ఐటీ, ఫార్మా షేర్ల జోరు
By Sakshi

ముంబై:- డాలరు మారకంలో రూపాయి విలువ జీవితకాల కనిష్టానికి పతనం కావడంతో సోమవారం ఐటీ, ఫార్మా షేర్లు లాభాల బాట పట్టాయి. టర్కిష్ ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రపంచంలోని వివిధ కరెన్సీ విలువలు క్షీణించడంతో డాలర్ 13నెలల గరిష్టానికి చేరుకుంది. అందులో భాగంగా నేడు భారత కరెన్సీ 69.49వద్ద కొత్త జీవిత కాల కనిష్టాన్ని నమోదు చేసింది. డాలర్ మారకంలో రూపాయి పతనంతో విదేశీ ఎగుమతులపై ఆధారపడే ఐటీ, ఫార్మా షేర్లు నేటి ట్రేడింగ్ పరుగులు పడుతున్నాయి.
ఫార్మా షేర్లు:- ఎన్ఎస్ఈ ఫార్మా షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఫార్మా సూచి ఇంట్రాడేలో 1శాతానికి పైగా లాభపడింది. ఎన్ఎస్ఈలో అత్యధికంగా లాభపడిన సూచి ఇదే. మధ్యాహ్నం గం.12:00లకు పార్మారంగానికి సిప్లా, సన్‌ఫార్మా షేర్లు 2శాతం ర్యాలీచేశాయి. అలాగే డాక్టర్ రెడ్డీస్, కేడిల్లా హెల్త్‌కేర్, అరబిదో ఫార్మా, బయోకాన్ షేర్లు 1శాతం లాభపడ్డాయి. వాటితో లుపిన్ అరశాతం వరకు లాభపడింది. మరోవైపు గ్లెన్‌మార్క్, దివిస్ ల్యాబ్స్, పిరమిల్ ఎంటర్ప్రైజెస్ లిమిడ్ షేర్లు అరశాతం వరకు నష్టపోయాయి. వీటిలో సిప్లా షేరు మిడ్‌సెషన్ సమయానికి 2శాతం లాభంతో నిఫ్టీ - 50 టాప్ - 5 గెయినర్లలో చోటు దక్కించుకుంది.
ఐటీ షేర్లు:- రూపాయి పతనం ఐటీ షేర్లకు కలిసొచ్చింది. ఎన్ఎస్ఈ ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిప్టీ ఐటీ ఇండెక్స్ 1శాతం వరకూ ర్యాలీ చేసింది. మధ్యాహ్నం గం.12:00లకు ఐటీ రంగానికి చెందిన మైండ్ ట్రీ 3శాతం లాభపడగా, టాటా ఎలక్సీ, టెక్ మహీంద్రా, కేపీఐటీ, హెచ్‌సీఎల్ టెక్, ఒరాకిల్ ఫైనాన్స్ సర్వీసెస్ షేర్లు 1శాతం వరకూ ర్యాలీ చేశాయి. అలాగే ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు 1శాతం, విప్రో అరశాతం పెరిగాయి. అయితే ఇదే సమయానికి ఇన్ఫీభీమ్ మాత్రం అరశాతం నష్టాల్లో ట్రేడ్ అవుతోంది.
You may be interested
2-3 ఏళ్ల పెట్టుబడి కోసం ఐదు సిఫార్సులు
Monday 13th August 2018మ్యూచువల్ ఫండ్స్‌లోకి ఇన్వెస్ట్మెంట్ల వరద కొనసాగుతుందని ధీమా వ్యక్తంచేశారు మెహ్తా గ్రూప్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సీ. సిప్ ఇన్వెస్ట్మెంట్లలో గణనీయమైన వృద్ధి కనిపిస్తోందన్నారు. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ఏయూఎం విలువ 2025 నాటికి రూ.100 లక్షల కోట్ల మార్క్‌ను చేరొచ్చనే అంచనాలున్నాయని పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. స్థూల ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల, కంపెనీల ఎర్నింగ్స్ ఆశావహంగా ఉండటం,
హెచ్‌డీఎఫ్‌సీబ్యాంక్ కొనొచ్చా?
Monday 13th August 2018సోమవారం ట్రేడింగ్‌లో హెచ్‌డీఎఫ్‌సీబ్యాంకు షేరు దాదాపు 2 శాతం పతనమైంది. బ్యాంకు డిప్యుటీ ఎండీ పరేశ్ సుక్తాంకర్ రాజీనామా ప్రభావం బ్యాంకు షేరుపై పడింది. పరేశ్ రాజీనామా వార్తతో బ్యాంకు ఏడీఆర్ శుక్రవారం అమెరికా మార్కెట్లో భారీగా నష్టపోయింది. దాదాపు రెండు దశాబ్దాలు పరేశ్ బ్యాంకుకు సేవలనందించారు. ఈ నేపథ్యంలో బ్యాంకు షేరు మరింత పతనం కావచ్చని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. మరో 2- 3 శాతం షేరు