథ్యంలో ఈ కంపెనీ షేర్లు వరుసగా మూడో రోజూ నష్టాల బాట పట్టాయి. ఇంట్రాడేలో రిలయన్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌, రిలయన్స్‌ పవర్‌, రిలయన్స్‌ హోమ్స్‌, రిలయన్స్‌ నావెల్‌ ఇంజనీరింగ్స్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌, రిలయన్స్‌ నిప్పాన్‌ లైవ్‌ షేర్లు 28శాతం నుంచి 11శాతం క్షీణించాయి. అయితే ఇదే అడాగ్‌ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్‌ పవర్‌

కార్పోరేట్‌ భ్రీఫ్‌

Wednesday 6th February 2019

బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్డీ రేట్ల పెంపు   న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా తాజాగా రుణాలపై వడ్డీ రేట్లను 0.2 శాతం దాకా పెంచింది. దీంతో గృహ, వాహన, ఇతర రుణాలు మరింత భారం కానున్నాయి. సవరించిన రేట్లు (ఎంసీఎల్‌ఆర్‌) గురువారం నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంక్ తెలిపింది. మూడు నెలల వ్యవధికి ఎ౾ంసీఎల్‌ఆర్‌ 8.30 శాతం నుంచి 8.50 శాతానికి, ఆరు నెలల వ్యవధికి 8.5

Most from this category