STOCKS

News


మూహూరత్‌ ట్రేడింగ్‌ ప్రారంభం అదిరింది.

Wednesday 7th November 2018
Markets_main1541593004.png-21776

 ముంబై:- భారత్‌ స్టాక్‌ మార్కెట్‌ దీపావళి ప్రత్యేక ముహూరత్‌ ట్రేడింగ్‌ అదిరిపోయేలా ప్రారంభమైంది. మార్కెట్‌ వర్గాల అంచనాలకు అనుగుణంగా అమెరికాలో దిగువసభ మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ విజయం ఖరారు కావడంతో ప్రపంచమార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొంది. సంవత్‌ 2075 ప్రారంభపు రోజైన దీపావళినాడు జరిగిన ముహూరత్‌ ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు.  యూరప్‌ మార్కెట్లతో పాటు అమెరికా ఫ్యూచర్లు భారీ లాభాల్లో ట్రేడ్‌ అవుతుండటం కూడా ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చింది. ఫలితంగా బీఎస్‌ఈ సెన్సెక్స్‌ గత ముగింపు(34,991)తో పోలిస్తే 312 పాయింట్ల లాభంతో 35,301.88 వద్ద, నిఫ్టీ సూచీ 10600 పాయింట్ల పై ప్రారంభమైంది. సాయంత్రం 5:30ని.లకు ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 276 పాయింట్ల లాభంతో 35268 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిప్టీ 72 పాయింట్ల లాభంతో 10602వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలకు చెందిన సూచీలు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 1శాతానికి పైగా లాభపడింది.
నిఫ్టీ -50 సూచీలో యస్‌ బ్యాంక్‌, వేదాంత, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌ షేర్లు టాప్‌ గెయినర్లగా ట్రేడ్‌ అవుతున్నాయి.  ఏ ఒక్క షేరు నష్టాల్లో లేకపోవడం విశేషం.

గంట ట్రేడింగ్‌:-

దేశీయ స్టాక్‌మార్కెట్లు దీపావళి పర్వదినం లక్ష్మీపూజ సందర్భంగా నేడు ప్రత్యేక ముహూరత్‌ ట్రేడింగ్‌ పేరుతో  ఒక​ గంటపాటు స్పెషల్‌ ట్రేడింగ్‌ ఉంటుంది. ఈ క్రమంలోనే సాయంత్రం 5.30-6.30 మధ్య బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ ప్రత్యేక ట్రేడింగ్‌ను నిర్వహిస్తారు.  దీనికి ముందు 5.15లకు 15నిమిషాలపాటు ప్రీ  ఓపెనింగ్‌ మార్కెట్‌సెషన్‌ కూడా ఉంటుంది. దీంతో సంవత్‌ 2075 ప్రారంభమవుతుంది. ట్రేడింగ్‌లో భాగంగా బ్లాక్‌డీల్స్‌, ఫ్రీ సెషన్‌, పోస్ట్‌ సెషన్‌తో కలిపి సాయంత్రం 5.15 నుంచి 6.50 వరకూ ట్రేడింగ్‌ ఉంటుందని స్టాక్‌ ఎక్స్ఛేంజీ ఒక ప్రకటనలో తెలిపింది.



You may be interested

లాభాలతో ముగిసిన ముహూరత్‌ ట్రేడింగ్‌

Wednesday 7th November 2018

సంవత్‌ 2075 ప్రారంభపు రోజు జరిగిన ముహూరత్ ట్రేడింగ్‌లో భారత్‌ స్టాక్ మార్కెట్‌ భారీ లాభంతో ముగిసింది. దీపావళి పండుగ సందర్భంగా గంటపాటు జరిగిన  ఈ ట్రేడింగ్‌లో కొనుగోళ్లు జరిగాయి. ప్రపంచమార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో నేడు సూచీలు భారీ లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సెన్సెక్స్‌ 312 పాయింట్ల లాభంతో 35,302 వద్ద, నిఫ్టీ 84 పాయింట్ల లాభంతో 10600 పైన 10,614.45 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇంట్రాడేలో అటో, ఎఫ్‌ఎంసీజీ,

భారీ లాభాలతో ప్రారంభమైన యూరప్‌ మార్కెట్లు

Wednesday 7th November 2018

యూరప్‌ మార్కెట్ల ప్రారంభ సమయానికి అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమెక్రటిక్‌ పార్టీ సంపూర్ణ విజయం ఖరారు కావడం యూరప్‌ మార్కెట్లకు ఉత్సాహానిచ్చింది. బ్రిటన్‌ చెందిన ఎఫ్‌టీఎస్‌ఈ100 సూచీ 1శాతం లాభంతో 7,113 పాయింట్ల వద్ద, జర్మనీ డాక్స్‌ 1శాతం పెరిగి 11,598 వద్ద, ఫ్రాన్స్‌కు చెందిన సీఎసీ40 సూచీ 1.1శాతం ర్యాలీ 5,131 వద్ద ట్రేడింగ్‌ అవుతున్నాయి. ‘‘మార్కెట్‌ వర్గాలు ఊహించిన విధంగానే అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అక్టోబర్‌లో

Most from this category