News


ఐటీ షేర్లకు రూపీ పోటు

Tuesday 18th December 2018
Markets_main1545117513.png-23044

డాలర్ల రూపంలో ఆదాయాలను ఆర్జించే ఐటీ షేర్లకు మంగళవారం రూపీ పోటు తగిలింది. ఎన్‌ఎస్‌ఈ ఎక్చ్సేంజ్‌లో అధిక వెయిటేజీ కలిగిన నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ నేడు 1.50శాతం నష్టపోయింది. డాలర్‌ మారకంలో రూపాయి రికవరి ఇందుకు కారణమైంది. ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ రేట్ల సమావేశ నిర్ణయాల వెల్లడి నేపథ్యంలో డాలర్‌ బలహీన ట్రేడింగ్‌ దేశీయ రూపాయికి కలిసొస్తుంది. ఫలితంగా ఫారెక్స్‌ ట్రేడింగ్‌లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 71.16స్థాయిని బలపడింది. మరోవైపు రూపాయి ర్యాలీ కారణంగా ఐటీ నష్టాల బాట పట్టాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 1.50శాతం నష్టపోయింది. ఇండెక్స్‌లో అత్యధికంగా ఇన్ఫోసిస్‌ 2శాతం నష్టపోయింది. మైండ్‌ టీ, ఎన్‌ఐఐటీటెక్‌, టెక్‌మహీంద్రా షేర్లు సైతం 2శాతం క్షీణించాయి. టాటా ఎలాక్సీ, టీవీఎస్‌, విప్రో షేర్లు 1నుంచి అరశాతం పతనమయ్యాయి. మరోవైపు ఇన్ఫీభీమ్‌ 2.50శాతం లాభపడగా, ఓఎఫ్‌ఎస్‌ఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు అరశాతం పెరిగాయి. మద్యాహ్నం గం.12:15ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(14,873.05)తో పోలిస్తే 1శాతం నష్టంతో 14,715.15 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఎన్‌ఎస్‌ఈలో ఇన్ఫోసిస్‌, టెక్‌మహీంద్రా షేర్లు 2శాతం నష్టపోయి నిఫ్టీ-50 ఇండెక్స్‌లో టాప్‌-5 లూజర్ల స్థానంలో చోటు దక్కించుకున్నాయి.You may be interested

రూ.1కే బంగారం!!

Tuesday 18th December 2018

బంగారంపై భారతీయులకు మక్కువ ఎక్కువే. గ్రాము బంగారం ధర ప్రస్తుతం దాదాపు రూ.3,200 ఉంది. ఏదైనా జువెలరీ ఔట్‌లెట్‌కు వెళ్లి బంగారం కొనుగోలు చేయాలంటే కనీసం రూ.3,200 వెచ్చించాలి. జువెలరీ షాపులలో గ్రాము కన్నా తక్కువ పరిమాణంలో బంగారాన్ని కొనుగోలు చేయడం వీలుపడకపోవచ్చు. అందువల్ల ఒకేసారి రూ.3 వేలకు పైగా పెట్టి బంగారం కొనుగోలు చేయాలంటే అందరికీ సాధ్య పడకపోవచ్చు. అయితే ఇప్పుడు ఆన్‌లైన్‌లో బంగారం కొనుగోలు అందుబాటులోకి వచ్చింది.

వీఆర్‌ఎల్‌ లాజిస్టిక్స్‌పై కోటక్‌ బుల్లిష్‌

Tuesday 18th December 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ కోటక్‌ సెక్యూరిటీస్‌ తాజాగా వీఆర్‌ఎల్‌ లాజిస్టిక్స్‌పై పాజిటివ్‌గా ఉంది. ఎందుకో చూద్దాం..  బ్రోకరేజ్‌: కోటక్‌ సెక్యూరిటీస్‌ స్టాక్‌: వీఆర్‌ఎల్‌ లాజిస్టిక్స్‌ రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.282 టార్గెట్‌ ప్రైస్‌: రూ.355 కోటక్‌ సెక్యూరిటీస్‌.. వీఆర్‌ఎల్‌ లాజిస్టిక్స్‌పై సానుకూలంగా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.355గా నిర్ణయించింది. ట్రకింగ్‌ విభాగంలో బలమైన పనితీరు, దేశ వ్యాప్తంగా జీఎస్‌టీ అమలు, సానుకూల నిబంధనలు, దేశీ వ్యాపారం మెరుగుదల, డీజిల్‌ ధరల

Most from this category